Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
పృథ్వీరాజ్ సినిమాలో నా పాత్ర షూటింగ్ పూర్తైయ్యింది: సోను
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చారిత్రక చిత్రం పృథ్వీరాజ్. చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో సోను సూద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మాట్లాడుతూ..పృథ్వీరాజ్ చిత్ర షూటింగ్లో నా పాత్రను పూర్తి చేశాను. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈలోపు కోవిడ్-19 పరిస్థితి మెరుగుపడొచ్చు. జనాలు మళ్లీ థియేటర్లకి వస్తారు. ప్రస్తుతం నేను దక్షిణాదిలోనూ రెండు చిత్రాల్లో నటిస్తున్నా. ఇప్పటికే ఓ చిత్రం విడుదలైంది. మరో చిత్రం కొంతకాలం తరువాత విడుదల అవుతోంది. అంతేకాదు హిందీలోనూ మరికొన్ని చిత్రాల్లో నటించనున్నానని తెలిపారు. యష్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిస్తున్న పృథ్వీరాజ్ చిత్రంలో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లార్ పృథ్వీరాజ్ అర్ధాంగి సన్యోగిత పాత్రలో నటిస్తోంది. ఇంకా చిత్రంలో సంజయ్ దత్, అశుతోష్ రానా, సాక్షి తన్వర్, మానవ్ విజ్, లలిత్ తివారీ తదితరులు నటిస్తున్నారు. ఆయన సినిమాలో కాక పాగల్ నహిన్ హోనా అనే మ్యూజిక్ వీడియోలోనూ చేస్తున్నారు. ఈ వీడియో గురించి స్పందిస్తూ... నాకు చాలా మ్యూజిక్ వీడియోలలో నటించమని అవకాశాలు వచ్చాయి.
బచ్చన్ పాండే షూటింగ్ ప్రారంభం
దోచేయ్ నటి క్రితి సనన్ అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న బాలీవుడ్ చిత్రం బచ్చన్ పాండే. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జైసల్మేర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నటి క్రితి సనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..2021లో మొదటి చిత్రం మొదటి షూట్ మొదటి రోజు. నా మొదటి మొదటి చిత్రం అంటూ పేర్కొంది. మొదటి షెడ్యూల్ కోసం చిత్రబృందం అంతా జైసల్మేర్ చేరుకున్నారు. అక్కడ దర్శకుడి ఫర్హాద్తో కలిసి క్రితి సనన్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. అన్నట్టు చిత్రంలో అర్షద్ వార్షీ, జాక్విలిన్ ఫెర్నాండజ్లు కూడా నటిస్తున్నారు. అర్షద్ వార్షీ అక్షయ్ కుమార్ గురించి మాట్లాడుతూ..ఆయనతో కలిసి నటించాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నా. కానీ ఎప్పుడూ కుదరలేదు. చివరకు ఈ సినిమాలో మా ఇద్దరికి ఇలా కుదరింది. అక్షయ్ నటన మ్యాడ్లెస్గా ఉంటుంది. ఇందులోలోని భావోద్వేగాలు ప్రేక్షకులకు నచ్చేలా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఇందులో నేను అక్షయ్ కుమార్ స్నేహితుడిగా నటిస్తున్నా.
కప్పకు భయపడిన పక్షిరాజా అక్షయ్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పోరాటాలు చేయడంలో దిగ్గజం అన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి అక్షయ్ కుమార్ ఓ కప్పకు భయపడ్డాడు. ఈ విషయం తెలియాలంటే ఆయన చెప్పిన సంగతేమిటో చుద్దాం. తాజాగా అక్షయ్ తన ఫోన్‌కి రిచార్జ్ చేయడానికి ఓ కరెంట్ ప్లగ్ దగ్గరకు వెళ్లాడు. అక్కడే ఓ కప్ప కనపడటంతో అవాక్కైయ్యాడు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్లో షేర్ చేస్తూ..నా ఫోన్‌ని రీచార్జ్ చేద్దాం అని చూశా. కానీ అక్కడ స్థలాన్ని మొత్తం కప్ప ఆక్రమించింది. నేనే వేరోచోటును వెతుక్కోవలసి వచ్చిందని తెలిపారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.ఓ చిత్రంలో ఎన్నో తుపాకీలను సైతం ఎదుర్కొన్న పక్షిరాజాకి ఇంత కష్టం ఎలా వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో అత్రాంగి రే చిత్రంలో నటిస్తున్నారు. అక్షయ్ నటించిన బెల్‌బాటమ్, సూర్యవన్షి చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పృథ్వీరాజ్ అనే చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్య్రకమాలు జరుపుకుంటోంది.
