Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
అక్కా..ఆర్.ఆర్.ఆర్ విడుదల ఎప్పుడు?
ఈ సంక్రాంతి పండగ సందర్భంగా అందరూ హీరోలు, కొత్త సినిమాలు తమ ఏదో ఒక శుభవార్త చెప్పాయి. కానీ జక్కన చెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మాత్రం ఎలాంటి వార్త సంక్రాంతికి వినిపించ లేదు. దీనిపై ఓ అభిమాని సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్.ఆర్.ఆర్ చిత్రంపై రాజమౌళి కుటీరం పేరుతో వ్యంగ్యంగా కార్టూన్ ద్వారా స్పందించాడు. ఆ కార్టూన్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నిల్చుని ఉండగా వారికి ఎదురుగానే ఇద్దరు యువతులు ముగ్గులు వేస్తూ అక్కా సినిమా ఎప్పుడు విడుదల అవుతోంది అని చెల్లిని ప్రశ్నించగా,..తప్పమ్మా తెలియనివి అడగకూడదని అక్క సమాధానం చెబుతోంది. ప్రస్తుతం ఈ కార్టూన్ సామాజిక మాధ్యమాల్లో వైరలౌతోంది. ఈ కార్టూన్ చూసిన ఆర్ఆర్ఆర్ చిత్రం బృందం స్పందిస్తూ.. `సృజనాత్మకతతో కొట్టారు. చాలా నచ్చింది. హ్యాపీ సంక్రాంతి` అని అంటూ సమాధానం ఇచ్చారు. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్న రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్)) చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలను పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్న తారలు.. వారి చిత్రాలు
తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి అన్నది మనకు తెలిసిందే. నిన్న భోగి జరుపుకున్నారు. ఈరోజు మకర సంక్రాంతి మరింత బాగా జరుపుకోవాలని కోరుకుంటూ తెలుగు సినీతారలు, చిత్రసీమకి చెందిన అందరూ పెద్దఎత్తున సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అదిరిపోయే మరో టైటిల్?
త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించి అదిరిపోయే మరో టైటిల్ తెరపైకి వచ్చింది. ‘అరవింద సమేత’ తర్వాత ఈ కలయికలో సినిమా వస్తుందనగానే సినీ ప్రియుల్లో అంచనాలు పెరిగిపోయాయి. టైటిల్ ఏంటి? నాయిక ఎవరు? అంటూ శోధించారు. ఈ క్రమంలో పలువురి భామల పేర్లు వినిపించినా చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు త్రివిక్రమ్ సినిమా అంటే కచ్చితంగా పేరు విభిన్నంగా ఉంటుందనే విషయం తెలిసిందే. సినిమా వెల్లడించిన తొలినాళ్లలో ‘అయినను పోయి రావలే హస్తినకు’ పేరు వార్తల్లో నిలిచింది. ‘ఎన్టీఆర్ 30’ టైటిల్ ఇదే అంటూ ప్రచారం జోరుగా సాగింది. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో తాజాగా ఆసక్తికర పేరు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. అదే ‘చౌడప్పనాయుడు’. కథానాయకుడి పాత్రని బట్టి ఈ టైటిల్‌ని అనుకుంటుందట చిత్రబృందం. మరి ఇది ఏమాత్రం నిజమో తెలియాలంటే దర్శకనిర్మాతలు స్పందించాల్సిందే. హారిక హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంద’ని ఇటీవలే తెలిపారు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ.
చిరు వాయిస్ ఓవర్‌తో ఆర్.ఆర్.ఆర్ టీజర్ వస్తుందా?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్) ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చిత్రంపై చిత్రసీమతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పరిచయపాత్రల టీజర్లు విడుదలై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో టీజర్‌ని ఈనెల 26 ఘనతంత్ర దినోత్సం సందర్భంగా విడుదల చేయనున్నారని సమాచారం. అంతేకాదు ఈ వీడియోకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్నారని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఆర్ఆర్ఆర్కి సంబంధించిన మరో వీడియో బయటకు వస్తుందనడంతో రామ్‌చరణ్, ఎన్టీఆర్ అభిమానులతో పాటు చిత్రసీమ సైతం ఎదురుచూస్తోంది. ఆ విశేషం ఏంటో తెలియాలంటే ఈనెల 26 వరకు ఆగాల్సిందే మరి! డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రంలో బాలీవుడ్ కథానాయిక అలియా భట్, హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నాయికలుగా నటిస్తున్నారు.
కలుసుకున్నారు.. త్వరలో మొదలెడుతున్నారు
త్రివిక్రమ్ శ్రీనివాస్-జూనియర్ ఎన్టీఆర్ కలయికలో ‘ఎన్టీఆర్ 30’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హారిక హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం గురించి ఎప్పుడో ప్రకటించినా కరోనా కారణంగా ఎలాంటి అప్డేట్ వెలువడ లేదు. ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు శనివారం సర్ప్రైజ్ అందించింది చిత్రబృందం. ‘కొత్త సంవత్సరం రెండోరోజు చాలా ఉత్సాహం నింపుతుంది. తారక్, త్రివిక్రమ్ కలుసుకున్నారు. ‘ఎన్టీఆర్ 30 త్వరలోనే మొదలవుతుంద’ని వెల్లడించాయి నిర్మాణ సంస్థలు. ప్రస్తుతం త్రివిక్రమ్-తారక్ కలిసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ‘అరవింద సమేత’ హిట్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్నారు తారక్.
