నువ్వెళ్లే రహదారికి జోహారు!

‘సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్లే రహదారికి జోహారు’ అంటూ భారత సైనికుల త్యాగాన్ని పాట రూపంలో తెలియజేశారు దేవీశ్రీ ప్రసాద్‌. మహేష్‌ కథానాయకుడుగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని గీతమిది. స్వీయ సంగీత దర్శకత్వంలో డీఎస్పీ రచించిన ఈ పాట ప్రతి ఒక్కరిని హత్తుకుంది. దేశం పట్ల స్ఫూర్తిని నింపింది. తాజాగా ఈ ఆంథమ్‌ సాంగ్‌ ఫుల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. శంకర్‌ మహదేవన్‌ ఆలపించిన ఈ గీతం లిరికల్‌ వీడియోకు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఫుల్‌ వీడియో అత్యంత వీక్షణలు సొంతం చేసుకుంటుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. ఇందులో మహేష్‌ సరసన రష్మిక నటించింది. ప్రముఖ నటి విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.