Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
నిరాశను మిగిల్చింది అంటోన్న రీతూ వర్మ
‘పెళ్లి చూపులు’తో ప్రేక్షకుల మనసులు దోచుకున్న అచ్చ తెలుగు నటి రీతూ వర్మ. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో దుల్కర్ సల్మాన్‌తో చేసిన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమా విడుదలై సూపర్ హిట్ కొట్టింది. కొవిడ్ కారణంగా ఈ ఏడాది చాలా నష్టపోయానంటోంది ఆ భామ. ‘ఈ ఏడాది ఆరంభమంతా షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిచిపోయింది. ఆ వెంటనే దుల్కర్‌తో చేసిన సినిమా ఘనవిజయం సాధించడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మిగతా ఏడాదంతా అలాగే ఉంటుందని భావించాను. ఒకేసారి నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నాయి.
చీర ధరించడం ఓ అందమైన అనుభూతి: మౌనిరాయ్
బాలీవుడ్ నటి మౌనిరాయ్ ‘కె.జి.ఎఫ్: ఛాప్టర్ 1’ చిత్రంలో గలి గలి అంటూ సాగే ప్రత్యేక గీతంలో అలరించింది. అటు బుల్లితెరపైనే కాకుండా ‘హోలీ మెయిన్ రంగీలే’లాంటి మ్యూజిక్ వీడియోస్‌లో కనిపించి కవ్విస్తుంది. ఇక సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ పరపతిని పెంచుకుంటోంది మామిడి పెదవుల మౌనిరాయ్. ఎక్కువగా కురుచ దస్తుల్లో కనిపించే మౌని చీరలో కనిపించి కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా చీరలో సిగ్గులొలికించే కొన్ని ఫోటోలలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
యువతను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ డర్టీ హరి నిర్మాతపై కేసు
వర్షం, శత్రువు’, ‘ఒక్కడు’ ‘పౌర్ణమి లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డర్టీ హరి. రుహాని శర్మ, శ్రవణ్ రెడ్డి, సిమత్ర కౌర్ ఇందులో నటిస్తున్నారు. సినిమా ఓటిటి వేదికగా డిసెంబర్ 18, 2020న విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు విడుదల అయ్యాయి. అయితే కొన్ని పోస్టర్లు స్త్రీల గౌరవాన్ని అవమానించేలా, యువతను తప్పుదోవ పట్టించే రీతిలో సినిమా పోస్టర్లు ఉన్నాయంటూ నిర్మాత శివరామకృష్ణతో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీల పై సుమోటో కేసు నమోదు చేసారు జూబ్లీహిల్స్ పోలీసులు.
వెంతెరపై చెస్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్
ప్రముఖ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జీవితంపై బయోపిక్ చేయడానికి బాలీవుడ్ చిత్రసీమ సిద్ధమైంది. చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తారు. ఇంకా పేరు పెట్టని సినిమాని కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సన్ డయల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఈ వార్తలను తన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆనంద్ ఎల్.రాయ్ అత్రాంగి రే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సారా అలీఖాన్, ధనుష్‌లు నాయికానాయకులుగా నటిస్తుండగా అక్షయ్ కుమార్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆనంద్ బయోపిక్‌లో హీరో ఎవరన్నది ఇంకా తెలియదు. చిత్ర నిర్మాణ సంస్థలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినా సరే కొంతమంది నెటిజన్లు మాత్రం అభిషేక్ బచ్చన్ పేరును సూచిస్తూ కామెంట్స్ పెడతున్నారు.
క్రాక్ నుంచి లిరికల్ సాంగ్ విడుదల
మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `క్రాక్`. సరస్వతి ఫిలిం డివిజన్ పతాకంపై నిర్మితమౌతున్న చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా చిత్రానికి సంబంధించి భలేగా తగిలా బంగారం అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్రబృందం. పాటకి రామజోగయ్య సాహిత్యం అందించగా, అనిరుధ్ రవిచందర్ గొంతులో వినిపించారు.
