10 కోట్ల హృదయాల్ని మీటిన పాట!

సినిమా పాటల్లో సాహిత్యం కొరవడుతుందనే అభిప్రాయం కొందరిది. సంగీత ధ్వనుల్లో స్వరం వినిపించట్లేదనే వాదన మరికొందరిది. ఇవన్నీ నిజం కాదని నిరూపించింది ‘నీలి నీలి ఆకాశం’ పాట. సాహిత్యానికి తగిన సంగీతం, సంగీతానికి తగిన స్వరం తోడై ప్రతి ఒక్కరి మదిని మీటింది. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. సిద్‌ శ్రీరామ్, సునీత ఆలపించారు. ఇటీవలే విడుదలైన ఈ గీతం (లిరికల్‌ వీడియో) యూ ట్యూబ్‌లో 100 మిలియన్‌ వీక్షణలు సొంతం చేసుకుంది. తెలుగు సినీ పాటల పల్లకిలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ప్రియురాలి అందం ముందు ప్రకృతి సైతం చిన్నబోతుందని తెలిపే ప్రయత్నం ఇది. ప్రదీప్‌ మాచిరాజు, అమృత అయ్యర్‌ జంటగా తెరకెక్కిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలోని ప్రేమ గీతమిది. ఈ సినిమాకు మున్నా దర్శకత్వం వహించారు. ఎస్వీ బాబు నిర్మాత.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.