ఓ సొగసరి.. ప్రియలాహిరి

వాస్తవ సంఘటనల ఆధారంగా క్రైమ్‌ డ్రామాగా దర్శకుడు కరుణ కుమార్‌ రక్షిత్, నక్షత్ర అనే నటీనటులతో తెరక్కెక్కిస్తున్న చిత్రం ‘పలాస 1978’. తాజాగా ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. ‘ఓ సొగసరి ప్రియలాహిరి’ అంటూ సాగే ఈ పాట ఆనాటి కాలానికి సంబంధించిందిగా ఉంటుంది. అచ్చమైన పల్లెటూరి ప్రేమకథను గుర్తు చేసే ఈ పాటను ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, తన సింగింగ్‌ ట్యాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన బేబీ ఆలపించారు. ఈ పాట వీళ్లిద్దరూ కలిసి పాడుతున్నారని చిత్ర బృందం ముందుగానే ప్రకటించడంతో అంచనాలు పెరిగిపోయాయి. అనుకున్నట్టుగానే బాలు,బేబీ పోటీ పడి ఈ పాటను ఆలపించి శ్రోతల హృదయాలను దోచుకున్నారు. లక్ష్మీ భూపాల అందించిన సాహిత్యానికి రఘుకుంచె సంగీతం తోడై మంచి మెలోడిని అందించారు. అంతేకాదు రఘు ఈ చిత్రంలో విలన్‌గా కూడా దర్శనమివ్వబోతున్నాడు. ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాను తమ్మారెడ్డి భరద్వాజ్‌ సమర్పిస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.