Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
ఈ వేసవిలో సందడి ఎవరిది?
తెలుగులో అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా విడుదలయ్యే సినిమాలు అరుదు. సంక్రాంతికి వస్తాయనుకున్నవి వేసవికి... వేసవి సినిమాలేమో దసరాకి అన్నట్టుగా వాయిదాలు పడుతూనే ఉంటాయి. అగ్ర తారల విషయంలో అయితే... ఏళ్లకి ఏళ్లు ఈ పర్వం కొనసాగుతూ ఉంటుంది. కొన్నిసార్లు సినిమాలు పూర్తి కాక... మరికొన్నిసార్లు పూర్తయినా పరిస్థితులు అనుకూలించక తేదీలు మారిపోతూ ఉంటాయి. కరోనా తర్వాత ఆ విషయంలో మరింత అనిశ్చితి కొనసాగుతోంది. సంక్రాంతి బరిలోకి దిగేందుకు దాదాపు పది సినిమాలు సన్నాహాలు చేశాయి.
ఉగాదికి వస్తోన్న ‘టక్ జగదీష్’
నేచరల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో జగదీష్ నాయుడుగా అనే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తెలుగువారి ఆది పండగ ఉగాదికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ని చిత్రబృందం షేర్ చేసింది. ఫోస్టర్లో నాని మధ్యలో కూర్చొని ఉండగా చూట్టూరా కుటుంబం అంతా ఉంది. జగపతిబాబు, నాజర్, రావు రమేష్‌లు ఉన్నారు. ఇందులో కథానాయికలుగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ మధ్యే నాని తన పాత్రకు డబ్బింగ్ కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరింది. ఇప్పటి వరకు టక్ జగదీష్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్ నుంచి ఫస్ట్ లుక్ వరకు అన్నీ వైవిధ్యంగానే ఉన్నాయని నాని అభిమానులతో పాటు సినీ జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు.
‘మాస్టర్’కి విలన్‌గా నాని.. కానీ
‘మాస్టర్’ చిత్రంలో నాని విలన్ ఏంటి? అనుకుంటున్నారా. అవును అంటే ఇది చదివేయండి.. ‘మాస్టర్’ని విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. ఈ సందర్భంగా (చిత్ర ప్రచారంలో భాగంగా) ఆసక్తికర అంశం ఒకటి కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో కథానాయకుడి పాత్రకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో అదే స్థాయిలో ప్రతినాయకుడి పాత్ర ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లో ఇది అర్థమవుతుంది. విజయ్, విజయ్ సేతుపతి పోటీపడి ఓ రేంజ్లో అదరగొట్టారు. విజయ్ తగ్గ విలన్ సేతుపతే అని అందరూ చప్పకనే చెప్పారు. అయితే ఈ పాత్ర కోసం సేతుపతినే కాదు మాధవన్, నానిని కూడా అనుకున్నారట. మంచి క్రేజ్ ఉన్న ఈ పాత్రలో ముందుగా సేతుపతినే అనుకున్నప్పటికీ.. ఆయన నటిస్తారో లేదో అనే సందేహంలో పడిందట చిత్రబృందం. ఒకవేళ సేతుపతి నో చెప్తే ఆ స్థానంలో మాధవన్, నానిని తీసుకుందామని భావించినట్లు ఓ తమిళ దర్శకుడు తెలిపారు. అలా నాని చేయాల్సి ఉండేవారేమో కానీ సేతుపతికి ఆ కీ రోల్ అమితంగా నచ్చడంతో వెంటనే ఓకే చేశారు.
