Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
చిరంజీవి సోదరిగా నయనతార!
అందాల అభినయతార నయనతార కథానాయికగానే కాకుండా ఇతక కీలకమైన పాత్రలను పోషిస్తూ పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ చిరంజీవి నటిస్తున్న మలయాళ రిమేక్ చిత్రం ‘లూసిఫర్’లో ఆయన సోదరిగా నటించనుంది. మోహన్ రాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇతను ఎడిటర్ మోహన్ తనయుడు. తొలుత ఈ పాత్రకు పలువురు సినీకథానాయకలైన విజయశాంతి, సుహాసిని, రమ్యకృష్ణ, నదియాలాంటి వాళ్ల పేర్లు బయటకు వచ్చాయి. కానీ చివరకు ఆ అవకాశం నయనతారకే దక్కింది. అయితే నయనతార ఇంకా అధికారిక ప్రకటన మాత్రం చేయలేదట. మాతృకలో ఈ పాత్రని మంజు వారియర్ పోషించింది. రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ఈ నెల 21న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ మార్చిలో ఉంటుంది. ఇందులో ఉమామహేశ్వర ఉగ్రరూప్యశ నటుడు సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నయనతార ప్రస్తుతం విజయ్‌సేతుపతితో కలిసి కాతువాకుల రెండు కాదల్ చిత్రం చేస్తుంది. ఇందులో సమంత కూడా నటిస్తోంది.
మెగా కుటుంబ సభ్యులతో నాగార్జున
మన చిత్రసీమలో అందరూ స్నేహంగా కలిసి ఉంటారనడానికి నిదర్శనం. నిన్న సంక్రాంతి పండగరోజున నటుడు చిరంజీవి ఇంట్లో నిర్వహించిన వేడుకే. ఈ వేడుకలో ఇటు మెగా కుటుంబ సభ్యులతో పాటు అటు అక్కినేని నాగార్జున కూడా పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరలౌతోంది. ఈ ఫోటోలో చిరంజీవి, నాగార్జున, రామ్‌చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయితేజ్లు ఉన్నారు. ఆ మధ్య బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్లో నాగార్జున - చిరంజీవి కలిసి ప్రేక్షకాభిమానులకు కనువిందు చేశారు. తరువాత మళ్లీ ఇలా ఈ పెద్ద పండగ సంక్రాంతికి మెగా కుటంబ సభ్యుల మధ్య నాగార్జున కనిపించి చిత్రసీమలో అందరూ ‘మా’ సినిమా కుటంబ సభ్యులే అనిపించారు. ప్రస్తుతం చిరంజీవి కొరాటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్నారు.
మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్న తారలు.. వారి చిత్రాలు
తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి అన్నది మనకు తెలిసిందే. నిన్న భోగి జరుపుకున్నారు. ఈరోజు మకర సంక్రాంతి మరింత బాగా జరుపుకోవాలని కోరుకుంటూ తెలుగు సినీతారలు, చిత్రసీమకి చెందిన అందరూ పెద్దఎత్తున సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
చిరు చిత్రంలో సత్యదేవ్?
‘ఆచార్య’ చిత్రం తర్వాత చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్‌లో నటించబోతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని.. ఎన్వీ ప్రసాద్, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇప్పుడీ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం నటుడు సత్యదేవ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే అది ప్రతినాయక ఛాయలున్న పాత్రా? లేక మరేదైనా ముఖ్య పాత్ర అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం సంక్రాంతి తర్వాత లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించి ఏప్రిల్ ఆఖరు నాటికి ముగించాలని లక్ష్యంతో ఉన్నారు చిరు. ఇందులో నయనతార ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందని ప్రచారం సాగుతోంది.
ఆ సినిమా ప్లాప్‌తో ఏడ్చేశాను..!
ఓ సారి విజయం వరిస్తే మళ్లీ అదే ఫలితం దక్కుతుందనుకోవడం సహజం. కానీ అన్ని సార్లు అలా జరగదు. ఎంత కష్టపడినా అప్పుడప్పుడు విజయం అనంతరం అపజయం ఎదురవుతూనే ఉంటుంది. అప్పుడే ఇంకా ఇంకా ప్రయత్నించాలనే కసి పెరుగుతుంది. అలా చేస్తేనే అనుకున్న లక్ష్యం మనల్ని చేరుతుంది. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి సైతం ఇదే అనుభవం చవిచూశారు.
