‘మిఠాయి’లో డర్టీ సాంగ్‌

‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాలతో యువతరంలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు హాస్యనటులు ప్రియదర్శిని, రాహుల్‌ రామకృష్ణ. వీరిద్దరూ కలిసి కథానాయకులుగా నటిస్తున్న తొలి చిత్రం ‘మిఠాయి’. నూతన దర్శకుడు ప్రశాంత్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రెడ్‌ యాంట్స్‌ పతాకంపై డాక్టర్‌ ప్రభాత్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూర్చారు. తాజాగా చిత్రంలోని ఓ సాంగ్‌ను విడుదల చేశారు. దానికి డర్టీ సాంగ్‌ అని నామకరణం కూడా చేశారు. ఈ పాటలోని సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. కమల్‌ కామరాజ్, అజయ్‌ ఘోష్, అర్ష, రవి, శ్వేత, భూషణ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సంబంధిత వ్యాసాలు
సంబంధిత ఫోటోలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.