Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
‘రెడ్’ అలాంటి థ్రిల్లర్ కాదు..!
కొత్తదనం నిండిన కథలకు, బలమైన భావోద్వేగాలకు నెలవు దర్శకుడు కిషోర్ తిరుమల చిత్రాలు. ఇప్పుడాయన ‘రెడ్’ చిత్రంతో తొలిసారి ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. స్రవంతి రవికిశోర్ నిర్మించారు. మాళవిక శర్మ, అమృత అయ్యర్, నివేదా పేతురాజ్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు కిషోర్ తిరుమల.
సత్య... ‘గాడ్సే’
తన విలక్షణ నటనతో, కథల ఎంపికలో కొత్తదనంతో ప్రేక్షకులను అలరిస్తున్న సత్యదేవ్ త్వరలో ‘గాడ్సే’గా రానున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ట్వీట్ చేశారు. గతంలో ఆయన ప్రధాన పాత్రలో ‘బ్లఫ్‌మాస్టర్’ను తెరకెక్కించిన గోపిగణేష్ పట్టాభి దర్శకత్వంలో ‘గాడ్సే’ పట్టాలెక్కనున్నట్టు ప్రకటించారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని, ఈ చిత్రానికి సి.కల్యాణ్ నిర్మాత వ్యవహిరిస్తున్నారని ట్వీట్లో తెలిపారు. గాడ్సే చిత్ర టైటిల్ పోస్టర్‌ను ట్వీట్ చేశారు.పక్కనే వైన్ గ్లాస్, వెనుక మెషిన్‌గన్‌తో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. బ్లఫ్మాస్టర్తో సినిమాలో సత్యదేవ్ నటన ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలిసిందే. మరి వీరిద్దరి కాంబినేషన్లో ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.
ఆసక్తిగా ‘చెక్’ ఫస్ట్ గ్లింప్స్
నితిన్ కథానాయకుడుగా చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ ప్రకాశ్ వారియర్ నాయికలు. తాజాగా ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ‘‘జైల్లో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు’’ అనే సంభాషణతో ప్రారంభయ్యే ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోపక్క న్యాయమూర్తి ఆదిత్యకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునివ్వడం, పోలీస్ అధికారి ‘‘దేశద్రోహి..అదీ నీ గుర్తింపు’’ అని మాట్లాడటం సినిమాపై అంచనాలు పెంచుతుంది. ముఖ్యంగా నితిన్‌ని కొత్త గెటప్‌లో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కల్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.
ఆ సందర్భాలే సహనాన్ని పరీక్షిస్తాయి
గతేడాది నాని ‘వీ’లో సాహెబాగా నటించి మెప్పించిన నటి అదితి రావు హైదరీ. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ నటిస్తూ దూసుకుపోతుందీ భామ. ‘‘ఓటమిని గుణపాఠం చెప్పే గురువుగా భావిస్తాన’’ని చెబుతోంది. ‘‘ఒక్క అపజయం మనలోని నిజమైన వ్యక్తిత్వాన్ని వెలికి తీస్తుంది. మనమేంటో మనకు పరిచయం చేస్తుంది. జీవనపోరాటంలో చేసే పరుగులో ఒక్కోసారి కిందపడిపోతాం. కాళ్లు మట్టికొట్టుకుపోతాయి. చిన్నపాటి గాయాలూ అవుతాయి. అయినా బలంగా నిలబడాలి. కాళ్లకు అంటిన దుమ్ము దులిపి మళ్లీ పరుగు ప్రారంభించాలి. పడినప్పుడు నేర్చుకున్న పాఠాలనే, గురువులుగా భావించి మరింత మెరుగ్గా పరుగెత్తాలి. ఇలాంటి సందర్భాలే మన సహనానికి పరీక్షగా నిలుస్తాయి’ అని ఓటమిపై తన అభిప్రాయం చెప్పింది అదితి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ‘మహా సముద్రం’లో అదితి నటిస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ నటిస్తున్న ఈ సినిమాను అజయ్‌భూపతి తెరకెక్కిస్తున్నారు.
ఉత్తమ నటీనటులు..
దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయకులుగా పేరుపొందిన నాగార్జున, అజిత్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్‌లకు అరుదైన గౌరవం దక్కింది. మోస్ట్ వర్సటైల్ యాక్టర్స్‌గా వీరి నలుగురికి ‘దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ 2020’ అవార్డు వరించింది.
