‘హలో’ అని పలకరిస్తున్న సన్నీ

కుర్రకారు ఆమె పేరును నామస్మరణం చేస్తుంటే ఆమె మాత్రం అందరినీ ‘హలో జీ’ అంటూ పలకరిస్తోంది. ‘జిస్మ్‌ 2’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చిన సన్ని లియోన్, ‘రాగిణి ఎమ్‌ ఎమ్‌ ఎస్‌’ ద్వారా తనలో నటి, డాన్సర్‌ ఉందని నిరూపించుకుంది. ‘రాగిణి’ ఇచ్చిన విజయం తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఎన్నో ప్రత్యేక గీతాల్లో కనిపించి యువతని ఆకట్టుకుంది. మరోసారి ఇటువంటి గీతంతో అంతర్జాలంలో సందడి చేస్తుంది ఈ శృంగార తార. ప్రస్తుతం ఆమె ‘రాగిణి ఎమ్‌ ఎమ్‌ ఎస్‌’ రిటర్న్స్‌ సీజన్‌ 2లో నటిస్తుంది. ఇందులో భాగంగా ‘హలో జీ’ అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటని హిందీ గాయని కనికా కపూర్‌ ఆలపించారు. ఈ వీడియోతో మరోసారి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ఐటమ్‌ గర్ల్‌. ఇందులో సన్నీ దెయ్యం పాత్రలో నటిస్తుంది. ప్రముఖ తెలుగు నటుడు నవదీప్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది గీతం.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.