Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
రివ్యూ: సోలో బ్రతుకే సో బెటర్
థియేటర్లలో శుక్రవారం మళ్లీ జోష్ మొదలైంది. లాక్‌డౌన్‌తో మూతపడిన థియేటర్లు.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఓ కొత్త సినిమా సందడిని రుచి చూశాయి. క్రిస్మస్ సందర్భంగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల కావడంతో... ప్రేక్షక, పరిశ్రమ వర్గాలు ఈ సినిమా గురించి ప్రత్యేకమైన ఆసక్తిని వ్యక్తం చేశాయి. దీని ఫలితంపైనే మిగతా సినిమాల రిలీజ్లు ఆధారపడి ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడిని ఈ సినిమా ఏ మేరకు సంతృప్తి పరిచింది? గతేడాది ‘ప్రతి రోజు పండగ’తో విజయాన్ని అందుకున్న సాయితేజ్ దాన్ని పునరావృతం చేశారా?
మోనాల్ గజ్జర్ - పంకజ్ త్రిపాఠిల కాగజ్ ట్రైలర్
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, ది సతీష్ కౌశిక్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కాగజ్. పంకజ్ త్రిపాఠి, తెలుగు బిగ్‌బాస్4 ఫేమ్ మోనాల్ గజ్జర్ కలిసి నటిస్తున్నారు. సతీష్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ఒకటి విడుదలై అలరిస్తోంది. చిత్ర కథ ఏమిటంటే ఉత్తరప్రదేశ్‌లోని ఓ మారుమూల చిన్న గ్రామానికి చెందిన రైతు లాలా బిహారి. అయితే అతను ప్రభుత్వ రికార్డులలో చనిపోయినట్లు ప్రకటిస్తారు. కానీ అతను జీవించే ఉంటాడు. దాంతో తను ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వస్తుంది. ఆ పోరాటంలో అతను ఏం చేశాడనేది మిగిలిన కథ.
ఆసుపత్రిలో రజనీ..
ప్రముఖ నటుడు రజనీకాంత్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ‘‘రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. బీపీని అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నాం. ఈ సమస్య తప్ప ఇతర ఇబ్బందులు ఏమీ లేవు. రక్తపోటు అదుపులోకి రాగానే రజనీకాంత్‌ను డిశ్ఛార్జి చేస్తాం. ఈ నెల 22న నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది’’ అని అపోలో ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా!
వైవిధ్య నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం కోబ్రా. ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఓ లుక్‌ని విడుదల చేశారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకొని విడుదలైన ఆ లుక్‌ని ఇట్టే కట్టిపడేసేటట్లు కనిపిస్తోంది. పోస్టర్లో విక్రమ్ కళ్లజోడు ధరించి ఉండగా,
ఆపత్కాలం.. సెలబ్రిటీ ప్రణయం
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో దగ్గుబాటి రానా ఒకరు. తన తోటి కుర్రహీరోలంతా ఒక్క ఒక్కొరుగా పెళ్లి పీటలు ఎక్కుతుండటంతో ఈ భల్లాలదేవుడి పెళ్లెప్పుడు అనే చర్చ టాలీవుడ్లో చాన్నాళ్లపాటు జోరుగా సాగింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ రానా తన పెళ్లి వార్తలకు కట్ చెప్పాడు.తన స్నేహితురాలు మిహికతో రాసుకున్న ప్రేమ స్క్రిప్ట్‌ను కొవిడ్ సమయంలో పెళ్లి వరకు తీసుకొచ్చాడు. రామానాయుడు స్టూడియోలో ఆగస్టు8న మిహికా బజాజ్‌ను మనువాడి కొత్త వెలుగులు తెచ్చాడు. అతికొద్ది మంది అతిథుల మధ్య తెలుగు, మరాఠీ ఇలా రెండు సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు రానా. ప్రస్తుతం వేణు ఊడుగల దర్శకత్వంలో ‘విరాట పర్వం’ చేస్తున్నారు. తమిళంలో తాను చేసిన ‘అరణ్య’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
రవితేజ ‘ఖిలాడి’లో ఐటెమ్ భామగా ప్రణీత?
అందాల అమ్మడు ప్రణీత సుభాష్ లాక్డౌన్ సమయంలో ఇంట్లో కూర్చోకుండా తనవంతుగా పలువురికి చేయూతనిచ్చింది. తెలుగులో రభస, అత్తారింటికి దారేది, మహేష్‌బాబు బ్రహ్మోత్సవం లాంటి సినిమాల్లో సందడి చేసింది. తాజాగా ఈ సొట్టబుగ్గల ముద్దుగుమ్మ రవితేజ ఖిలాడి చిత్రంలో ఓ పాటలో నటించనుందట. సినిమాలో ఓ ప్రత్యేక పాటకోసం ప్రణీతను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పక్కా మసాలా మాస్‌గా ఈ పాట ఉండనుందట. త్వరలోనే రవితేజ - ప్రణీతలపై పాటను చిత్రీకరించనున్నారని చెప్పుకుంటున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారు. కథానాయికలుగా ఇప్పటికే మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు నటిస్తున్నారు. ఇక ప్రణీత బాలీవుడ్లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వస్తోన్న హంగామా2లో, అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘భుజ్: ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రంలోనూ నటిస్తోంది. త్వరలోనే సినిమాలు విడుదల కానున్నాయి.
