Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
హీరోగా జానీ మాస్టర్
ఎందరో నాయకానాయికలతో అదిరిపోయే స్టెప్పులు వేయించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ హీరోగా ఓ చిత్రం ఖరారైంది. దిగంగన సూర్యవంశీ నాయిక. మరళిరాజ్ తియ్యాన దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామానాయకుడు స్టూడియోస్‌లో సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌కొట్టి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. నటుడు, నిర్మాత నాగబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత లగటపాటి శ్రీధర్, వ్యాఖ్యాత, నటుడు ప్రదీప్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘నా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి నన్ను ఆశీర్వదించిన వీళ్లందరికీ ధన్యవాదాలు.
21 మంది కథానాయికలతో భువన్ పొనన్న ప్రణయ రాజా
కన్నడ చిత్రం రాన్ద్వా కథానాయకుడు భువన్ పొన్నన్న నటిస్తున్న కొత్తం చిత్రం ప్రణయ రాజా. ప్రణయ రాజా అనేది అలనాటి కన్నడ శ్రీనాథ్‌కి కింగ్ ఆఫ్ రొమాన్స్ అనేది మారుపేరు. 1970ల్లో రొమాన్స్ చిత్రాలకు పెట్టింది పేరు శ్రీనాథ్. ప్రస్తుతం భువన్ పొన్నన్న కథానాయకుడిగా ప్రణయ రాజా చిత్రాన్ని ఆయన పుట్టినరోజు డిసెంబర్ 30న ప్రారంభించాలని చూస్తున్నారు. చిత్రానికి టి.సుదర్శన్ చక్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు టీజర్‌ని ఆవిష్కరించేందుకు హీరోతో చిత్రబృందం చర్చలు జరుపుతోంది. చిత్రంలో మొత్తం 21మంది కథానాయికలు నటిస్తున్నారు.
రైతు నాయకుడు జయం రవి భూమి
ఎడిటర్ మోహన్ తనయుడు జయం రవి నటిస్తున్న చిత్రం భూమి. ఇందులో జయం రవి తిరుగుబాటు రైతు నాయకుడిగా నటిస్తున్నారు. సామాజిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సుజాత విజయ్ కుమార్ సమర్పణలో హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమౌతోంది. ఇందులో కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తోంది. సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. జయం రవి - లక్ష్మణ్‌లు కలిసి గతంలో రోమియో జులియట్ చిత్రానికి కలిసి పనిచేశారు. ఇందులో రోనిత్ రాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీత స్వరాలు అందించగా డడ్లీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. సినిమా గురించి రవి మాట్లాడుతూ..నా సినిమా కెరీర్లోనే ఇదొక మైలురాయి లాంటిది. ఇది నా 25వ చిత్రం.
రైతు నాయకుడు జయం రవి భూమి
ఎడిటర్ మోహన్ తనయుడు జయం రవి నటిస్తున్న చిత్రం భూమి. ఇందులో జయం రవి తిరుగుబాటు రైతు నాయకుడిగా నటిస్తున్నారు. సామాజిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సుజాత విజయ్ కుమార్ సమర్పణలో హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమౌతోంది. ఇందులో కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తోంది. సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. జయం రవి - లక్ష్మణ్‌లు కలిసి గతంలో రోమియో జులియట్ చిత్రానికి కలిసి పనిచేశారు. ఇందులో రోనిత్ రాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీత స్వరాలు అందించగా డడ్లీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. సినిమా గురించి రవి మాట్లాడుతూ..నా సినిమా కెరీర్లోనే ఇదొక మైలురాయి లాంటిది. ఇది నా 25వ చిత్రం.
అదిరిపోయే కాంబినేషన్ ఉంటుందా?
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు బాలకృష్ణ, శాండిల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. అదిరిపోయే కాంబినేషన్ కదా. ఈ ఇద్దరి కలయికలో సినిమా ఉంటుందని ఎవరైనా ఊహించారా? ఆ ఆసక్తికర ప్రచారమే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో, టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతుంది. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పునీత్ అతిథిగా కనిపించనున్నారంటూ చెప్తున్నారు. సినిమాకే ప్రధానంగా నిలిచే కీలక మలుపులో ఆయన ఎంట్రీ ఉంటుందని అంచనాలు పెంచుతున్నారు. అంతేకాదు పోలీసు అధికారి పాత్రలో నటిస్తారట. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఏది ఏమైనా బాలయ్య-పునీత్ కాంబో అనగానే నెటిజన్లు, అభిమానులు సందడి చేస్తున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ బ్లాక్ బ్లస్టర్ల తర్వాత వీళ్లిద్దరు కలిసి పనిచేస్తున్న చిత్రమిది.
