Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
అక్కా..ఆర్.ఆర్.ఆర్ విడుదల ఎప్పుడు?
ఈ సంక్రాంతి పండగ సందర్భంగా అందరూ హీరోలు, కొత్త సినిమాలు తమ ఏదో ఒక శుభవార్త చెప్పాయి. కానీ జక్కన చెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మాత్రం ఎలాంటి వార్త సంక్రాంతికి వినిపించ లేదు. దీనిపై ఓ అభిమాని సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్.ఆర్.ఆర్ చిత్రంపై రాజమౌళి కుటీరం పేరుతో వ్యంగ్యంగా కార్టూన్ ద్వారా స్పందించాడు. ఆ కార్టూన్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నిల్చుని ఉండగా వారికి ఎదురుగానే ఇద్దరు యువతులు ముగ్గులు వేస్తూ అక్కా సినిమా ఎప్పుడు విడుదల అవుతోంది అని చెల్లిని ప్రశ్నించగా,..తప్పమ్మా తెలియనివి అడగకూడదని అక్క సమాధానం చెబుతోంది. ప్రస్తుతం ఈ కార్టూన్ సామాజిక మాధ్యమాల్లో వైరలౌతోంది. ఈ కార్టూన్ చూసిన ఆర్ఆర్ఆర్ చిత్రం బృందం స్పందిస్తూ.. `సృజనాత్మకతతో కొట్టారు. చాలా నచ్చింది. హ్యాపీ సంక్రాంతి` అని అంటూ సమాధానం ఇచ్చారు. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్న రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్)) చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలను పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
చిరు వాయిస్ ఓవర్‌తో ఆర్.ఆర్.ఆర్ టీజర్ వస్తుందా?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్) ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చిత్రంపై చిత్రసీమతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పరిచయపాత్రల టీజర్లు విడుదలై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో టీజర్‌ని ఈనెల 26 ఘనతంత్ర దినోత్సం సందర్భంగా విడుదల చేయనున్నారని సమాచారం. అంతేకాదు ఈ వీడియోకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్నారని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఆర్ఆర్ఆర్కి సంబంధించిన మరో వీడియో బయటకు వస్తుందనడంతో రామ్‌చరణ్, ఎన్టీఆర్ అభిమానులతో పాటు చిత్రసీమ సైతం ఎదురుచూస్తోంది. ఆ విశేషం ఏంటో తెలియాలంటే ఈనెల 26 వరకు ఆగాల్సిందే మరి! డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రంలో బాలీవుడ్ కథానాయిక అలియా భట్, హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నాయికలుగా నటిస్తున్నారు.
భారీ యాక్షన్ సీన్‌కి సిద్ధం?
రాజమౌళి సినిమా అంటే పోరాట ఘట్టాలు ఎక్కువగా కదలాడతాయి. నాయకాప్రతినాయకుల నడుమ వచ్చే ఆ దృశ్యాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. గత చిత్రాల్లో చూపించినదాని కంటే ఎక్కువ చూపించబోతున్నారట ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్లో వీటిని చిత్రీకరించనున్నారని సమాచారం.
అలియా అడుగుపెట్టింది
అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. ఇటీవలే చరణ్, ఎన్టీఆర్‌లపై మహాబలేశ్వరంలో ఓ చిన్న షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మరో కీలక షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడీ షెడ్యూల్ కోసమే భాగ్యనగరం చేరుకుంది అలియా. ఆమె ఈ చిత్రంలో సీత అనే పాత్రలో చరణ్‌కు జోడీగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ప్రారంభం కానున్న షెడ్యూల్లోనే వీళ్లిద్దరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు రాజమౌళి. సోమవారం నుంచి షూటింగ్‌ని మొదలుపెట్టారు. ఈ చిత్రం కోసం అలియా ప్రత్యేకంగా ఓ శిక్షకురాలిని నియమించుకొని మరీ తెలుగు నేర్చుకుందని తెలిసింది. ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ కనిపించనుంది. ఆమె కూడా త్వరలోనే సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న ఫిక్షనల్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అం
ఇక్కడ భానుప్రియ.. అక్కడ షెఫాలీ?
ప్రభాస్ కథానాయకుడుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఛత్రపతి’. ఇప్పుడీసినిమాను బాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయక్ ఛత్రపతిని హిందీలో తెరకెక్కించబోతున్నారు. ఛత్రపతిలో కథానాయకుడి పాత్రకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అదే స్థాయిలో హీరో తల్లి, తమ్ముడు పాత్రలకు ఉంది.
