ప్రణామం.. ప్రణామం..

ఫలానా పాట ఏ చిత్రంలోది? అంటే టక్కున చెప్తారు సంగీత అభిమానులు. అంతగా శ్రోతల హృదయాల్ని హత్తుకుంటాయి కొన్ని గీతాలు. ఈ జాబితాలోనే నిలుస్తుంది రామజోగయ్య శాస్త్రి రచించిన ‘ప్రణామం ప్రణామం’ పాట. ప్రణామం అంటే ‘జనతా గ్యారేజ్‌’.. జనతా గ్యారేజ్‌ అంటే ‘ప్రణామం’. ఈయన ప్రేమ గీతాల్ని ఎంత చక్కగా రాయగలరో.. సమాజాన్ని చైతన్యపరిచే గేయాల్ని అంతే చక్కగా రాయగలరని ఈ పాటతో మరోసారి నిరూపించుకున్నారు. సినిమా కథ పరంగా ప్రకృతి గొప్పతనం గురించి తెలియజేసే పాట ఇది. సామాజిక అంశాన్ని ఉర్రూతలూగించేలా రాయడం ఆయనకే చెల్లింది. ‘‘మన చిరునవ్వులే పూలు, నిట్టూర్పులే తడిమేఘాలు, హృదయమే గగనం, రుధిరమే సంద్రం, ఆశే పచ్చదనం, మారే రుతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం’’ అంటూ ఆయన చేసిన ప్రయోగం ఆయన స్థాయిని పెంచింది.శ్రోతల్ని పదే పదే వినేలా చేయడమే కాదు నంది అవార్డును తెచ్చిపెట్టింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడుగా కొరటాల శివ తెరకెక్కించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. గానం: శంకర్‌ మహదేవన్‌. నేటి ఈ చిత్రం విడుదలై నాలుగేళ్లు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.