తాజ్ మహల్ దగ్గర అత్రాంగి రే షూటింగ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సారా అలీఖాన్, ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం అత్రాంగి రే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగ్రాలోని చారిత్రక ప్రదేశం తాజ్ మహల్ దగ్గర సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలౌతున్నాయి. సారా గులాబి రంగులోని దుస్తులు ధరించి ఉండగా, అక్షయ్ కుమార్ చక్రవర్తి వేషంలో ఉన్నారు. అక్షయ్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చక్రవర్తి వేషధారణలో ఉండి చేతిలో పువ్వు పట్టుకొని తన చూట్టూ తానే తిరుగుతూ మైమరచిపోతున్న ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోకి వాహ్ తాజ్ అంటూ ట్యాగ్‌లైన్ తగిలించారు.
ఫోర్బ్స్ ఆసియా 100 డిజిటల్ స్టార్స్ జాబీతాలో స్థానం దక్కించుకున్న బాలీవుడ్ స్టార్ట్స్
ఫోర్బ్స్ ఆసియా-పసిఫిక్ రీజన్‌కి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో అత్యంత ప్రభావవంతమైన ప్రముఖులను జాబితా చేసింది. ఈ ఫోర్బ్స్ ఆసియా 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో బాలీవుడ్ నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అలియా భట్లు ఉన్నారు. ఇంకా ఈ జాబితాలో షారూఖ్ ఖాన్, రన్వీర్ సింగ్, హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, షాహిద్ కపూర్, మాధురి దీక్షిత్ ఉన్నారు. అంతేకాదు వీరితో పాటు సింగర్స్ శ్రేయా ఘోషల్, నేహా కక్కర్ కూడా ఉన్నారు. ఈ యేడాది కోవిడ్-19 ఉపశమనం కోసం అమితాబ్ 7 మిలియన్లు డాలర్లు సేకరించారు. ఇక అక్షయ్ కుమార్ బాలీవుడ్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా ఐ ఫర్ నిధుల సేకరణలో పాలు పంచుకున్నారు. కోవిడ్-19 కార్మికనిధుల కోసం హృతిక్ రోషన్ ఐ ఫర్ ఇండియా కచేరి కనిపించారు.
మరోసారి ‘మిషన్ మంగళ్’ దర్శకుడితో అక్షయ్ కుమార్!
ఇప్పుడున్న బాలీవుడ్ కథానాయకుల్లో అక్షయ్ కుమార్ స్పీడు చూస్తుంటే యువకథానాయకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే చేతిలో సినిమాలు ఉన్నా మరొక కొత్త చిత్రానికి గ్రీన్ ఇచ్చేశాడు అక్షయ్ కుమార్. తాజాగా ఆయన మిషన్ మంగళ్ దర్శకుడు జగన్ శక్తి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అక్షయ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మొదలుకొని హరర్, కామెడీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కి ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. సినిమా కోసం విఎఫ్ఎక్స్ అయ్యే బడ్జెట్ ఖర్చుల్లో కూడా అక్షయ్ కొన్ని పరిమితులకు లొబడి పనిచేయనున్నారుట. వీరిద్దరూ ఇప్పటికే సైన్సు నేపథ్యంలో సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక అక్షయ్ కుమార్‌కి శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబోట్ 2.ఓ చిత్రంతో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. అంటే అక్షయ్ ద్విపాత్రాభినయం చేయడం కానీ, లేదా సైన్సు ఫిక్షన్ చిత్రాల్లో నటించడం కొత్తేమీ కాదని మనకు తెలుసు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. సినిమా వచ్చే యేడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లి 2022లో తెరపైకి వస్తోంది.