స్కాట్లాండ్లో సోనమ్ కొత్త చిత్రం బ్లైండ్ ప్రారంభం
ఐ హేట్ లవ్ స్టోరీస్ నటి సోనమ్ కపూర్ చాలా కాలం తరువాత కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఆమె నటిస్తున్న బ్లైండ్ అనే సినిమా షూటింగ్ స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ప్రారంభమైంది. షోమ్ మఖిజా దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఒక సీరియల్ కిల్లర్ కోసం అంధ పోలీస్ అధికారి అన్వేషణ ఈ చిత్ర కథ. ఇందులో వినయ్ పాఠక్, పురబ్ కోహ్లీ, లిలెట్ దూబెలు తదితరులు నటిస్తున్నారు. సుజయ్ ఘోష్, మనీషా డబ్యూ, పింకేష్ నహర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. సోనమ్ కపూర్ 2019లో వచ్చిన జోయా ప్యాక్టర్ చిత్రం తరువాత పూర్తి నిడివి కలిగిన పాత్రలో నటిస్తోంది.
డిసెంబర్ 29న మారా ట్రైలర్ విడుదల కానున్న
సఖి నటుడు మాధవన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మారా. తమిళ ‘కల్కి’ చిత్ర దర్శకుడు దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. తాజాగా సినిమా ట్రైలర్‌ని డిసెంబర్ 29, 2020న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సినిమాని డిసెంబర్ 17న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుందని గతంలో ప్రకటించింది. ఇప్పుడు విడుదల తీదీని జనవరి 8, 2021కి మారింది. ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్లు మాధవన్ ట్విట్టర్లో ప్రకటించారు. మేజిక్ తెరుచుకున్నప్పుడు..ప్రేమ మార్గాని కనుగొనేందుకు మీరు కూడా మా ప్రయాణంలో భాగస్వాములు అవ్వండి అంటూ పేర్కొన్నారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్, పార్వతిలు కలిసి నటించిన ‘చార్లీ’ చిత్రానికి ఈ చిత్రం రీమేక్. ప్రమోద్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన సినిమాకి ప్రతీక్ చక్రవర్తి, శ్రుతి నల్లప్ప నిర్మాతలు. చిత్రంలో మౌలి, శివద, అలెగ్జాండర్ బాబు, మినోన్లు నటించారు. సినిమాకి గిబ్రాన్ సంగీత స్వరాలు అందించగా,
రెహమాన్ ఇంట విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తల్లి కరీమా బేగం సోమవారం మరణించారు. సంబంధిత వివరాలు తెలియాల్సి ఉంది. రెహమాన్‌కి కరీమా అంటే ఎంతో ప్రేమ. కొన్ని సినిమా ఆడియో వేడుకలకు ఆమెను తీసుకెళ్లేవారు రెహమాన్. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రెహమాన్‌ని ఉన్నత స్థాయిలో నిలబెట్టారామె. తన ట్విటర్ ఖాతాలో కరీమా ఫొటోని పోస్ట్ చేశారు రెహమాన్. ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
శాకుంతలంలో సమంత?
రుద్రమదేవి చిత్ర దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం శాకుంతలం. నాటి బ్రహ్మర్షి విశ్వామిత్ర - అస్సర మేనకల కుమార్తె అయిన శకుంతల జీవితాధారంగా ఉండనుంది. తాజాగా ఈ చిత్రంలో శాకుంతల పాత్రలో సమంతను తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం సమంతతో చిత్రబృందం చర్చలు జరుపుతున్నారట. శాకుంతల పాత్రలో తొలుత పూజాహెగ్డేను కూడా సంప్రదించగా, అయితే ఈ సినిమాలో చిత్ర ప్రధాన పాత్ర తల్లిగా మారే అవకాశం ఉండడంతో పూజా ఎటూ తెల్చులేకోపోయిందని సమాచారం. ఇందులో శకుంతల ప్రేమ వ్యవహారం, రహస్య ప్రేమ, అంతేకాదు దుష్యంతుడు శకుంతల అమరప్రేమలపై చిత్రకథపైనే ఉంటుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గుణశేఖర్ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న సినిమాకి మణిశర్మ సంగీత స్వరాలు అందిస్తున్నారు.
ఇంటికి చేరుకున్న రజనీ
రక్తపోటులో హెచ్చుతగ్గులు తలెత్తడంతో కొన్నిరోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం అగ్రకథానాయకుడు రజనీకాంత్ తాజాగా ఇంటికి చేరుకున్నారు. సినిమా షూటింగ్లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం స్వల్ప అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. మూడు రోజుల చికిత్స అనంతరం ఆదివారం మధ్యాహ్నం రజనీ డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆయన.. తన కుమార్తెతో కలిసి ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. అనంతరం ఆయన చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కారులో ఇంటికి చేరుకున్నారు. మరోవైపు రజనీ ఆరోగ్యం పట్ల గత కొన్నిరోజులుగా ఆందోళన చెందుతున్న అభిమానులు ఇంటివద్దకు చేరుకొని ‘తలైవా’కు స్వాగతం పలికారు. దీంతో ఆయన అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
First
Previous
21
22
23
24
25
26
27
28
29
30
Next
Last