Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
చిన్న చిత్రం.. అరుదైన గౌరవం
పేరున్న నటీనటులు లేరు.. భారీ బడ్జెట్‌తో నిర్మించలేదు.. కథే ప్రధానంగా, అదే బలంగా వచ్చిన సినిమా ‘గతం’. సైకాలజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ సొంత చేసుకుంది. తాజాగా అరుదైన గౌరవం దక్కించుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) వేడుకల్లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శితమయ్యే సినిమాల జాబితాలో తెలుగు నుంచి ఎంపికైన ఏకైక చిత్రంగా నిలిచింది. భార్గవ పోలుదాసు, రాకేశ్ గలేభె, పూజిత, హర్ష వర్థన్, లక్ష్మీ భరద్వాజ్ తదితరులు తారాగణం. కిరణ్ కొండమడుగుల దర్శకుడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఎస్ ఒరిజినల్స్, ఆఫ్ బీట్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి.
ఆశ్చర్యానికి గురిచేసిన మోహన్‌లాల్ కూతురు
ప్రముఖ మలయాళి నటుడు కూతురు విస్మయ మోహన్‌లాల్. ఈ అమ్మడు ఏకంగా 22 కిలోల బరువును తగ్గింది. ఇదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ తన పాత ఫోటోతో పాటు బరువు తగ్గిన తరువాత ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసింది. కొన్నాళ్ల కిత్రం నేను నాలుగు మెట్లు ఎక్కాలంటే చాలా అయాసంతో ఇబ్బంది పడేదాన్ని. కానీ అప్పుడే నాకు నా శరీర బరువు తగ్గాలనే ఆలోచన పుట్టింది. దాంతో ధాయ్ల్యాండ్లోని ముయే థాయ్‌ను ప్రయత్నించా. అక్కడ కొండలను అధిరోహించడం ఇంకా ఎన్నో చేశాను. నాకోచ్ ప్రతిరోజూ 100 శాతం ప్రయత్నం చేశాడు. నా వెన్నంటి నా లక్ష్యాలను గుర్తుచేసి, నిజాయితీగా అడుగడుగునా నన్ను ముందుకు నడించాడు. ఒక్కోసారి గాయాలై ఇక చేయలేను అన్నప్పుడు కోచ్ ఎంతో ఓర్పుతో అండగా నిలిచి నన్ను ముందుకు నడిపించాడు.
కోవిడ్‌తో కన్నుమూసిన బాలీవుడ్ నిర్మాత పర్వేశ్ సి.మోహ్రా
ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత పర్వేశ్ సి.మెహ్రా కన్నుమూశారు. గత కొంతకాలంగా కరోనా వైరస్ (కోవిడ్-19) తో బాధపడుతూ మరణించారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయన బాలీవుడ్లో రామ్‌జానే, చమత్కార్, అశాంతి, షికారి: ది హంటర్, ప్యార్ కే దో పాల్ వంటి చిత్రాలను నిర్మించారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పర్వేశ్కి ఉమేష్, రాజేష్, రాజీవ్‌తో పాటు ఒక అక్క కూడా ఉన్నారు.
పద్ధతిగా తిరిగే భూమికే భూకంపాలు వస్తున్నాయి...
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ప్రతిరోజూ పండగే లాంటి వైవిధ్యమైన చిత్రాలల్లో నటించి మెప్పించిన కథానాయకుడు సాయి తేజ్. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటర్‌లో నటిస్తున్నాడు. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఒకటి విడుదలైంది. ట్రైలర్లో ప్రేమకు, పెళ్లిళ్లకు వ్యతిరేకంగా పెద్దమీటింగ్లు పెట్టి యువతను అప్రమత్తం చేస్తూ ఓ ఉద్యమంలా చేస్తుంటాడు. పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉంటూనే జీవితం ఎంతో గొప్పగా ఉంటుందని చెబుతుంటాడు. శ్రీవెంటేశ్వర సినీ చిత్రం, ఎల్ఎల్పీ నిర్మాణంలో సంయుక్తంగా రూపొందుతున్న చిత్రంలో నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది.
‘బంగారు బుల్లోడు’ వచ్చేది అప్పుడే
అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘బంగారు బుల్లోడు’. గిరి పి. దర్శకుడు. పూజా జవేరి నాయిక. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. పూర్తి స్థాయి కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది.
పద్ధతిగా తిరిగే భూమికే భూకంపాలు వస్తున్నాయి...
