ఇదేరా ఇదేరా గెలుపంటే ఇదేరా!

నాని కథానాయకుడుగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. విజయ్‌ దేవరకొండ, కృష్ణంరాజు కీలక పాత్రలు పోషించారు. మాళవిక నాయర్‌, రీతు వర్మ నాయికలు. నువ్వెవరో తెలుసుకో.. అనే వినూత్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఆలోచింపజేసింది. నేటితో ఈ సినిమా ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది. 2015 మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. కొన్ని సన్నివేశాలు ఎవరెస్ట్‌ శిఖరంపై చిత్రీకరించారు. సహజత్వం ఉట్టిపడేందుకు ఎన్నో సవాళ్లు స్వీకరించి షూటింగ్‌ పూర్తి చేసిన విధానాన్ని ఇందులో చూపించారు. సముద్ర మట్టానికి 5300మీటర్ల ఎత్తులో 32 రోజులు నిర్విరామంగా పనిచేసింది చిత్ర బృందం. ఎవరెస్టు పర్వత ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు సినిమాగా నిలిచింది ‘ఎవడే స్రుబహ్మణ్యం’. కథలో భాగంగా వచ్చే ‘ఇదేరా ఇదేరా గెలుపంటే ఇదేరా’ పాటను ఈ వీడియోకు జతచేశారు. ఈ సినిమాకు రధన్‌, ఇళయరాజా సంగీత దర్శకులు. స్వప్న సినిమా పతాకంపై ప్రియాంక దత్, స్వప్న దత్‌ నిర్మించారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.