తరుణ్‌ మారియో కార్టూన్‌ అయ్యాడెందుకిలా??

తరుణ్‌ భాస్కర్‌ను మారియో ఆటలోని కార్టూన్‌లో బొమ్మలా ఫన్నీగా మార్చేశాడు విజయ్‌ దేవరకొండ. తరుణ్‌ ఆ ఆట నుంచి బయటకొద్దామని ఎంత ప్రయత్నించినా.. దురదృష్టం అతన్ని నీడలా వెంటాడుతూ అక్కడే ఆపేస్తుంది. ఇంతకీ ఆయన్ని అంతగా వేధిస్తున్న కష్టాలు కన్నీü™్లంటి? నీడలా వెంటాడుతున్న ఆ దురదృష్టాలేంటి? వంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ ‘మీకు మాత్రమే చెప్తా’ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. విజయ్‌ దేవరకొండ నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ మూవీతో కథానాయకుడిగా తెరకు పరిచయమవుతున్నారు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. కొత్త దర్శకుడు షామీర్‌ సుల్తాన్‌ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘‘లా..లా.. లా.. ఎందుకిలా’’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. తరుణ్‌ భాస్కర్‌ జీవితంలోని కష్టాలను, అతన్ని పట్టిపీడిస్తున్న దరిద్ర దేవతను గూర్చి వివరిస్తూ ఫన్నీగా సాగుతోందీ గీతం. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించగా..శివ కుమార్‌ స్వరాలు సమకూర్చారు. పాట విజువల్స్‌లో తరుణ్‌ను మారియో గేమ్‌లో కార్టూన్‌లా చూపించిన విధానం హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అభినవ్‌ గోమతం, నవీన్‌ జార్జ్‌ థామస్, అనసూయ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.