నందితశ్వేతా ‘అక్షర’ చిత్రం వర్కింగ్ స్టిల్స్
నందితశ్వేతా ‘అక్షర’ చిత్రం వర్కింగ్ స్టిల్స్
టీజర్ టాక్: గాజు ముక్కా వేస్టేరా గుణశేఖరా
‘బిచ్చగాడు’ చిత్రంతో టాలీవుడ్లో సంచలనం సృష్టించాడు తమిళ నటుడు విజయ్ ఆంటోని. అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. దాంతో ఆయన చిత్రాలన్నిటినీ తెలుగులోనూ విడుదల చేస్తున్నారు దర్శకనిర్మాతలు. త్వరలో విజయ్ నుంచి ‘విజయ రాఘవన్’ అనే చిత్రం రాబోతుంది. ఆత్మిక కథానాయిక. ‘మెట్రో’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద కృష్ణన్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ట్యూషన్ మాస్టర్ పాత్రలో కనిపించారు విజయ్. క్లాస్ లుక్‌లో, మాస్ లుక్‌లో దర్శనమిచ్చి ఆసక్తి పెంచుతున్నారు. ఓ రౌడీ గ్యాంగ్‌కి, విజయ్‌కి మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు చూపించారిందిలో. వాడు వేస్ట్ అని హీరోని ఉద్దేశించి ఓ పాత్ర డైలాగ్ చెప్పగా .. గాజు ముక్క కూడా వేస్టేరా గుణశేఖరా కానీ కంట్లో పడితే రక్తంగా మారుతుందని చెప్పే సన్నివేశం బాగా ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం అదరగొడుతుంది. నాయకానాయికల రొమాన్స్ మెప్పిస్తుంది. మరి పాఠాలు చెప్పే మాస్టారు పోరాటాలు ఎందుకు చేశారు? తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.
మార్చిలో వస్తోన్న అరేబియా సముద్రపు సింహం ‘మరక్కార్’
మన్యంపులి కథానాయకుడు మోహన్‌లాల్ నటిస్తున్న చారిత్రక చిత్రం మరక్కార్. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా విడుదల ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న మోహన్‌లాల్ అభిమానులకు ఇప్పుడు ఆ తియ్యని వార్త అందింది. చిత్రాన్ని మార్చి 26, 2021 విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది
‘ఒక్కడు 2’ ఉంటుంది.. దర్శకుడు ఆయనే
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘ఒక్కడు’కి ప్రత్యేక స్థానం ఉంది. మహేష్ బాబు యాక్షన్ నేపథ్యంలో విశ్వరూపం చూపించిన చిత్రమిది. గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. ప్రకాశ్ రాజ్, మహేష్ మధ్య వచ్చే డైలాగులు, కొండారెడ్డి బురుజు పోరాటాలు, భూమిక అందం, మణిశర్మ సంగీతం సినిమాను ఓ రేంజ్లో నిలబెట్టాయి. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. 2003లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బావుంటుందని మహేష్ అభిమానులంతా భావించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. తాజాగా ఆ చిత్ర నిర్మాత ఎం.ఎస్.రాజు చేసిన ట్వీట్ ఆసక్తిని పెంచుతుంది. ఇటీవలే రాజు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘డర్టీ హరి’. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. జనవరి 8న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ట్విటర్లో అభిమానులకు దగ్గరయ్యారు రాజు. కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలు సమాధానాలిచ్చారు. ఇందులో చాలామంది ‘ఒక్కడు’ కొనసాగింపు గురించి అడగటం విశేషం. ‘సర్ మీరు మహేష్‌తో చేసే సినిమా ఏ సంవత్సరం ఉంటుంది, ముఖ్యంగా మీరు చేసేది ఒక్కడు-2న?’ అని ఓ నెటిజన్ అడగ్గా ‘వచ్చే నెల చెబుతా’ అన్నారు రాజు. మరో వ్యక్తి ‘ఒక్కడు 2 అంటే
మాస్ మహారాజా అభిమానులకి ముందే సంక్రాంతి
‘డీజే కాదు... ఇది ఓజే. ఒంగోలు జాతర’ అంటూ సందడి చేశాడు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘క్రాక్’. శ్రుతిహాసన్ కథానాయిక. గోపీచంద్ మలినేని దర్శకుడు. సరస్వతి ఫిలింస్ డివిజన్ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. ఈ నెల 9న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్ విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘కథానాయకుడు రవితేజ నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. దర్శకుడు గోపీ అన్నది నాదీ ఒకే జిల్లా. పరిశ్రమకి వచ్చినప్పట్నుంచి అన్నదమ్ముల్లా కలిసే ఉంటాం. నిర్మాత మధుతో కొన్ని సినిమాలకి పనిచేశా. వీళ్లందరికీ ఈ సినిమా గుర్తుండిపోయేలా విజయాన్ని అందివ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘మేం అడగ్గానే వాయిస్ ఓవర్ ఇచ్చిన కథానాయకుడు వెంకటేష్‌కి ధన్యవాదాలు. ‘డాన్‌శీను’, ‘బలుపు’ తర్వాత రవితేజతో నేను చేస్తున్న మరో చిత్రమిది. రవితేజ అభిమానులకి ఈసారి సంక్రాంతికి కొంచెం ముందుగానే, 9వ తేదీనే వస్తుంది. తమన్‌తోపాటు, ప్రతి సాంకేతిక నిపుణుడు ఈ సినిమా కోసం కష్టపడి పని
First
Previous
23
24
25
26
27
28
29
30
31
32
Next
Last