హుషారెత్తిస్తున్న ‘వెంకీమామ’ కోకో కోలా పెప్సీ సాంగ్‌

వెంటటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకుడు. ఇందులో వెంకీ, చైతూ మామా అల్లుళ్లుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. వీళ్లకు జోడిగా పాయల్‌ రాజ్‌పుత్, రాశిఖన్నా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ‘మిలటరీ నాయుడు మిలటరీ నాయుడు చూస్తే సుర సుర తుపాకులే పేలుడు.. విక్టరీ అల్లుడు విక్టరీ అల్లుడు వస్తే జర జర జరీ చీరే జారుడు’ అంటూ హుషారుగా సాగుతుందీ పాట. బాణీలకు తగ్గట్టుగా నాయకానాయికల స్టెప్పులు అలరిస్తున్నాయి. ‘కోకో కోలలా పెప్సీ ఈ మామా అల్లుడు సెక్సీ’ అంటూ మధ్యలో వచ్చే చరణం శ్రోతల్ని అలరిస్తుంది. కాసర్ల శ్యాం సాహిత్యం అందించిన ఈ పాటను అతిథి భావరాజు, రమ్య బెహర, సింహా, హనుమాన్‌ ఆలపించారు. తమన్‌ సంగీత స్వరాలు సమకూర్చారు. డిసెంబరు 13న ప్రేక్షకుల మ³ందుకు రానుందీ చిత్రం.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.