మహాబలేశ్వర్‌లో ‘ఆర్ఆర్ఆర్’
‘ఆర్ఆర్ఆర్’ బృందం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో చిత్రీకరణ ప్రారంభించింది. అక్కడి అందమైన ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి. ‘అతి తక్కువ రోజులతో కూడిన షెడ్యూల్’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ మేరకు లొకేషన్ వేటను ఓ వీడియోలో బంధించి సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అల్లూరి సీతారామరాజుగా చెర్రీని, కొమురం భీంగా తారక్‌ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని సినీ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. వాళ్ల ఆసక్తిని పెంచుతూ అంచనాలు అందుకునేలా తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు రాజమౌళి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అలియాభట్, ఒలివియా మోరిస్ నాయికలు.
పోరాట అంకం ముగిసింది..!
‘ఆర్ఆర్ఆర్’.. సుధీర్ఘ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దాదాపు 50 రోజులుగా సాగుతున్న పోరాట ఘట్టాల చిత్రీకరణ సోమవారం ముగిసింది. ఇదే వేగాన్ని కొనసాగిస్తూ తదుపరి షెడ్యూల్‌ని విదేశాల్లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు దర్శకనిర్మాతలు. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ రాత్రి వేళలో షూట్ చేసిన దృశ్యాల్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు మొత్తం రాత్రి సమయంలోనే చిత్రీకరించడం విశేషం. రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అల్లూరి సీతారామరాజుగా చెర్రీని, కొమురం భీంగా తారక్‌ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని సినీ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. వాళ్ల ఆసక్తిని పెంచుతూ అంచనాలు అందుకునేలా తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు రాజమౌళి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అలియాభట్, ఒలివియా మోరిస్ నాయికలు. అజయ్ దేవగణ్, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అగ్ర హీరోల గాత్రంతో ‘ఆర్ఆర్ఆర్’ కథ?
‘ఆర్ఆర్ఆర్’ గురించి ఏ చిన్న విషయం బయటకొచ్చినా ట్రెండింగ్ అవుతుంటుంది. ఈ సినిమాపై ఏదో ఒక ఆసక్తికర అంశం చక్కర్లు కొడుతూనే ఉంటుంది. వాటిలో కొన్ని నిజం కాగా మరికొన్ని ఊహాగానాలుగానే తేలిపోయాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ వర్గాలు వినిపిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ప్రేరణతో రూపొందుతున్న ఈ చిత్ర కథను ఒక్కో భాషల్లో ఒక్కో అగ్ర హీరో పరిచయం చేయబోతున్నారట. హిందీలో ఆమీర్ ఖాన్, తెలుగులో చిరంజీవి పేర్లు ప్రస్తుతానికి బయటకు వచ్చాయి. వీళ్లు ఈ సినిమాకు వాయిస్ ఇస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది టాలీవుడ్లో. మిగిలిన భాషల్లో ఎవరు చెప్తారు? అసలు ఇందులో వాస్తవమెంత? అంటే అధికారిక ప్రకటన కోసం కొంతకాలం ఆగాల్సిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.
‘ఆర్ఆర్ఆర్’ యాక్షన్ చూశారా!!
రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఆలియా భట్, ఓలివియా మోరిస్ కథానాయికలు. లాక్డౌన్ తర్వాత శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఆసక్తికర వీడియోను పంచుకుంది. భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నామని, థియేటర్లలో వేరే లెవెల్లో ఉంటుందని పేర్కొంది.
‘ఆర్ఆర్ఆర్’ ప్రతినాయిక విచ్చేసింది
రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్.ఆర్.ఆర్) చిత్రంలో బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్ ప్రముఖులు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐరీష్ అందాల భామ అలిసన్ డూడి ప్రతినాయికగా లేడీ స్కాట్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనేందుకు నవంబరు 1న ఇండియా వచ్చారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. లేడీ స్కాట్ ఇండియా వస్తుందంటూ రాసుకొచ్చారు. మరి అలిసన్ ఎప్పటి నుంచి షూట్లో జాయిన్ అవుతారో తెలియాల్సి ఉంది. చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రల్లో నటిస్తున్న విషయం విధితమే.
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last