‘క్రాక్’ నుంచి లిరికల్ సాంగ్ విడుదల

విరాటపర్వంలో రవన్నను చూశారా!
రానా దగ్గుబాటి హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో సాయిపల్లవి, నివేదా పెతురాజ్‌లు నటిస్తున్నారు. తాజాగా రానా పుట్టినరోజు పురష్కరించుకొని చిత్రానికి సంబంధించిన గ్లింప్ప్ ని విడుదల చేసింది. టీజర్లో రానా (రవన్న) పాత్ర చాలా ఉద్వేగంగా ఉంటుంది. 1990ల నాటి సంఘటనలను ఆధారంగా చేసుకొని చిత్రం రూపొందుంతుంది. కరోనా మహమ్మాకి కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. ఇటీవలే తుది దశ చిత్రీకరణ పునః ప్రారంభమైంది. ఆఖరి షెడ్యూల్లో భాగంగా రాత్రిపూట సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంకా చిత్రంలో ప్రియమణి కామ్రేడ్ భారత్క పాత్రలో కనిపించనుంది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించారు. సినిమాలో నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు’’ సురేష్ బొబ్బిలి సంగీత అందిస్తున్నారు. నిర్మాత చెరుకూరి సుధాకర్.
‘విరాటపర్వం’లో రవన్నను చూశారా!

ఐటెమ్ పాటల్లో అందాలు... ప్రేక్షకులకు కనువిందు
చిత్ర విజయంలో ప్రత్యేక గీతానికి ఓ స్థానముంటుంది. రెండుమూడు గంటల చిత్రంతో లభించే గుర్తింపు, పారితోషకం ఐదారు నిమిషాల ఐటెమ్ పాట తెచ్చిపెడుతోందనేది నేటి కథానాయికల మాట. అందుకే అగ్ర కథానాయికలూ వీటికి సై అంటుంటారు. తమ అందం, నృత్యంతో కనువిందు చేస్తుంటారు. ఇప్పటికే చాలామంది నాయికగా కొనసాగుతూనే స్పెషల్ సాంగ్‌లో నర్తించి మెప్పించారు. మేము సైతం అంటూ ఇప్పుడా జాబితాలోకి మరికొందరు చేరుతున్నారు.
అతను ఏం చేశాడు!
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంగా వస్తున్న హాలీవుడ్ చిత్రం నోబడి. ఇలియా నైషుల్లర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాబ్ ఓడెన్కిర్క్, కొన్నీ నీల్సన్, అలెక్సీ సెరెబ్రియాకోవ్, క్రిస్టోఫర్ లాయిడ్ తదితరులు నటించారు. కోవిడ్ 19 మహమ్మారి లేకుంటే ఆగస్టు 14, 2020న తెరపైకి రావాల్సింది. తాజాగా సినిమా విడుదల తేదిని ఫిబ్రవరి 26, 2021కు వాయిదా వేశారు. ఈ మధ్యే చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. చిత్ర కథేంటంటే హచ్ మాన్సెల్ (బాబ్ ఓడెనిర్క్) పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వ్యాధితో బాధపడుతున్న సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి. అనుకోకుండా ఓ రోజు రాత్రి తన ఇంట్లోకి ఇద్దరు దొంగలు ప్రవేశిస్తారు. కానీ అతను వారిని ఏమీ అనకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటాడు. అదే విధంగా పొరుగింట్లోకి అదే ఇద్దరు దొంగలు ప్రవేశించి దాడి చేసినప్పుడు. హచ్ వారిని వారించి ఆ ఇద్దరని హత్య చేసి వారికి సాయం చేస్తాడు. అయితే రష్యన్ డ్రగ్ లార్డ్ మాత్రం హచ్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకుంటానంటూ బెదిరిస్తాడు.
First
Previous
48
49
50
51
52
53
54
55
56
57
Next
Last