సిద్‌ శ్రీరామ్‌ స్వరం నుంచి మరో ప్రేమగీతం

ఇటీవలే కాలంలో సంగీత ప్రియుల్ని అమితంగా ఆకట్టుకుంటున్న గాయకుడు సిద్‌ శ్రీరామ్‌. ఆయన పాట ఉంటే చాలు ఆ సినిమాకే హైప్‌ వస్తుందనేది కొందరి మాట. హృదయాన్ని హత్తుకునేలా పాడటమే ఇందుకు కారణం. నెల వ్యవధిలోనే ‘సామజవరగమన’, ‘మనసారా మనసారా’ అనే రెండు పాటలతో శ్రోతల్ని అలరించిన సిద్‌ తాజాగా ‘ఏమో ఏమో’ అంటూ సాగే పాటతో ఆకట్టుకున్నాడు. ఇది ‘రాహు’ అనే చిత్రంలోనిది. అభిరామ్‌ వర్మ, కృతి గార్గ్‌ నాయకానాయికలుగా దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్నారు. ‘ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటి నే సాగగా’ అనే ఈ పాట యువతను బాగా ఆకట్టుకుంటుంది. ‘చెప్పలేని మాయే ప్రేమో ఏమో’ అనే చరణంలో శ్రీరామ్‌ వాయిస్‌ వినసొంపుగా ఉంటుంది. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతానికి శ్రీనివాస్‌ మౌలి సాహిత్యం తోడై ఓ చక్కని ప్రేమగీతం శ్రోతల్ని పలకరించింది. శ్రీ శక్తి మూవీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.