తోపు నువ్వే.. నీకు నువ్వే కొట్టు సలాం

‘బ్రోచేవారెవరురా’ చిత్రంతో మంచి విజయం అందుకున్న శ్రీవిష్ణు ప్రస్తుతం ‘తిప్పరా మీసం’ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఇతడు క్లాస్‌ లుక్‌లోనే కనిపించాడు. తొలిసారి మాస్‌గా దర్శనమివ్వబోతున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ‘దేత్తడి.. దేత్తడి’ అంటూ సాగే ఈ పాట యువతను అలరిస్తుంది. ఇప్పుడున్న నయా ట్రెండ్‌ డీజేను తలపించేదిగా ఉంది. ఈ ఫాస్ట్‌ బీట్‌లోనూ సాహిత్యానికి పెద్దపీటే వేశారు రచయిత పూర్ణాచారి. ‘గెలుపే అందుకుని ఏక్‌ బార్‌ దేఖ్‌ యారో.. విలువే పెంచుకుని కొట్టు గురు తీన్మారు, నిమిషం నిలువదని.. పయనం ఆగదని’ లాంటి పదాలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. సురేష్‌ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాటను సురేష్‌ బొబ్బిలి, నరేష్‌ ఆలపించారు. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దర్శకుడు కృష్ణ విజయ్‌ తెరకెక్కిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.