కాస్త విరామం.. హిట్ కొట్టేందుకు ప్రయత్నం
‘‘సినీ పరిశ్రమలో విజయమే ప్రాతిపదిక. అది ఉంటే... అంతా మన వెంటే ఉంటారు. అది లేనప్పుడు మనల్ని పలుకరించేవారూ ఉండరు’’- ఎంతో మంది దర్శకులు, నటుల నుంచి వివిధ ఇంటర్వ్యూల్లో వినిపించిన మాటలివి. అలా ఒకప్పుడు బాక్సాఫీసుపై దండెత్తి వసూళ్ల వర్షం కురిపించిన దర్శకులు... ఆ తర్వాత కాలంలో ఎదురైన పరాభావాల వల్ల నెమ్మదించారు. వరుస విజయాలు, ఇండస్ట్రీ హిట్లతో పరిశ్రమ చూపునంతా తమవైపునకు తిప్పుకున్న వారే.. పూర్వ వైభవం కోసం మళ్లీ జోరు పెంచారు. ఓటమితో కుంగిపోకుండా... తమ బలం చూపేందుకు నూతన సినిమాలతో సిద్ధమవుతున్నారు.
అసలేం జరుగుతుంది మన దేశంలో?
సర్.. ఒక 50 మందిని చంపేయగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు.. అదేదో అణుబాంబు పడినట్టు అల్లకల్లోలం అయిపోయారే? మన జన్మలకు కారణమై.. మన రక్తాన్ని పంచుకుని, మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని దారుణాలు సర్... నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయ్. ఒక్కడైనా.. ఒక్కడైనా సర్ పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో??????మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్లు, మన కూతుళ్లు బయటికెళ్తే తిరిగొచ్చేంత వరకు ఎందుకు సర్ భయం భయంగా ఉంటున్నాం.. బిక్కు బిక్కుమంటూ ఎందుకుంటున్నాం? అరే వాళ్లు అడవుల్లోకి, బాంబుల మధ్య, ఎడారిల్లోకి వెళ్లిపోతున్నారా? మనలాంటి మనుషుల మధ్యకే కదా సర్ వెళ్లేది... ఆడది బయటికి వస్తే చాలు సర్. సందుల్లోనూ, రోడ్లలోనూ, బస్టాపుల్లోనూ, బస్సుల్లోనూ, రెస్టారెంట్లలోనూ, ఆఫీసుల్లోనూ, పోస్టాఫీసుల్లోనూ, పార్కుల్లోనూ, కాలేజీల్లోనూ ఎక్కడపడితే అక్కడ సర్. కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ల మధ్య నడవాలి సర్ మన స్త్రీ. ఎప్పుడు ఎక్కడ ఎవడు ఏం చేస్తాడోనని భయం సర్ మనకి.
భారీ యాక్షన్ సీన్‌కి సిద్ధం?
రాజమౌళి సినిమా అంటే పోరాట ఘట్టాలు ఎక్కువగా కదలాడతాయి. నాయకాప్రతినాయకుల నడుమ వచ్చే ఆ దృశ్యాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. గత చిత్రాల్లో చూపించినదాని కంటే ఎక్కువ చూపించబోతున్నారట ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్లో వీటిని చిత్రీకరించనున్నారని సమాచారం.
మరోసారి బుల్లితెర వ్యాఖ్యాతగా ఎన్టీఆర్
యమదొంగ ఎన్టీఆర్ డైలాగ్‌లు చెబుతుంటే కోలాహలంగా ఉండే ప్రేక్షకులు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతారు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్ సీజన్ 1కి హోస్ట్ గా వ్యవహరించి అందరి మన్ననలు అందుకున్నారు.
ఎన్టీఆర్ కొత్త చిత్రం టైటిల్ ఇదేనా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. తాజాగా ఈ చిత్రానికి ఓ కొత్త టైటిల్‌ని పరిశీలిస్తున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అదే రాజా వచ్చినాడు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమాకి అయినను పోయిరావలె హస్తినకు అనే పేరు కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. అయితే ఈ రెండు టైటిల్స్ లో ఏది ఫైనల్ చేస్తారో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఇప్పటికే తెరపైకి వచ్చిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సినిమాలంటే గతంలో రెండు మూడు అక్షరాలకే పరిమితం అవుతుంటాయి. కానీ ఈ మధ్య ఆయన చిత్రాల పేర్లు కొంచెం పెద్దవిగానే ఉంటున్నాయి. వాటిలో కొన్ని చిన్నవి పెద్దెవి ఉన్నాయి. జల్సా, జులాయి, ఖలేజా, అత్తారింటికి దారేది, అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో లాంటివి చూడొచ్చు.
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last