ఆకట్టుకుంటున్న.. ‘‘పాపా నీకేదంటే ఇష్టం’’
తెలుగు, తమిళ చిత్రసీమల్లో కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు సాధించుకుంది నటి రాయ్‌ లక్ష్మీ. ఇప్పుడీ భామ క్రిష్ణ కిషోర్‌ దర్శకత్వంలో ‘వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి’ పేరుతో ఓ సినిమా చేస్తోంది. ఏబీటీ క్రియేషన్స్‌ పతాకంపై ప్రవీణ్, మధు నందన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర తొలి లిరికల్‌ పాట విడుదలైంది. ‘పాపా నీకేందంటే ఇష్టం..’ అంటూ సాగే ఈ పాట కుర్రకారును ఆకట్టుకుంటోంది. మాస్‌ హంగులు జోడించి ఈ పాటను చిత్రించారు. పూజిత పొన్నాడ, కార్తిక్‌, ప్రవీణ్‌, మధునందన్‌, బ్రహ్మాజీ, ‘జబర్దస్త్‌’ మహేశ్‌, జెమిని నరేశ్ తదితరులు సహాయ పాత్రలు పోషించారు.


హరి గౌర సంగీతం అందించిన ఈ పాటను మంగ్లీ, హరి గౌర కలిసి ఆలపించారు. ఏబీటీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీధర్‌ రెడ్డి, ఆనంద్‌ రెడ్డి, ఆర్కే రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రత్యేక గీతాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు రాయ్‌ లక్ష్మి. ‘ఖైదీ నెం 150’లో ‘రత్తాలు..’ పాటలో మెరిసిన లక్ష్మి ఆ తర్వాత ‘జూలీ 2’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. చాలాకాలం తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు చిత్రం ‘వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మి’. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.