Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
చిరు.. ఆ నలుగురు
అగ్ర కథానాయకుడు చిరంజీవి జోరుమీదున్నారు. రీఎంట్రీ తర్వాత యువ కథానాయకులకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తాను పనిచేస్తున్న దర్శకులతో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. మెహర్ రమేశ్, మెహన్ రాజా, కొరటాల శివ, బాబీలతో చిరంజీవి సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తర్వాత మలయాళ సూపర్‌హిట్ ‘లూసిఫర్’ రీమేక్‌లో నటిస్తారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం చిత్ర బృందం నటీనటుల ఎంపికలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే ‘వేదాళం’ రీమేక్ మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఉంటుంది. ఆ తర్వాత బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు చిరంజీవి.
‘ఆచార్య’ ఆగమనం అప్పుడే?
చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల కోసం టీజర్‌ని విడుదల చేయాలని భావిస్తుందట చిత్రబృందం. గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా ఆచార్యను చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో రూపొందుతుందీ సినిమా. చిరు సరసన కాజల్ నటిస్తోంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన లుక్ విడుదలై ఆసక్తి పెంచుతుంది. చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
చిరుకి తమన్ సంగీతం..
‘స్టార్.. స్టార్.. స్టార్.. అందరివాడు... ఆపద్బాంధవుడు’ అంటూ చిరంజీవి నటించిన చిత్రాలతో ఆయన ఎంట్రీ సన్నివేశానికి తమన్ అందించిన నేపథ్య సంగీతం ఉర్రూతలూగించింది. రామ్ చరణ్ కథానాయకుడుగా వచ్చిన ‘బ్రూస్లీ’ సినిమాలో చిరు అతిథి పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇందులో చిరు ఎంట్రీ ఇవ్వగానే వచ్చే బీజీఎమ్ ఓ రేంజ్లో ఆకట్టుకుంది. ఆ ఒక్క బిట్తోనే అదరగొట్టిన తమన్ తాజాగా చిరు నటించబోయే చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎంపికయ్యాడు. చిరు హీరోగా మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసీఫర్ రీమేక్ అవుతుంది. మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకే తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘చిరంజీవితో పనిచేయడం ప్రతి సంగీత దర్శకుడి కల. బాస్ మెగాస్టార్ శ్రీ చిరంజీవిగారిపై నా ప్రేమను చూపించే సమయం కుదిరింది. లూసీఫర్ తెలుగు సంగీత ప్రయాణాన్ని మొదలుపెడుతున్నామ’ని తెలిపారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, ఎన్వీఆర్ సినిమా సంస్థలు నిర్మిస్తున్నాయి.
‘ఆ ఒక్క చిత్రంలోనే నటిస్తున్నారు’
ప్రముఖ నటుడు మోహన్‌బాబు నటించనున్న సినిమాల గురించి గత కొంతకాలంగా వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని ఆయన పీఆర్వో వెల్లడించారు. మోహన్‌బాబు ప్రస్తుతం ‘సన్ ఆఫ్ ఇండియా’లో మాత్రమే నటిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా.. ‘కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు.. ప్రస్తుతానికి ‘సన్ ఆఫ్ ఇండియా’ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఆయన ఏ ఇతర ప్రాజెక్ట్‌కు ఇంకా సంతకం చేయలేదు. ఆయన చేయనున్న సినిమాల గురించి వస్తోన్న వార్తలను ఎవరూ నమ్మకండి. ఒకవేళ ఆయన ఏదైనా ప్రాజెక్ట్‌ను ఓకే చేసి ప్రకటిస్తే.. మేము మీకు తెలియజేస్తాం’ అని ట్వీట్ చేశారు.మోహన్‌బాబు కొన్ని భారీ ప్రాజెక్ట్‌లలో నటించనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆచార్య’ ఒకటి.
‘ఆచార్య’లో రామ్‌చరణ్ లుక్ చూశారా!
మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం తరువాత నటిస్తోన్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలక పాత్రలో నటించనున్నట్లు ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి.
చిరంజీవి సోదరిగా నయనతార!