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ప్రతిరోజూ పండగే లాంటి వైవిధ్యమైన చిత్రాలల్లో నటించి మెప్పించిన కథానాయకుడు సాయి తేజ్. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటర్‌లో నటిస్తున్నాడు. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఒకటి విడుదలైంది. ట్రైలర్లో ప్రేమకు, పెళ్లిళ్లకు వ్యతిరేకంగా పెద్దమీటింగ్లు పెట్టి యువతను అప్రమత్తం చేస్తూ ఓ ఉద్యమంలా చేస్తుంటాడు. పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉంటూనే జీవితం ఎంతో గొప్పగా ఉంటుందని చెబుతుంటాడు. శ్రీవెంటేశ్వర సినీ చిత్రం, ఎల్ఎల్పీ నిర్మాణంలో సంయుక్తంగా రూపొందుతున్న చిత్రంలో నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది.
జనవరి 14.. వచ్చేస్తున్నాడు
మాస్ మహారాజా పోలీసు అధికారి వీర శంకర్‌గా నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతి హాసన్ కథానాయిక. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలోనే విడుదల చేస్తామని ప్రటించిన చిత్రబృందం తాజాగా తేదీని వెల్లడించింది. 2021 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ సినిమా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. మూడో పాట, థియేట్రికల్ ట్రైలర్ త్వరలోనే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.
17 వసంతాల ‘సత్యం’
ప్రేమ అనే మాట పాతదే అయినా ప్రేమకథలు కొత్తగా పుట్టుకొస్తుంటాయి వెండితెరపైన. ప్రేమ అనే సబ్జెక్టుతో కొన్ని వేలకుపైగా చిత్రాలొచ్చాయి. ప్రతి కథా అలరించింది. అయితే, కొన్ని చూసిన వెంటనే అక్కడితో వదిలేస్తాం. కొన్నింటిని మదిలో దాచుకుంటాం. మరికొన్ని వాటిని అరే! ఇది మన కథే అని భావిస్తాం. రచయిత అవ్వాలనుకునే ఓ యువకుడ్ని తను ఇష్టపడే వ్యక్తి అసహ్యించుకంటే ఎలా ఉంటుంది? సౌమ్యుడిగా ఉండే అతను అంత పెద్ద తప్పు ఏం చేశాడు? చివరకు తన ప్రేయసి క్షమిస్తుందా? ఈ నేపథ్యంలో వచ్చిన ప్రేమకథ గుర్తుందా... అవును అదే ‘సత్యం’. సుమంత్, జెనీలియా జంటగా దర్శకుడు సూర్యకిరణ్ తెరకెక్కించిన స్వచ్ఛమైన ప్రేమ కావ్యం ఇది. సత్యం పాత్రలో సమంత్, అంకిత పాత్రలో జెనీలియా నటించారు. సుమంత్ (సత్యం) తండ్రిగా మల్లాది రాఘవ, జెనీలియా తండ్రిగా కోట శ్రీనివాసరావు ఒదిగిపోయారు. తండ్రితో గొడవపడిన సత్యం ఇంట్లోనుంచి బయటకు వచ్చేస్తాడు. రచయిత అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. మంచి గుర్తింపు లభించాక అంకితకు తన ప్రేమను తెలియజేయాలనుకుంటాడు. అప్పటికే అంకితను మరో వ్యక్తి ఇష్టపడతాడు. సత్యంకు కోట శ్రీనివాసరావు పరిచయం ఎలా జరిగింది? సత్యం, అంకిత కలుసుకుంటారా? తెలియాలంటే
శుభవార్త వినిపించిన ‘కేజీఎఫ్’ బృందం
యావత్ సినీ ప్రపంచం ఆసక్తి ఎదురుచూస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న కన్నడ చిత్రమిది. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి సర్ప్రైజ్ వస్తుందా? అని ఆశగా ఉన్న అభిమానులకు తాజాగా శుభవార్త వినిపించింది చిత్రబృందం.
షూటింగ్ కేరాఫ్ హైదరాబాద్
హైదరాబాద్ కాస్త సినిమాబాద్గా మారిపోయింది. నగరంలో ఏ మూలకి వెళ్లినా చిత్రీకరణల సందడి కనిపిస్తోంది. కరోనా భయాలతో కొన్ని నెలలుగా స్తబ్దుగా కనిపించిన స్టూడియోలు కిటకిటలాడుతున్నాయి. తెలుగు సినిమాలే కాదు, హిందీ, తమిళం, కన్నడ భాషలకి చెందినవీ ఇక్కడే చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. రాబోయే కొన్ని నెలల పాటు ఇదే ఉద్ధృతి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
First
Previous
32
33
34
35
36
37
38
39
40
41
Next
Last