ఆ సినిమా చేయనని చెప్పా.. కానీ
కెరీర్ ప్రారంభంలో నటులందరికీ సందేహాలుంటాయి. ఏ చిత్రం చేయాలి, ఏది చేయకూడదు ..ఇలా ఎన్నో ఆలోచనలు. వద్దు అనుకున్న సినిమాల్లో కొందరి సూచనల మేరకు నటిస్తారు తప్పక విజయం అందుకుంటారు. ఆ అనుభవమే ఎదురైంది నానికి. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘రైడ్’ చిత్రం తెరకెక్కింది. నాని, తనీష్ కథానాయకులు. ఈ యూత్‌ఫుల్ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఎందుకో మరి నానికి ఈ సినిమాలో నటించడం ఇష్టంలేక అదే మాట చెప్పేందుకు నిర్మాత కార్యాలయానికి వెళ్లారట. నాని తన మనసులో మాట బయటపెట్టగా.. ఆయన మాట వినకుండా సురేశ్ బలవంతంగా నటింపజేశారని సరదాగా చెప్పుకొచ్చారాయన. ఇటీవలే జరిగిన ‘అల్లుడు అదుర్స్’ చిత్ర ట్రైలర్ విడుదల వేడుకలో ఈ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘అప్పుడు రైడ్ సినిమా చేయనని సురేష్ గారికి చెప్పాను. నా మాట వినలేదు. ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ట్రైలర్ లాంచ్‌కి ఆహ్వానించారు. ప్రస్తుతం ఓ సినిమా చిత్రీకరణలో ఉన్నా కుదరదు అంటే నేను ఉన్న లొకేషన్లోనే వేడుక నిర్వహించారు. ఇప్పుడూ నా మాట వినలేదు ఆయన. అందుకే ఈ చిత్రమూ హిట్ అవుతుందని భావిస్తున్నా’ అన్నారు. ప్రస్తుతం ‘టక్ జగదీష్’ డబ్బింగ్ కార్యక్రమాల్లో బిజీగా
‘జగదీష్’ నాయుడు అప్డేట్ ఇచ్చాడు
నాని నుంచి వస్తోన్న చిత్రం ‘టక్ జగదీష్’. ఈ సినిమాలో జగదీష్ నాయుడుగా కనిపించనున్నాడు నాని. శివ నిర్వాణ దర్శకుడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నాయికలు. తాజాగా ఓ అప్డేట్ని అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. డబ్బింగ్ కార్యక్రమం ప్రారంభమైనట్లు సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. సోమవారం నాని తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈసారి ఫుల్ మీల్స్
యాక్షన్, లవ్, కామెడీ.. ఇలా అన్ని రకాల వినోదాల వంటని వడ్డించేందుకు సిద్ధమయ్యాడు నాని. ఆయన తాజా చిత్రం ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకుడు. క్రిస్మస్ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో పైకి సాఫ్ట్‌గా దర్శనమిస్తూనే మాస్ తరహాలో కనిపిస్తున్నాడు నాని. అరటాకులోని భోజనం ముందు టక్ చేసుకుని కూర్చుని.. వెనక నుంచి కత్తిని బయటకు తీస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. ఇంత క్లాస్ లుక్‌లో కత్తి పట్టుకోవడానికి కారణమేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. జగదీష్ నాయుడుగా నాని నటిస్తున్న ఈ చిత్రం 2021 ఏప్రిల్‌లో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నాయికలు. సంగీతం: తమన్. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మాతలు.
మళ్లీ ‘వి’చ్చేస్తున్నారహో..!
యువ కథానాయకులు నాని, సుధీర్ బాబు మరోసారి సందడి చేసేందుకు విచ్చేస్తున్నారు. ఈ ఇద్దరితో దర్శకుడు మోహన్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘వి’. థ్రిల్లర్ యాక్షన్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 5న ఓటీటీ(అమెజాన్ ప్రైమ్)లో విడుదలైన సంగతి తెలిసిందే. థియేటర్ లక్ష్యంగా తెరకెక్కిన ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ వేదికగా వచ్చి ప్రేక్షకుల్ని అలరించింది. ఎంతైనా థియేటర్ అనుభూతి వేరే కదా! ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో థియేటర్లు తెరచుకుంటున్నాయి. అందుకే ‘వి’ సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. 2021 నూతన సంవత్సరం కానుకగా జనవరి 1 రాబోతుందీ చిత్రం.
‘శ్యామ్ సింగరాయ్’.. సందడి షురూ అయిందోయ్
నాని కథానాయకుడుగా వస్తున్న 27వ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మేరకు సినిమా స్ర్కిప్టు (బుక్) పక్కన టీ కప్పు... వాటికి ముందు అస్పస్టంగా కనిపిస్తున్న నాని ఫోటోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో నాని మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. కలకత్తా నేపథ్యంలో సాగే కథ అని ప్రచారం సాగుతుంది.
డిసెంబరు 25పై ఫోకస్ పెట్టండి
‘ఫోకస్ డిసెంబరు 25కి మారింది’ అంటున్నాడు నాని. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘టక్ జగదీష్’ చిత్రం నుంచి డిసెంబరు 18న (శుక్రవారం) ఓ సర్ప్రైజ్ అందిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. దాన్ని రివీల్ చేస్తూ.. ఆ ఆసక్తిని అలాగే ఉంచి దృష్టంతా డిసెంబరు 25పై పెట్టండని కోరారు. ‘క్రిస్టమస్ సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదల చేస్తున్నాం’ అని శుక్రవారం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారాయన. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతుందీ సినిమా.
వైభవంగా వివేక్ ఆత్రేయ కల్యాణం
దర్శకుడు వివేక్ ఆత్రేయ ఓ ఇంటివాడయ్యారు. శ్రీజ గౌని మెడలో గురువారం మూడు ముళ్లు వేశారు. అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. ఈ వేడుకకు కథానాయిక నివేదా థామస్, కథానాయకుడు శ్రీ విష్ణు హాజరయ్యారు. వధూవరులతో దిగిన ఫొటోని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది నివేదా. నివేదా, శ్రీ విష్ణు జంటగా వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ చిత్ర దర్శకుడే వివేక్ ఆత్రేయ. ‘మెంటల్ మదిలో’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారాయన. అందులోనూ శ్రీ విష్ణునే హీరో. ప్రస్తుతం నానితో ‘అంటే సుందరానికి’ చిత్రం చేస్తున్నారు.
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last