Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
రివ్యూ: మాస్టర్
తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు విజయ్. గత కొన్నేళ్లుగాగా ఆయన నటించిన సినిమాలు ఏకకాలంలో తమిళం, తెలుగులో విడుదలవుతున్నాయి. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంచుకునే కథలు, సినిమాలు ఇక్కడి ప్రేక్షకులనూ అలరిస్తున్నాయి. తాజాగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘మాస్టర్’. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యంగా ఈ సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాలో విజయ్ నటన ఎలా ఉంది? ‘ఖైదీ’తో క్రేజ్ సంపాదించిన లోకేశ్ కనకరాజ్ విజయ్ను ఎలా చూపించారు? ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి మెప్పించారా?
‘మాస్టర్’ సీన్స్ లీక్.. దర్శకుడి భావోద్వేగ ట్వీట్
భారీ అంచనాల నడుమ తెరకెక్కి ఎన్నో సవాళ్లు ఎదుర్కొని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన ‘మాస్టర్’ చిత్రబృందానికి నిరాశ ఎదురైంది. జనవరి 13న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇంతలోనే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయి. ఎలా బయటకు వచ్చాయో సమాచారం లేదు కానీ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. భావోద్వేగానికి గురైన చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘మాస్టర్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు 18నెలలు(సంవత్సరంనర) పట్టింది. మీ అందరూ ఈ సినిమాను థియేటర్లలోనే చూస్తారని భావిస్తున్నాం. ఒకవేళ మీ దగ్గరకు మాస్టర్ సన్నివేశాలు వస్తే దయచేసి వాటిని ఇతరులకు షేర్ చేయకండి. ధన్యవాదాలు. ఒకే ఒక్కరోజు ఆగండి మాస్టర్ చిత్రం మీదే అవుతుంద’ని ప్రేక్షకుల్ని కోరారు. విజయ్, విజయ్ సేతుపతి నాయకాప్రతినాయకులుగా నటించారు. మాళవిక మోహనన్, ఆండ్రియా నాయికలు. అనిరుధ్ సంగీతం అందించారు. గ్జావియర్ బిట్టో నిర్మించారు. ‘ఖైదీ’ తర్వాత లోకేశ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది.
కత్రీనా కైఫ్ విజయ్ సేతుపతి జంటగా!
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ త్వరలోనే ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నటీనటులుగా కత్రీనా కైఫ్, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్నారు. కోవిడ్ కారణంగా దర్శకుడు వరుణ్ ధావన్ నటించాల్సిన ఎక్కిస్ అనే చిత్రం అర్ధాంతరంగా ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పై దర్శకుడు శ్రీరామ్ రాఘవ్ దృష్టి మరల్చాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళంలో కాతువాకుల రెండు కాదల్ చేస్తున్నారు. ఈ మధ్యే తమిళంలో వచ్చిన మానగరం చిత్రాన్ని హిందీలో సంతోష్ శివన్ రీమేక్ చేస్తున్నారు.
‘మాస్టర్’కి విలన్‌గా నాని.. కానీ
‘మాస్టర్’ చిత్రంలో నాని విలన్ ఏంటి? అనుకుంటున్నారా. అవును అంటే ఇది చదివేయండి.. ‘మాస్టర్’ని విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. ఈ సందర్భంగా (చిత్ర ప్రచారంలో భాగంగా) ఆసక్తికర అంశం ఒకటి కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో కథానాయకుడి పాత్రకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో అదే స్థాయిలో ప్రతినాయకుడి పాత్ర ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లో ఇది అర్థమవుతుంది. విజయ్, విజయ్ సేతుపతి పోటీపడి ఓ రేంజ్లో అదరగొట్టారు. విజయ్ తగ్గ విలన్ సేతుపతే అని అందరూ చప్పకనే చెప్పారు. అయితే ఈ పాత్ర కోసం సేతుపతినే కాదు మాధవన్, నానిని కూడా అనుకున్నారట. మంచి క్రేజ్ ఉన్న ఈ పాత్రలో ముందుగా సేతుపతినే అనుకున్నప్పటికీ.. ఆయన నటిస్తారో లేదో అనే సందేహంలో పడిందట చిత్రబృందం. ఒకవేళ సేతుపతి నో చెప్తే ఆ స్థానంలో మాధవన్, నానిని తీసుకుందామని భావించినట్లు ఓ తమిళ దర్శకుడు తెలిపారు. అలా నాని చేయాల్సి ఉండేవారేమో కానీ సేతుపతికి ఆ కీ రోల్ అమితంగా నచ్చడంతో వెంటనే ఓకే చేశారు.
విజయ్ సేతుపతి - విక్రాంత్ మాస్సేల కొత్త చిత్రం ముంబైకర్!
తమిళనటుడు విజయ్ సేతుపతి - బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే ఓ కొత్త చిత్రం చేస్తున్నారు. సంతోష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ముంబైకర్ అనే పేరు ఖరారు చేశారు. రియా షిబు సమర్పణలో వస్తోన్న చిత్రంలో తాన్య మణిక్తాలా, హృదు హరూన్, సంజయ్ మిశ్రా, రణవీర్ షోరే, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షిబు థమీన్స్ నిర్మాత. సినిమా గురించి ట్విట్టర్ వేదికగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ స్పందిస్తూ..అద్భుతమైన సినిమా..అసాధారమైన ప్రతిభావంతులైన నటీనటులకు నా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా తమిళంలో 2017లో విడుదలైన మానగరం చిత్రానికి రీమేక్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ చిత్రం ఇది. విజయ్ సేతుపతి తొలుత అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటించాల్సి ఉంది. అయితే ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ముంబైకర్ చిత్రం కోసం తెరపైకి వచ్చారు. ఇందులో విక్రాంత్ మాస్సే పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటి వరకు అతను ఇలాంటి పాత్రలో కనిపించలేదని సమాచారం.
