లాక్డౌన్లో ప్రేక్షకుల్ని అలరించేందుకు ‘తేరే బినా’ అనే పాటను రూపొందించారు సల్మాన్‌ఖాన్. ఆయనే స్వయంగా ఈ పాటను పాడి వీడియోకు దర్శకత్వం వహించారు. రొమాంటిక్‌గా సాగే ఈ వీడియోలో సల్మాన్, జాక్వెలిన్ కనువిందు చేశారు. ఫామ్‌హౌజ్‌లో గుర్రంపై స్వారీ చేస్తూ.. రోడ్డుపై బైక్ మీద చక్కర్లు కొడుతూ.. పాలు పితుకుతూ... స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ సందడి చేశారు. అయితే ఇదంతా కల అని వీడియో చివరలో ఆశ్చర్యపరుస్తాడు సల్మాన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అజయ్ భాటియా స్వరాలు సమకూర్చగా షబ్బీర్ అహ్మద్ సాహిత్యం అందించారు ఈ గీతానికి. ‘మేం ఫాంహౌజ్‌కి వచ్చి ఏడు వారాలైంది. లాక్డౌన్ వల్ల ఇక్కడ ఇన్ని రోజులు ఉంటామనుకోలేదు.అందుకే మిమ్మల్ని అలరించేందుకు ఇలా చేశామ’ని పేర్కొన్నారు సల్లూభాయ్.