ఇది సీతా కల్యాణ వైభోగమే..

సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ నటిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ సినిమాలోని ఓ పాటని చిత్ర బృందం విడుదల చేసింది. ‘సీతా కల్యాణ వైభోగమే.. రామా కల్యాణ వైభోగమే’ అంటూ సాగే ఈ మెలోడీకి బాలాజీ సాహిత్యం అందించగా.. శ్రీ హరి ఆలపించారు. సంగీతం ప్రశాంత్‌ పిళ్లై. వివాహానికి సంబంధించిన పాటల జాబితాలో ఈ గీతం చేరుతుంది. ఈ పాటలో హీరోయిన్‌ కల్యాణి ప్రియదర్శన్‌, శర్వానంద్‌ వధూవరులుగా ఒదిగిపోయారు. ఇటీవలే విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్టు 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.