సంక్రాంతి బరిలో ‘మాస్టర్’
2021 సంక్రాంతి బరిలో తమిళ చిత్రం ‘మాస్టర్’ నిలుస్తుంది. విజయ్, విజయ్ సేతుపతి కథానాయకులుగా ‘ఖైదీ’ ఫేం లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన చిత్రమిది. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, సెవెన్ స్ర్కీన్ స్టూడియో, ఎక్స్ బీ ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థలు నిర్మించాయి. మంగళవారం చిత్ర విడుదల తేదీని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది చిత్ర బృందం. జనవరి 13న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘క్రాక్’, ‘రెడ్’, ‘అల్లుడు అదుర్స్’ తదితర తెలుగు చిత్రాలతో పోటీ పడబోతున్నాడు ‘మాస్టర్’. ఇప్పటికే విడుదలైన పాటలు,టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు నమోదు చేశాయి.
షాహిద్ సరసన..
కథానాయికలు వెబ్‌సిరీస్‌ల్లో మెరిసేందుకు మక్కువ ప్రదర్శిస్తున్నారు. సమంత, తమన్నా, సాయిపల్లవి... తదితర దక్షిణాది తారలంతా ఇప్పటికే ఈ అవకాశాలు అందుకున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో కథానాయిక రాశీ ఖన్నా చేరింది. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షాహిద్ కపూర్‌తో కలిసి రాశీ ఖన్నా ఓ వెబ్‌సిరీస్‌లో సందడి చేయనుంది. రాజ్ - డి.కె దర్శక ద్వయం యాక్షన్ థ్రిల్లర్ కథతో వెబ్‌సిరీస్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వచ్చే జనవరిలోనే చిత్రీకరణ మొదలు కానున్నట్టు సమాచారం. షాహిద్ కపూర్‌తోపాటు దక్షిణాదికి చెందిన విజయ్ సేతుపతి తదితర తారలు అందులో నటిస్తున్నట్టు తెలిసింది. రాశీ ఖన్నా కూడా అవకాశం సొంతం చేసుకుంది. రాజ్ - డి.కె రూపొందిస్తున్న ‘ది ఫ్యామిలీ మేన్ 2’తోనే సమంత వెబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.
‘చిట్టి స్టోరీ’ తెలుగు వెర్షన్ వచ్చేసింది
‘కుట్టి స్టోరీ’ అంటూ కోలీవుడ్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించారు యువ సంగీత దర్శకుడు అనిరుధ్. తాజాగా అదే పాటకు సంబంధించిన తెలుగు వెర్షన్ లిరికల్ వీడియో విడుదలైంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అనిరుధ్, శ్యామ్ విశాల్ ఆలపించారు. తెలుగు, ఆంగ్ల పదాలతో సాగే పాట యువతను బాగా మెప్పిస్తుంది. తమిళ స్టార్ నటులు విజయ్, విజయ్ సేతుపతి కలిసి నటించిన ‘మాస్టర్’ చిత్రంలోని సాంగ్ ఇది. లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే తెలుగు ట్రైలర్‌ని విడుదల చేయగా.. ఇప్పుడు పాటని విడుదల చేశారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఆండ్రియా నాయికలు.
హిందీ వెబ్ సీరీస్‌లో విజయ్ సేతుపతి
దక్షిణాది నటుడు విజయ్ సేతుపతి క్యారక్టర్ నటుడి నుంచి కథానాయకుడి పాత్రల్లోనూ అలరించారు. తాజాగా తమిళ తంబి హిందీలో తెరకెక్కించబోయో ఓ వెబ్ సీరీస్ చిత్రంలో నటించనున్నాడట. కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ కూడా ఇందులో నటిస్తున్నారు. రాజ్ - కృష్ణ డీకేల రూపొందించే ఈ సీరీస్‌లో షాహిద్ కబీర్ పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయట. ఇంకా చిత్రానికి టైటిల్ పెట్టలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న చిత్రంలో వీరి పారితోషికాలు కూడా భారీగా ఉంటాయని చెప్పుకుంటున్నారు. చిత్రాన్ని వచ్చే యేడాది జనవరిలో షూటింగ్‌ని ప్రారంభించే యోచనలో ఉన్నారట. ముఖ్యంగా తీర ప్రాంతాలైన, గోవా, ముంబైల్లో యాక్షన్ థ్రిల్లర్ల ఎపిసోడ్లని చిత్రీకరించే ఆలోచనలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్లో లాల్ సింగ్ చద్దా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు మణిరత్నం తమిళంలో రూపొందిస్తున్న నవరస అనే అంథాలజీ సీరీస్‌లోనూ చేస్తున్నారు. ఇక సమంత, నయనతారలు కలిసి నటిస్తోన్న కాతువాకుల రెండు కాదల్ చిత్రంలో కథానాయకుడిగా చేస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకుడు.
అదరగొడుతున్న ‘మాస్టర్’ తెలుగు టీజర్
విజయ్, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న చిత్రం ‘మాస్టర్’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా తమిళ టీజర్‌ని విడుదల చేసిన చిత్రబృందం తాజాగా తెలుగు టీజర్‌ని రిలీజ్ చేసింది. ఇద్దరు విజయ్‌ల యాక్షన్ అదరగొడుతుంది. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం మరో స్థాయిలో నిలుస్తుంది. విజయ్‌కి,సేతుపతికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last