Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
వీళ్లకి వాళ్లంటే మహా ఇష్టం
నచ్చిన హీరో సినిమా వస్తుంటే ఏదోతెలియని సంతోషం... ఇష్టమైన హీరోయిన్ ఫొటో గదిలో గోడకు వేలాడుతుంటే ఆనందం... ఇలాంటి సెలబ్రిటీ క్రష్‌లు అందరికీ ఉండేవే. కొన్నేళ్లపాటు ఆ వ్యక్తిని ఆరాధిస్తూ గడిపేసే ఆ క్రేజీ ఫీలింగ్ మనకే కాదండోయ్... తమ అందం, అభినయంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న కథానాయికలకూ ఉంటుంది. వాళ్లంటే ఎంతమంది ఇష్టపడినా, వాళ్లకు మాత్రం ఆ ఒక్కరంటేనే అభిమానమట. మరి అదెవరో చూద్దామా!
నాయికా ప్రాధాన్యం.. ఆ మాటలకు చరమగీతం
కథానాయిక అంటే ఆటపాటలకు, అందాల ఆరబోతకే పరిమితం అనే మాటలకు చరమగీతం పాడేస్తున్నారు నాయికలు. హీరోలకు మేం ఏం తక్కువ కాదు... మా చిత్రాలు బాక్సాఫీసు వద్ద వసూళ్లు కురిపిస్తాయంటూ దూసుకుపోతున్నారు. దీంతో దర్శకనిర్మాతలు మహిళా చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యమే ఇస్తున్నారు. అగ్ర నాయికలు మొదలు యువతరం భామల వరకూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అంటే సై అనేస్తున్నారు. ఈ ఏడాదీ అలా పలు నాయికా ప్రాధాన్య చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నా కరోనాతో కొన్నే ప్రేక్షకుల ముందుకు వెళ్లాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. థియేటర్లు తెరుచుకుంటున్నాయి. త్వరలో మరిన్ని నాయికా చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి.
‘లక్ష్మీ’ సందడి మొదలైంది
సినిమా తెరకెక్కించడమే కాదు దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడమూ కళే. కథ బావున్నా ప్రచారం లేని సినిమాల పరిస్థితి ఏంటో చాలామందికి తెలిసిన విషయమే. ఇందుకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా ఏమీ ఉండదు. అగ్ర నటులైనా.. కొత్తవారైనా తాము నటించిన చిత్రాల గురించి ప్రొమోట్ చేయాల్సిందే. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందుకు సందడీ చేయాల్సిందే. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇదే జోరు చూపిస్తూ సినీ ప్రియుల్ని తనవైపు తిప్పుకుంటున్నారు. ఈయన ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘లక్ష్మీ’. కియారా అడ్వాణీ నాయిక. రాఘవ లారెన్స్ దర్శకుడు.
కొత్త జోడీ.. కనువిందుకు రెడీ
కరోనా కొట్టిన దెబ్బ చిత్రసీమను గట్టిగానే తాకింది. ఎన్నో వినోదాలతో ఈ ఏడాది సాగుతుందని ఊహించిన ప్రేక్షకుడికి నిరాశే మిగిలింది. ప్రేక్షకుల్ని అలరించలేకపోయాం అనే బాధ తారల్లోనూ కనిపిస్తోంది. అన్నింటిని మరిచి ఇప్పుడిప్పుడే చిత్రసీమ గాడిలో పడుతోంది. థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు వచ్చినా సరైన సినిమాలు లేకపోవడంతో చాలా చోట్ల థియేటర్లు తెరవలేదు. ఈ ఏడాది కోల్పోయిన వినోదాల్ని వచ్చే ఏడాదిలోనైనా పొందాలని ప్రేక్షకులు, రెట్టింపు ఎంటర్టైన్ చేయాలని తారలు ఎదురుచూస్తున్నారు. పలు కొత్త తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దీంతో పాటు పలు కొత్త జంటలు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జంటల్లో అగ్రతారలూ ఉన్నారు. యువతరం నటులు అలరించబోతున్నారు. వాటిల్లో అటు చిత్ర సీమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేపుతున్న జంటల గురించి ఓసారి చదివేద్దాం.
టైటిల్ మారింది!
వివిధ కారణాల వల్ల సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందుగా టైటిల్ మారుతుంటుందనే విషయం తెలిసిందే. తాజాగా అక్షయ్ చిత్రానికి ఇదే జరిగింది. అక్షయ్ , కియారా అడ్వాణీ జంటగా రూపొందిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్. రాఘవ లారెన్స్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకుని ఇదే పేరుతో విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం పేరును మార్చినట్టు ఓ పోస్టర్ని విడుదల చేసింది. ‘లక్ష్మీ బాంబ్’ని ‘లక్ష్మీ’గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దర్శకనిర్మాతలు. దీపావళి కానుకగా నవంబరు 9న డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ ప్లాట్ఫామ్లో విడుదల కానుందీ చిత్రం.
భయపెడుతోన్న ‘లక్ష్మీబాంబ్’
అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్. రాఘవ లారెన్స్ దర్శకుడు. తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులోని అక్షయ్ నటన ఆకట్టుకుంటుంది. కియారా అందం ఆకర్షిస్తుంది. ఆద్యంతం భయపెడుతూ అలరిస్తుందీ ట్రైలర్. ముఖ్యంగా అక్షయ్ హావభావాలు ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తున్నాయి. దీపావళి కానుకగా నవంబరు 9న డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ ప్లాట్ఫామ్లో విడుదల కానుందీ చిత్రం. తెలుగులో లారెన్స్ కథానాయకుడుగా నటించిన ‘కాంచన’ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది ‘లక్ష్మీబాంబ్’.
భయపెడుతోన్న ‘లక్ష్మీబాంబ్’
అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్. రాఘవ లారెన్స్ దర్శకుడు. తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులోని అక్షయ్ నటన ఆకట్టుకుంటుంది. కియారా అందం ఆకర్షిస్తుంది. ఆద్యంతం భయపెడుతూ అలరిస్తుందీ ట్రైలర్. ముఖ్యంగా అక్షయ్ హావభావాలు ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తున్నాయి. దీపావళి కానుకగా నవంబరు 9న డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ ప్లాట్ఫామ్లో విడుదల కానుందీ చిత్రం. తెలుగులో లారెన్స్ కథానాయకుడుగా నటించిన ‘కాంచన’ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది ‘లక్ష్మీబాంబ్’.
దీపావళి కానుకగా ‘లక్ష్మీబాంబ్’
అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్. రాఘవ లారెన్స్ దర్శకుడు. తాజాగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. దీపావళి కానుకగా నవంబరు 9న డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ ప్లాట్ఫామ్లో విడుదల చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు అక్షయ్. తెలుగులో లారెన్స్ కథానాయకుడుగా నటించిన ‘కాంచన’ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది ‘లక్ష్మీబాంబ్’. తెలుగులోనూ లారెన్సే దర్శకుడు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఎంటర్టైన్మెంట్, తుషార్ ఎంటర్టైన్ హౌజ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
పాన్ ఇండియా చిత్రాలకు బాలీవుడ్ భామలు
కథానాయిక కావాలా? ముంబయి వెళ్దాం! హీరోయిన్ కోసం వెదుకుతున్నారా? బాలీవుడ్ ఉందిగా..! పాన్ ఇండియా సినిమా అంటే మరి ఆ మాత్రం కావద్దూ?... ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. తెలుగులో స్టార్ హోదా దక్కించుకున్న కథానాయికలు బోలెడుమంది. కొత్త భామలకీ కొదవలేదు. అయినా సరే... స్టార్ హీరో నటించనున్న సినిమాలో హీరోయిన్ కావాలనగానే బాలీవుడ్‌వైపు చూస్తుంటారు దర్శకనిర్మాతలు. కియారా డేట్లు ఖాళీగా ఉన్నాయా? అలియాని సంప్రదిస్తే ఎలా ఉంటుంది? దీపికా మాటేమిటి? అనన్య పాండే మన హీరో పక్కన బాగానే ఉంటుందా? అంటూ ఆరాలు తీస్తుంటారు. కొత్తందాన్ని చూపించాలనే తపన, మార్కెట్ లెక్కలు... ఇలా పలు కారణాలు దీనివెనుక కనిపిస్తున్నాయి.
ఖాళీగా ఉన్నామని తింటే లావైపోతాం!
లాక్డౌన్లో కొందరు తారలు నచ్చినవి తింటూ సినిమాలు చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారు. కొందరు కొత్త కళల్ని నేర్చుకునే పనిలో ఉన్నారు. ‘భరత్ అనే నేను’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన నాయిక కియారా అడ్వాణి. ఆమె కొత్త వంటలు నేర్చుకుంటోంది ‘‘నేను అందరిలానే వంటలు చేయడంలో మునిగిపోయాను. అలాగని నోటికి నచ్చిన ప్రతి వంటకాన్ని మాత్రం తినడం లేదు. ఎందుకంటే ఇదే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఖాళీగా ఉన్నాం కదా అని ఏదిబడితే అది తినేస్తే లావైపోతాం. లాక్డౌన్ తర్వాత షూటింగులు మొదలయ్యేనాటికి బరువు తగ్గాలంటే కష్టమవుతుంది. అందుకే ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతున్నాన’’ని చెప్పింది కియారా.
1
2
3
4
5
6
Next
Last