కనులు నీవే.. కలలు నీవే..


రుణ్‌ తేజ్‌, తమిళ నటుడు అధర్వ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రంలోని ‘గగన వీధిలో.. ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపులా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌ ఎప్పటిలానే తన మెలోడి మార్క్‌ను చూపించాడు. అచ్చ తెలుగులో వనమాలి సాహిత్యం తోడై శ్రోతలను అలరిస్తుంది. ‘కవిత నీవే.. కథవు నీవే, కనులు నీవే.. కలలు నీవే’ చరణం వినసొంపుగా ఉన్నాయి. నటుడు అధర్వ, కథానాయిక మృణాళిని రవిపై చిత్రీకరించిన ఈ పాటను గాయకుడు అనురాగ్‌ కులకర్ణి, స్వేత సుబ్రహ్మణ్యన్‌ ఆలపించారు. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబరు 20న విడుదల కానుంది.

                                         


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.