ప్రముఖ కన్నడ కథానాయకుడు శశి కుమార్ తనయుడు అక్షిత్ ‘సీతాయణం’ చిత్రంతో వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. అనహిత భూషణ్ నాయిక. ప్రభాకర్ ఆరిపాక తెరకెక్కిస్తున్నాడు. లలితరాజ్యలక్ష్మి నిర్మాత. రోహన్ భరద్వాజ్ సమర్పకులుగా వ్యవహిరిస్తున్న ఈ చిత్రంలోని ‘మనసు పలికే’ అనే గీతాన్ని ప్రముఖ నాయిక రష్మిక బుధవారం విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్వేత మోహన్ ఆలపించారు. పద్మనాభ్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. విక్రమ్ శర్మ, మధునందన్, విద్యుల్లేఖ,బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది. టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచింది చిత్రబృందం. ఇప్పటికే విడుదైన ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంది.