ఏమిటో ఇది వివరించలేనిది

నితిన్‌, కీర్తి సురేష్‌ జంటగా వస్తోన్న చిత్రం ‘రంగ్‌ దే’. ఈ ప్రేమ కథకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని తొలి గీతానికి సంబంధించిన లిరికల్‌ వీడియో విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఏమిటో ఇది’ అంటూ సాగే ఈ గీతాన్ని శ్రీమణి రచించారు. కపిల్‌ కపిలన్‌, హరిప్రియ ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చక్కటి మెలొడీ అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేది ఉంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది  ‘రంగ్‌ దే’.  



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.