‘ఉమామహేశ్వర’ విరహ గీతం

సత్యదేవ్‌ కథానాయకుడుగా ఇటీవలే విడుదలైన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. హరిచందన, రూప కొదువయూర్‌ నాయికలు. తాజాగా ఈ చిత్రంలోని విరహగీతమైన ‘నువ్వేమో’ ఫుల్‌ వీడియో విడుదలైంది. కథానాయకుడ్ని ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని చేసుకునే సన్నివేశంలో వచ్చే పాట ఇది. సినిమా విడుదలకు ముందే ఈ పాట శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకుంది. రెహమాన్‌ సాహిత్యం ప్రధమంగా నిలస్తుంది. సందర్భోచిత చరణాలు రాసి పాటను మరోస్థాయికి తీసుకెళ్లారు. బిజిబల్‌ స్వరాలు సమకూర్చగా కాల భైరవ, సితార ఆలపించారు. ఈ పాట వింటున్నప్పుడు ఎంత ఉద్వేగం కలుగుతుందో.. సత్య దేవ్‌ నటనకు అంతే భావోద్వేగానికి గురవుతారు ప్రేక్షకులు. ఈ చిత్రాన్ని ‘కంచరపాలెం’ ఫేం వెంకట్‌ మహా తెరకెక్కించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.