కిర్రాక్‌ పుట్టిస్తోన్న ‘సాహో’ సైకో సైయాన్‌!!

‘సాహో’ విడుదల తేదీ దగ్గర పడుతుండంతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్ర తొలి పాట ‘‘సైకో సయ్యాన్‌’’ విడుదల చేశారు.  ప్రభాస్‌ - శ్రద్ధాల లుక్స్, వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ స్టైలిష్‌గా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓ పబ్‌ వాతావరణంలో సాగుతున్న ఈ పాటలో శ్రద్ధా హాట్‌ స్కర్ట్‌లో కిర్రాకు పుట్టించేలా స్టెప్పులేయగా.. మధ్యలో డార్లింగ్‌ సైతం తనదైన శైలిలో కాలు కదిపాడు. ఈ పాటకు ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు తనిష్క్‌ బాఘ్చి స్వరాలు సమకూర్చగా.. శ్రీజో సాహిత్యాన్ని అందించారు. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం.. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.