‘అత్రాంగి రే’ మొదలైంది
ధనుష్, అక్షయ్ కుమార్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అత్రాంగి రే’. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకుడు. లాన్‌డౌన్ అనంతరం శుక్రవారం చిత్రీకరణ మళ్లీ ప్రారంభమైంది. అక్షయ్, సారాపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్లో పాల్గొన్న ఓ ఫొటోని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూ ‘ లైట్స్, కెమెరా, యాక్షన్ అనే మూడు పదాలు అందించే ఆనందమే వేరు. అత్రాంగిరే చిత్రీకరణ ప్రారంభమైంది. మీ ప్రేమ, ఆశీస్సులు కావాలి’ అని పేర్కొన్నారు. సారా, అక్షయ్ నవ్వుతూ కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వాళ్ల మధ్య కెమెస్ట్రీ చూడముచ్చటగా ఉంది.
అయోధ్యలో అక్షయ్ కుమార్ రామ్ సేతు షూటింగ్
అక్షయ్ కుమార్ సామాజిక నేపథ్యమున్న చిత్రాలతో పాటు చారిత్రక చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా అక్షయ్ కుమార్ రామ్ సేతు చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా యుపీ ముఖ్యమంత్రితో అక్షయ్ కుమార్ సమావేశం అయ్యారు. అభిషేక్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ని అయోధ్యలో జరపునున్నారు. రాబోయో తరాలకు రాముడి ఆదర్శ భావాలను తెలిపిందుకే రామసేతు నిర్మిస్తున్నారని చిత్రబృందం చెబుతోంది. వచ్చే యేడాది మధ్యలో అయోధ్య పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. కేఫ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో అబున్‌దంతియా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మితమౌతోన్న చిత్రానికి విక్రమ్ మల్హోత్రా,
అక్షయ్‌తో మరోసారి
అక్షయ్‌కుమార్‌తో కలిసి మరోసారి సందడి చేయనుంది శ్రీలంక సుందరి జాక్వెలైన్ ఫెర్నాండెజ్. అక్షయ్ ప్రధాన పాత్రలో తెర కెక్కుతోన్న చిత్రం ‘బచ్చన్‌పాండే’. ఈ చిత్రబృందంలోకి జాక్వెలైన్ చేరింది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు. ఇందులో కృతిసనన్ మరో నాయిక. ఈ చిత్రంలో భాగమైనందుకు జాక్వెలైన్ ఆనందం వ్యక్తం చేసింది. ‘‘ఈ సినిమాలో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఆ అనుభూతి ఎలా ఉండనుందో అని ఎదురుచూస్తున్నాను. షాజిద్ సార్, అక్షయ్‌లతో కలిసి మళ్లీ మళ్లీ పనిచేయడం సంతోషంగా ఉంది. కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది’’అని చెప్పింది జాక్వెలైన్. ఇందులో అక్షయ్ ఓ గ్యాంగ్‌స్టర్‌గా,
గాలిలా నన్ను చుట్టేసుకోండి : క్రితి ససన్
బాలీవుడ్ నటి క్రితి ససన్ తన అందంతో ప్రేక్షకులకు మత్తెక్కింస్తుంది. అలానే ఇప్పుడు తన కవిత్వంతో తనలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది క్రితి. తాజాగా ఓ అందమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలో క్రితి ఎలా ఉందంటే తెల్లని డ్రస్ ధరించి అందమైన తన చూపులతో ఇట్టే ఆకట్టుకుంది. అందమైన తన ఫోటోను షేర్ చేస్తూ..గాలిలాగే నన్ను కౌగిలించుకోవడి. నా హృదయం తేలిపోతుంది. నా ఆత్మ ఏదో శాంతిపజేస్తూ..నాలోని ప్రతి అంగుళాన్ని చుట్టేస్తుంది..అంటూ పేర్కొంది. క్రితి తనలోని కవితను తట్టిలేపే ప్రయత్నం చేస్తుందని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరికొంత మంది అయితే ఈ డ్రెస్‌లో నీవు దేవదూతలా ఉన్నావు అంటూ పొగుడుతున్నారు. ప్రస్తుతం మిమి అనే చిత్రం చేస్తుంది.
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last