Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
షారుఖ్ సరసన తాప్సి?
షారుఖ్ ఖాన్‌తో తాప్సీ నటిస్తుందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని షారుఖ్‌తో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే నాయికగా తాప్సిని ఎంపిక చేసే ఆలోచనలో ఉందట చిత్రబృందం. నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ బాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకుంది తాప్సి. ఈ చిత్రంలోనూ అదే తరహా అభినయం ప్రదర్శించే పాత్ర కావడంతో తాప్సిని అనుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం షారుఖ్ ‘పఠాన్’లో నటిస్తున్నారు. ‘వార్’ చిత్రంతో విజయం అందుకున్న సిద్థార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. దీపికా పదుకొణె నాయిక. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్నాడు.
షారుఖ్...నీవే నా ప్రాణం అంటోన్న జూహీ చావ్లా
షారుఖ్ ఖాన్, జూహీచావ్లా కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తున్నాడు. మరో వైపు జూహీచావ్లా నా హృదయమంతా నీవేనంటూ యదపై చేయివేసి ప్రమాణం చేస్తుంది. ఇంతకీ వీరిద్దరూ కలిసి ఉన్న ఈ దృశ్యం ఏ చిత్రంలోనిదో చెప్పండి చూద్దాం.
దీపికా - షారుఖ్‌ల పఠాన్
మూడు సంవత్సరాల తరువాత షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రం పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ కూడా చిత్ర భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సినిమా షూటింగ్ నవంబర్లోనే ప్రారంభమైంది. ఇందులో జాన్ అబ్రహం కూడా నటిస్తున్నారు. దీపికా సోమవారం రెండు రోజుల షూటింగ్ కోసం చిత్రబృందంలో చేరింది. తరువాత మరోసారి డిసెంబర్ మధ్యలోనూ దీపికా చిత్రంలో తిరిగి భాగం కానుంది. సినిమాకి సంబంధించిన ప్రధాన యాక్షన్ సన్నివేశాలను వచ్చే యేడాది జనవరి నుంచి జూన్ మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. మొత్తం మీద షారుఖ్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన జీరో చిత్రం తరువాత నటిస్తున్న చిత్రం పఠాన్ కావడం విశేషం.
షారుఖ్ సరసన మరోసారి!
పెళ్లి తర్వాతా అద్భుత అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ముందున్నారు దీపికా పదుకొణె. ఇప్పటికే ప్రభాస్‌తో నాగఅశ్విన్ తెర కెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న దీపికా... ఇప్పుడు షారుఖ్ సరసన నటించడానికి ఒకే చెప్పేసింది. వీరిద్దరు ఇప్పటికే బాలీవుడ్లో ‘హిట్ పెయిర్’గా పేరుపొందారు. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించనున్న భారీ యాక్షన్ చిత్రం ‘పథాన్’. జాన్ అబ్రహాం ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ నెలాఖరులోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో దీపిక పదుకొణె కథానాయకగా నటించనుంది. దీంతో షారుఖ్, దీపిక జంటగా చేస్తున్న నాలుగో చిత్రమిది కానుంది. దీనికోసం ఆమెకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఇలాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటించడం కంటే అదృష్టం ఏముంటుంది’ అని దీపిక చెప్పుకొచ్చింది. ‘పథాన్’ చిత్రాన్ని రూ.200కోట్లతో తెర కెక్కిస్తున్నారు.
షారుఖ్ - అట్లీల చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారా?
చిన్న వయసులోనే ఘన విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు అట్లీ. షారుఖ్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్లో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టుతో పాటు, కథా రచయితలు షారుఖ్ ప్రొడక్షన్ హౌస్ మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే అధికారికంగా బయటకు రానున్నాయి. షారుఖ్ - అట్లీ చిత్రానికి తాత్కాలికంగా శంకి పేరుతో చిత్రం చలామణి అవుతోంది. ఇందులో షారుఖ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారట. అందులో ఒకటి పోలీస్ అధికారిగా, మరొకటి క్రిమినల్ పాత్ర. రెండు పాత్రల చుట్టూ కథ తిరగనుంది. అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏ.ఆర్.రెహమాన్ సంగీత స్వరాలు సమకూరిస్తే బాగుంటుందని అట్లీ భావిస్తున్నాడట. ఆ మధ్య రెహమాన్ బాలీవుడ్‌లోని ఓ ప్రత్యేక బృందం తనకు సరైన అవకాశాలు రాకుండా అడ్డుపడుతుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. షారుక్ జీరో చిత్రం తరువాత ఇప్పటీ వరకు మరో చిత్రంలో నటించలేదు.
