Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
‘రాగలీల’.. రూటు మార్చిన జంధ్యాల
జంధ్యాల.. ఈ పేరు వినగానే వెంటనే కదలాడేవి కుటుంబ కథా చిత్రాలు, నవ్వులు పూయించే సన్నివేశాలు. ఓ సందర్భంలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాల జాబితా చూస్తుండగా ‘రాగలీల’ కంటపడింది. జంధ్యాల రూటు మార్చి కొత్తగా ప్రయత్నించారా? అయినా ఆయన ఇలాంటి సినిమాలు తీస్తారా? అనే సందేహం కలిగింది. చూసిన తర్వాత ఇంగ్లిష్ సామెత (డోన్ట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ ) గుర్తొచ్చింది. ఎందుకంటే రొమాంటిక్ చిత్రం అయినప్పటికీ ఎక్కడా అభ్యంతర దృశ్యాలు కనిపించవు. తన మార్క్ సంభాషణలతో అలరిస్తూనే పతాక సన్నివేశాల్లో కంటతడి పెట్టించారు. 1987లో వచ్చినప్పటికీ ఈతరం ప్రేక్షకుల్ని హత్తుకునే వైవిధ్యమైన ఈ చిత్ర విశేషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను...