స్టూడెంట్‌ పవరేంటో తెలిపే జై సేన

టాలీవుడ్‌లో విభిన్న కథలు తెరకెక్కించే దర్శకుల్లో వి.సముద్ర ఒకరు. ప్రస్తుతం ఆయన నుంచి ‘జై సేన’ అనే చిత్రం రాబోతుంది. నూతన నటీనటులతో కాలేజీ విద్యార్థుల సమస్యపై తెరకెక్కిస్తున్నట్లు ఉంది తాజాగా విడుదల చేసిన పాటను వింటే. ‘సేన జై సేన’ అంటూ సాగే పాటను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. యువతను అమితంగా ఆకట్టుకుంటుందీ పాట. సంగీత దర్శకుడు రవి శంకర్‌ స్వరాలు సమకూర్చగా పార్వతీ చందు సాహిత్యం అందించారు. గాయకుడు రామ్‌కీ వాయిస్‌ శ్రోతలను అలరిస్తుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.