పండగ వేళ.. పోస్టర్ల కళ కళ
పరిస్థితులు ఎలా ఉన్నా పండగ అంటే ఆనందంగా గడపాల్సిన క్షణం. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుని సంతోషించే పర్వదినం. అలాంటి సందర్భంలో కొత్త సినిమాల అప్డేట్లు, సెలబ్రిటీల విషెస్ ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే అనుకున్న పండక్కి సినిమా విడుదల చేయలేకపోయినా ఓ పాటో, ఓ టీజరో, ఓ ట్రైలరో, ఓ లుక్కో అందిస్తుంటాయి ఆయా చిత్రబృందాలు. డిసెంబరు 25 క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు పోస్టర్లు సినీ ప్రియుల్ని అలరించేందుకు వచ్చాయి. పండగ వేళ వారి మోముల్లో కొత్త కళ తీసుకొచ్చాయి.
కోరమీసం పోలీసోడా.. నన్ను కొంచెం చూసుకోరా
వీర శంకర్ (రవితేజ).. సిన్సియర్ పోలీసు అధికారి. విధి నిర్వహణే ఆయన ప్రపంచం. భార్య, పిల్లలు కర్తవ్యం తర్వాతే. అయినా ఆయనంటే సతీమణ(శ్రుతి హాసన్)కి ఎంతో ప్రేమ. పనే కాదు నన్ను పట్టించుకో అని ప్రాధేయపడుతుంది. ‘కోరమీసం పోలీసోడా.. నన్ను కొంచెం చూసుకోరా’ అంటూ శ్రుతి హాసన్.. రవితేజను అడిగే ఈ పాట ‘క్రాక్’ చిత్రంలోనిది. రామజోగయ్య రచించిన ఈ గీతం తాజాగా విడుదలైంది. తాను చేస్తున్న పనిపై హీరోకి ఎంత శ్రద్ధ ఉందో వివరిస్తూనే అదే హీరోయిన్‌కి సవతి(రెండో భార్య)గా మారిందని చెప్పడం ఆయనకే చెల్లింది. తమన్ సంగీతం అందించిన ఈ పాటని రమ్య బెహర ఆలపించింది. గోపీ చంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా 2021 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వాస్తవ సంఘటన ఆధారంగా ఠాగూర్ మధు నిర్మించారు. ‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్-రవితేజ కలయికలో రాబోతున్న సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ‘భూమ్ బద్దల్’, ‘భల్లేగా ఉందే బంగారం’ పాటలు శ్రోతల్ని అలరిస్తున్నాయి.
ఎన్ఎఫ్డీసీలో నాలుగు ఫిల్మ్ మీడియా యూనిట్ల విలీనం
భారతదేశ సమాచారం మరియ ప్రసార మంత్రిత్వ శాఖ నాలుగు ఫిల్మ్ మీడియా యూనిట్లను ఒకే గొడుకు కిందకు చేర్చింది. వాటిలో ఫిల్మ్స్ డివిజన్, డైరక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీలన్నింటిని కలిపి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఎన్ఎఫ్డీసీ)లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్ఎఫ్డిసి ఇప్పుడు ప్రత్యేక ఫిల్మ్ యూనిట్లచే నిర్వహించబడుతున్న అన్ని విధులను ఒకే సంస్థగా నిర్వహిస్తుంది. "ఒక కార్పొరేషన్ క్రింద ఫిల్మ్ మీడియా యూనిట్ల విలీనం కార్యకలాపాలు, వనరుల కలయిక మంచి ఫలితాల సమన్వయానికి దారితీస్తుంది. తద్వారా ప్రతి మీడియా యూనిట్ యొక్క ఆదేశాన్ని సాధించడంలో తన సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈసారి ఫుల్ మీల్స్
యాక్షన్, లవ్, కామెడీ.. ఇలా అన్ని రకాల వినోదాల వంటని వడ్డించేందుకు సిద్ధమయ్యాడు నాని. ఆయన తాజా చిత్రం ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకుడు. క్రిస్మస్ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో పైకి సాఫ్ట్‌గా దర్శనమిస్తూనే మాస్ తరహాలో కనిపిస్తున్నాడు నాని. అరటాకులోని భోజనం ముందు టక్ చేసుకుని కూర్చుని.. వెనక నుంచి కత్తిని బయటకు తీస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. ఇంత క్లాస్ లుక్‌లో కత్తి పట్టుకోవడానికి కారణమేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. జగదీష్ నాయుడుగా నాని నటిస్తున్న ఈ చిత్రం 2021 ఏప్రిల్‌లో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నాయికలు. సంగీతం: తమన్. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మాతలు.
First
Previous
25
26
27
28
29
30
31
32
33
34
Next
Last