ఒకప్పటి దర్శకుడు ఓయస్ఆర్ ఆంజనేయులు ఇకలేరు
అలనాటి దర్శకుడు, నటుడు ఓ.యస్.ఆర్.ఆంజనేయులు కన్నుమూశారు. కొద్ది రోలుగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈరోజు ఆయన తుది శ్వాసవదిలారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. ఆయన మెగాస్టార్ చిరంజీవి, రంగనాథ్ కలిసి నటించిన లవ్ ఇన్ సింగపూర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక భక్త ప్రహ్లాద నటి రోజా రమణి కథానాయికగా నటించిన కన్నెవయసు చిత్రానికి కూడా ఓఎస్ఆరే దర్శకుడు. ఆంజనేయులుకు నలుగురు సంతానం కాగా వారిలో ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన నాటకరంగం నుంచి వెండితెరకు వచ్చారు. వి.రామచంద్రరావు, కె.హేమాంబదరరావు, కె.ఎస్.ఆర్.దాస్,విజయ నిర్మల వద్ద పలు సినిమాలకు పనిచేశారు. ఆయన కొన్ని చిత్రాల్లో నటించారు. మొత్తం మీద డెభ్బైపైగా చిత్రాల్లో ఓఎస్ఆర్ నటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సానుభూతిని తెలియజేశారు.
‘బిగ్‌బాస్’ని ఎందుకు కలిశానంటే..!
యువ కథానాయకుడు మంచు విష్ణు- అగ్ర కథానాయకుడు చిరంజీవి ఎందుకు కలిశారా? అనే ఆసక్తి కలుగుతుంది కదూ. అది ఎందుకో ఇప్పుడు చెప్పను త్వరలో బయటపెడతా అంటున్నారు విష్ణు. మంగళవారం చిరుని కలిసిన విష్ణు ఆయనతో ఓ సెల్ఫీ తీసుకుని తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ‘ఈ రోజు (డిసెంబరు 22) బిగ్‌బాస్ చిరంజీవి అంకుల్ని కలిశాను. ఎందుకో కలిశాననే విషయం త్వరలో చెప్తాను. ప్రశ్నలు సంధించి ఆయన నుంచి సమాధానాలు రాబట్టుకునే ప్రక్రియలో ఎంతో నేర్చుకున్నాను. ఆయన ఇందుకే మెగాస్టార్ అయ్యారు’ అని తెలిపారు. మరి ఈ కలయికలో ఏదైనా ఇంటర్వ్యూ ఉంటుందా? సినిమా ఉంటుందా? చూద్దాం ఆ సర్ప్రైజ్ ఏంటో! ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు చిరంజీవి.
షూటింగ్ కేరాఫ్ హైదరాబాద్
హైదరాబాద్ కాస్త సినిమాబాద్గా మారిపోయింది. నగరంలో ఏ మూలకి వెళ్లినా చిత్రీకరణల సందడి కనిపిస్తోంది. కరోనా భయాలతో కొన్ని నెలలుగా స్తబ్దుగా కనిపించిన స్టూడియోలు కిటకిటలాడుతున్నాయి. తెలుగు సినిమాలే కాదు, హిందీ, తమిళం, కన్నడ భాషలకి చెందినవీ ఇక్కడే చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. రాబోయే కొన్ని నెలల పాటు ఇదే ఉద్ధృతి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
దిల్‌రాజు పుట్టినరోజు వేడుకలో స్టార్ల సందడి
టాలీవుడ్లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. శుక్రవారం దిల్‌రాజు 50వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నిన్న సాయంత్రం ప్రత్యేకంగా బర్త్‌డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో దిల్‌రాజు కుటుంబసభ్యులు, బంధువులతోపాటు తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర, యువహీరోలందరూ హాజరయ్యారు.
‘చిరంజీవి 153’.. దర్శకుడు ఫిక్స్
ప్రముఖ కథానాయకుడు చిరంజీవి చేయబోతున్న ప్రాజెక్టులో ‘లూసీఫర్’ రీమేక్ ఒకటి. మోహన్‌లాల్ హీరోగా వచ్చిన మలయాళ చిత్రమిది. ఎప్పటి నుంచో ఈ రీమేక్‌లో చిరు నటిస్తారనే విషయం తెలిసిందే. ఎవరు ఈ క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కిస్తారా? అనే సందేహానికి తాజాగా తెరపడింది. పలువురు తెలుగు దర్శకుల పేర్లు ఈ జాబితాలో నిలిచినా తమిళ దర్శకుడికే అవకాశం చిరంజీవి. మోహన్ రాజా ‘చిరంజీవి 153’ని తెరకెక్కిస్తున్నట్టు బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. 2021 సంక్రాంతి తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఎన్వీఆర్ సినిమా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మించనున్నాయి. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘ధృవ’ మాతృక(తని ఒరువన్) దర్శకుడే మోహన్ రాజా. ఈయన తొలి తెలుగు చిత్రం ‘హనుమాన్ జంక్షన్’.
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last