వర్ణ వివక్షను వీడండి: సుహానా ఖాన్
ప్రస్తుతం సెలబ్రిటీలు వారి కుటుంబాలపై తరచూ ఏవో వార్తలు సామాజిక మాధ్యమాల్లో వస్తూనే ఉంటాయి. వాటిలో ద్వేషించే వార్తలు ఉంటాయి. మెప్పించే వార్తలూ ఉంటాయి. అప్పుడుప్పుడు సెలబ్రిటీలపై ట్రోల్స్ వస్తుంటాయి. తాజాగా షారుక్ ఖాన్, గౌరిఖాన్ తనయ సుహానా ఖాన్ తన చర్మ రంగుపై కామెంట్లు చేసిన వారిపై తనదైన రీతిలో జవాబిచ్చింది.
షారుఖ్ సరసన తాప్సి?
దక్షిణాదిలో గ్లామర్ పాత్రలతో అలరించిన తాప్సి కొత్త దారిలో వెళుతూ విజయాలు అందుకుంటుంది. ‘పింక్’, ‘బద్లా’, ‘శాండ్ కీ ఆంఖ్’, ‘తప్పడ్’ లాంటి చిత్రాలతో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించి బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది.
యాక్షన్‌లో సూపర్‌స్టార్.. కట్ చెబితే షారుక్
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సుశాంత్ సింగ్ చివరి చిత్రం 'దిల్ బెచారా' నేడు(జులై 24) ఓటీటీలో విడుదల కానుంది. సాయంత్రం 7:30 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సెట్స్‌లో సుశాంత్ అల్లరికి సంబంధించిన విశేషాలతో రూపొందిన వీడియోను దర్శకుడు ముకేశ్ చబ్రా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అతడితో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు. సుశాంత్‌ను 'హీరో' అని అభివర్ణించారు. 'దిల్ బెచారా' షూటింగ్ జరుగుతున్న సమయంలో తామిద్దరం(సుశాంత్, ముఖేశ్) సినిమాల గురించి చాలా మాట్లాడుకునేవాళ్లమని చెప్పిన ముకేశ్.. యాక్షన్‌లో ఉంటే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు, కట్ చెబితే షారుక్ ఖాన్‌కు సుశాంత్ వీరాభిమాని అని వెల్లడించారు. జంషెడ్పుర్లో చిత్రీకరణ సందర్భంగా రోడ్డుపైనే షారుక్ పాటలకు సుశాంత్ డ్యాన్స్ చేసినట్లు తెలిపారు. 'దిల్ బెచారా'లో సుశాంత్, సంజనా సంఘీ జంటగా నటించారు. 2014లో వచ్చిన హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు రీమేక్ ఇది. ఇద్దరు క్యాన్సర్ పేషెంట్ల మధ్య సాగే ప్రేమ కథతో సినిమాను రూపొందించారు. సైఫ్ అలీ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.
వైరలవుతోన్న మహేష్, రష్మిక ‘దిల్వాలే దుల్హనియా’
‘దిల్వాలే దుల్హనియ లేజాయేంగే’ చిత్రంలో షారుఖ్ ఖాన్, కాజోల్ కదా! మహేష్ బాబు, రష్మిక ఏంటి? అని సందేహ పడుతున్నారా? అవునంటే.. ఇది చదవండి. మహేష్, రష్మిక జంటగా అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
అరచేతినే అద్దం చేసుకొని...
ప్రపంచంలో ఎవరైనే సరే గడ్డం చేసుకోవాలంటే అద్దం ఉండాల్సిందే. కానీ అద్దం లేకుండా తన అరచేతినే అద్దంగా భావించి గడ్డం చేసుకొంటున్నాడు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్. పక్కన్నే ఉన్న శిల్పా శెట్టి కూడా షారుక్ అరచేతినే అద్దంగా భావించి తన అందాన్ని చూసుకొంటూ మురిసిపోతుంది.
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last