అందాల అభినయతార నయనతార కథానాయికగానే కాకుండా ఇతక కీలకమైన పాత్రలను పోషిస్తూ పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ చిరంజీవి నటిస్తున్న మలయాళ రిమేక్ చిత్రం ‘లూసిఫర్’లో ఆయన సోదరిగా నటించనుంది. మోహన్ రాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇతను ఎడిటర్ మోహన్ తనయుడు. తొలుత ఈ పాత్రకు పలువురు సినీకథానాయకలైన విజయశాంతి, సుహాసిని, రమ్యకృష్ణ, నదియాలాంటి వాళ్ల పేర్లు బయటకు వచ్చాయి. కానీ చివరకు ఆ అవకాశం నయనతారకే దక్కింది. అయితే నయనతార ఇంకా అధికారిక ప్రకటన మాత్రం చేయలేదట. మాతృకలో ఈ పాత్రని మంజు వారియర్ పోషించింది. రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ఈ నెల 21న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ మార్చిలో ఉంటుంది. ఇందులో ఉమామహేశ్వర ఉగ్రరూప్యశ నటుడు సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నయనతార ప్రస్తుతం విజయ్‌సేతుపతితో కలిసి కాతువాకుల రెండు కాదల్ చిత్రం చేస్తుంది. ఇందులో సమంత కూడా నటిస్తోంది.
మెగా కుటుంబ సభ్యులతో నాగార్జున
మన చిత్రసీమలో అందరూ స్నేహంగా కలిసి ఉంటారనడానికి నిదర్శనం. నిన్న సంక్రాంతి పండగరోజున నటుడు చిరంజీవి ఇంట్లో నిర్వహించిన వేడుకే. ఈ వేడుకలో ఇటు మెగా కుటుంబ సభ్యులతో పాటు అటు అక్కినేని నాగార్జున కూడా పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరలౌతోంది. ఈ ఫోటోలో చిరంజీవి, నాగార్జున, రామ్‌చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయితేజ్లు ఉన్నారు. ఆ మధ్య బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్లో నాగార్జున - చిరంజీవి కలిసి ప్రేక్షకాభిమానులకు కనువిందు చేశారు. తరువాత మళ్లీ ఇలా ఈ పెద్ద పండగ సంక్రాంతికి మెగా కుటంబ సభ్యుల మధ్య నాగార్జున కనిపించి చిత్రసీమలో అందరూ ‘మా’ సినిమా కుటంబ సభ్యులే అనిపించారు. ప్రస్తుతం చిరంజీవి కొరాటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్నారు.
ఈ వేసవిలో సందడి ఎవరిది?
తెలుగులో అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా విడుదలయ్యే సినిమాలు అరుదు. సంక్రాంతికి వస్తాయనుకున్నవి వేసవికి... వేసవి సినిమాలేమో దసరాకి అన్నట్టుగా వాయిదాలు పడుతూనే ఉంటాయి. అగ్ర తారల విషయంలో అయితే... ఏళ్లకి ఏళ్లు ఈ పర్వం కొనసాగుతూ ఉంటుంది. కొన్నిసార్లు సినిమాలు పూర్తి కాక... మరికొన్నిసార్లు పూర్తయినా పరిస్థితులు అనుకూలించక తేదీలు మారిపోతూ ఉంటాయి. కరోనా తర్వాత ఆ విషయంలో మరింత అనిశ్చితి కొనసాగుతోంది. సంక్రాంతి బరిలోకి దిగేందుకు దాదాపు పది సినిమాలు సన్నాహాలు చేశాయి.
చిరు చిత్రంలో సత్యదేవ్?
‘ఆచార్య’ చిత్రం తర్వాత చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్‌లో నటించబోతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని.. ఎన్వీ ప్రసాద్, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇప్పుడీ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం నటుడు సత్యదేవ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే అది ప్రతినాయక ఛాయలున్న పాత్రా? లేక మరేదైనా ముఖ్య పాత్ర అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం సంక్రాంతి తర్వాత లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించి ఏప్రిల్ ఆఖరు నాటికి ముగించాలని లక్ష్యంతో ఉన్నారు చిరు. ఇందులో నయనతార ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందని ప్రచారం సాగుతోంది.
ఆ సినిమా ప్లాప్‌తో ఏడ్చేశాను..!
ఓ సారి విజయం వరిస్తే మళ్లీ అదే ఫలితం దక్కుతుందనుకోవడం సహజం. కానీ అన్ని సార్లు అలా జరగదు. ఎంత కష్టపడినా అప్పుడప్పుడు విజయం అనంతరం అపజయం ఎదురవుతూనే ఉంటుంది. అప్పుడే ఇంకా ఇంకా ప్రయత్నించాలనే కసి పెరుగుతుంది. అలా చేస్తేనే అనుకున్న లక్ష్యం మనల్ని చేరుతుంది. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి సైతం ఇదే అనుభవం చవిచూశారు.
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last