రంగులద్దుకున్న తెల్ల రంగులవుదాం..

అందరూ ఉన్న చోట ఇద్దరవుదాం.. ఎవ్వరూ లేని చోట ఒక్కరవుద్దాం.. ఏ క్షణం విడివిడిగాలేమందాం అంటున్నారు ఆ ప్రేమికులు. వాళ్ల మధురక్షణాల్ని ఎవరికైనా తెలిపితే ప్రకృతినే శిక్షిస్తామంటున్నారు. ఈ ప్రేమికులు మరెవరో కాదండోయ్‌ ‘ఉప్పెన’ నాయకానాయికలు వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి. ఈ ఇద్దరి జంటగా తెరకెక్కిన ‘రంగులద్దుకున్న’ పాటను ప్రముఖ కథానాయకుడు మహేష్‌ బాబు విడుదల చేశారు. శ్రీ మణి సాహిత్యం అందించిన ఈ వైవిధ్య ప్రేమ గీతాన్ని యాజిన్‌ నైజర్‌, హరిప్రియ చక్కగా ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని రెండు పాటలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఈ పాట సైతం అదే స్థాయిలో మెప్పించే విధంగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.