Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
‘మేడే’.. నేడే
బిగ్ బీ అమితాబ్ కథానాయకుడుగా ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆయనే. అంతేకాదు ముఖ్య పాత్రలోనూ కనిపించనున్నారు అజయ్. ఇందులో పైలట్‌గా కనిపిస్తారాయన. తాజాగా నాయిక వివరాలు వెల్లడించింది చిత్రబృందం. యువ నాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమవుతోంది. కో పైలట్‌గా దర్శనమివ్వనుంది. ‘అమితాబ్‌తో నటించాలనే నా కల నెరవేరబోతుంది. అజయ్ దేవగణ్ నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’నని ట్వీట్ చేసింది రకుల్. ఈ డిసెంబరులో హైదరాబాద్‌లో షూటింగ్ మొదలవుతుంది.
డ్యాన్స్ తో అదరగొట్టిన మహేష్ కూతురు సితార
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ప్రతి ఒక్కరు సామాజిక మాధ్యమాలను తప్పక అనుసరిస్తుంటారు. అంతేనా వారి వారసులు కూడా అదే విధంగా ముందుకెళ్లి అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా మిల్కీస్టార్ మహేష్‌బాబు గారాలపట్టీ సితార ఘట్టమనేని ఓ డ్యాన్స్ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాదు దానికి అనుగుణంగా ఓ వ్యాఖ్యను సైతం జోడించింది. ప్రేమ గురించి మీకు ఏమి తెలసు అంటూ పేర్కొంది.
‘తలపతి 65’ ఖరారైంది.. దర్శకుడెవరంటే?
ప్రముఖ తమిళ నటుడు విజయ్ 65వ చిత్రానికి దర్శకుడు ఎవరు? అనే ఉత్కంఠ తెరపడింది. ‘తలపతి 65’పై కొంతకాలంగా కోలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. అన్నింటికీ సమాధానం నెల్సన్ దిలీప్ కుమార్ అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. తన మొదటి చిత్రం ‘కొలమావు కోకిల’ అనే కామెడీ థ్రిల్లర్‌ను తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి.
బోలో బోలో బ్యాచ్‌లర్.. ‘సోలో బ్రతుకే సో బెటర్’
‘భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు.. భర్తకు మారకు బ్యాచిలరు’, ‘వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్లమంటరా డోన్ట్ మ్యారీ బీ హ్యాపీ’ అని పెళ్లి చేసుకుంటే ఎన్ని కష్టాలుంటాయో.. చేసుకోకపోతే ఎంత హాయిగా ఉంటుందో చెప్పారు రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. తాజాగా మరోసారి ‘బోలో బోలో బ్యాచ్‌లర్.. సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ హితబోధ చేస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్ర కోసం ఈ ప్రయత్నం చేశారాయన. ‘తగని పీకులాటలో తగులుకోకురో నిను విడిపించే దిక్కెవరు.. ఉన్నపాటుగా ఊబిలో దిగిపోతావా డియరు’ అంటూ తనదైన శైలి చూపించారు. బ్యాచిలర్లకి మరో ఆంథెమ్‌లా మారిపోయింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలోనిదీ గీతం. సాయి తేజ్, నభా నటేష్ జంటగా సుబ్బు తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం నాయిక నభా పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. తమన్ సంగీతం అందించగా విశాల్ దడ్లాని ఆలపించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బీవీఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
‘విరాటపర్వం’లో పేతురాజ్
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రియమణి,నందితా దాస్, జరీనా వహాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా యువ నాయిక నివేతా పేతురాజ్ కూడా ఈ సినిమాలో భాగమైంది. కరోనా పరిస్థితుల్లో తుది దశ చిత్రీకరణలో ఆగిన ఈ చిత్రం.. ఇటీవలే పునః ప్రారంభమైంది. ఆఖరి షెడ్యూల్‌కు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. శుక్రవారం సెట్స్‌లో అడుగుపెట్టింది పేతురాజ్. ‘నివేతా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంద’ని చిత్ర వర్గాలు తెలిపాయి. . ‘‘90ల కాలం నాటి ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది.
సోనూకి అరుదైన గౌరవం
బ్రిటన్‌కు చెందిన ఈస్టర్న్ ఐ మ్యాగజైన్ తాజాగా ‘టాప్ 50 ఏషియన్ సెలబ్రిటీస్ గ్లోబల్ 2020’ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో సోనూసూద్ ప్రథమ స్థానాన్ని దక్కించుకొన్నారు. లాక్డౌన్ సమయంలో సామాన్య ప్రజల కోసం సేవలు అందించి సోనూసూద్ గుర్తింపు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించినట్లు సదరు మ్యాగజైన్ నిర్వాహకులు తెలిపారు.
ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ మొదలైంది
విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’. ట్రైయాంగిల్ ప్రేమకథా నేపథ్యంలో విఘ్నేష్ శివన్ రూపొందిస్తున్నారు. చెన్నైలో గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. విఘ్నేష్, విజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘మీ అందరి ఆశీస్సులతో ఈ రోజు కాతువాకుల రెండు కాదల్ చిత్రాన్ని ప్రారంభించాం’ అని పేర్కొంది చిత్ర నిర్మాణ సంస్థ సెవెన్ స్ర్కీన్ స్టూడియోస్.
‘వాహనములు నిలుపరాదు’ అంటోన్న సుశాంత్
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అంటున్నాడు యువ కథానాయకుడు సుశాంత్. ఎక్కడ? ఎందుకు? అంటే సినిమా చూడాల్సిందే. సుశాంత్ హీరోగా నూతన దర్శకుడు దర్శన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. నో పార్కింగ్ ఉపశీర్షిక. ఈ ఏడాది తొలి భాగంలోనే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా లాక్డౌన్ అనంతరం మళ్లీ మొదలైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. గురువారం సుశాంత్ తన పాత్రకు డబ్బింగ్ చెప్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా సంబంధిత ఫొటోని అభిమానులతో పంచుకున్నారాయన.
శ్రీ విష్ణు కొత్త చిత్రం ప్రారంభం
యువ నాయకానాయికలు శ్రీవిష్ణు, అమృత అయ్యర్ జంటగా మ్యాట్నీ ఎంటర్మైన్మెంట్ సంస్థ ఓ చిత్రం నిర్మిస్తుంది. తేజ మర్ని దర్శకుడు. గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. అన్వేష్ రెడ్డి చిత్ర స్క్రిప్టుని అందజేయగా వివేక్ ఆత్రేయ క్లాప్ కొట్టారు. కృష్ణ ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహించారు. టైటిల్, సాంకేతిక వర్గ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
కోవిడ్ నుంచి కోలుకొని ‘కబ్జ’ చేయడానికి సిద్ధమైన ఆర్.చంద్రు
ఉపేంద్ర కథానాయకుడిగా వస్తున్న చిత్రం ‘కబ్జ’. ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమానికి లగడపాటి శ్రీధర్ సమర్పకుడు. శ్రీ సిద్ధేశ్వర ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఆర్.చంద్రశేఖర్, రాజ్ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ కోవిడ్-19 కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. తిరిగి మళ్లీ షూటింగ్ అక్టోబర్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే దర్శకుడు ఆర్.చంద్రు కోవిడ్ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలడంతో షూటింగ్ మళ్లీ వాయిదా పడింది. ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్న చంద్రు మళ్లీ పని మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు. డిసెంబర్ 20 నుంచి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమౌతున్నారు. ముందే అనుకున్నట్లు జైలు ఎపిసోడ్‌తోనే సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది.
First
Previous
47
48
49
50
51
52
53
54
55
56
Next
Last