Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
Search
Search
Search
‘రాగలీల’.. రూటు మార్చిన జంధ్యాల
జంధ్యాల.. ఈ పేరు వినగానే వెంటనే కదలాడేవి కుటుంబ కథా చిత్రాలు, నవ్వులు పూయించే సన్నివేశాలు. ఓ సందర్భంలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాల జాబితా చూస్తుండగా ‘రాగలీల’ కంటపడింది. జంధ్యాల రూటు మార్చి కొత్తగా ప్రయత్నించారా? అయినా ఆయన ఇలాంటి సినిమాలు తీస్తారా? అనే సందేహం కలిగింది. చూసిన తర్వాత ఇంగ్లిష్ సామెత (డోన్ట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ ) గుర్తొచ్చింది. ఎందుకంటే రొమాంటిక్ చిత్రం అయినప్పటికీ ఎక్కడా అభ్యంతర దృశ్యాలు కనిపించవు. తన మార్క్ సంభాషణలతో అలరిస్తూనే పతాక సన్నివేశాల్లో కంటతడి పెట్టించారు. 1987లో వచ్చినప్పటికీ ఈతరం ప్రేక్షకుల్ని హత్తుకునే వైవిధ్యమైన ఈ చిత్ర విశేషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను...
కోవిడ్-19 నుంచి కోలుకున్న నటి సుమలత
దాదాపు నెల కిత్రం నటి సుమలలత కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆమె ఇంట్లోనే స్వీయనిర్భంధంలోకి వెళ్లింది. తాజాగా ఆమె కరోనా నుంచి కోలుకుంది. మరోసారి టెస్ట్ చేయించుకోగా నెగటివ్ అని తేలడంతో ట్విట్టర్ వేదిక స్పందిస్తూ..‘‘కరోనా వైరస్ నిర్భంద సమయాన్ని పూర్తిచేశాను. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 3 వారాల పాటు రోగ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాను. ఇప్పుడు కోవిడ్ లక్షణాలు లేవని తేలింది. అయినా సరే మళ్లీ సాధారణ స్థితికి రావాలంటే 4 నుంచి 5 వారాల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. ప్రతిఒక్కరి ధన్యవాదాలు. ఇలాంటి కష్టకాలాన్ని అధిగమించాను. సాధ్యమైనంత త్వరగా నా సామర్థ్యం మేరకు సేవలు కొనసాగించడానికి ఎదురుచూసున్నా.
రాజమాతగా సుమలత!
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న అలనాటి నటి సుమలత. తాజాగా ఆమె కన్నడంలో ‘మడకరి నాయక’ అనే చిత్రంలో రాజమాతగా నటిస్తుంది. ఎస్.వి.రాజేంద్ర సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో దర్శన్ నటిస్తున్నారు.
సందిగ్థంలో నటి సుమలత
దివంగత కన్నడ కథానాయకుడు అంబరీష్ భార్య నటి సుమలత రాజకీయ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఆమె కోరుకున్న చోటు నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ను నిరాకరిస్తోంది అధిష్టానం. అంబరీష్ మండ్య జిల్లాకు చెందినవారు కావడంతో, సుమలత అక్కడి నుంచే వచ్చే పోటీ చేయాలని భావిస్తున్నారు.
రాజకీయాల్లోకి సుమలత
'శుభలేఖ' లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న నటి సుమలత. సంప్రదాయబద్ధమైన కథానాయిక పాత్రలకు పెట్టింది పేరు. అంబరీష్‌ని వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న అంబరీష్ ఆ తరవాత రాజకీయాల్లోనూ రాణించారు.
రాజకీయాల్లోకి వస్తున్న తారామణులు..?
ప్రాంతీయ భాషా చిత్రాల కథానాయిక, కన్నడ నటుడు, రాజకీయనాయకుడు దివంగత అంబరీష్ సతీమణి సుమలత. ఈమె రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. ఇటీవల జరిగిన అంబరీష్ సంస్మరణ సభలో ఈ నిర్ణయానికి బీజం పడింది.
అంబరీశ్‌కు అశ్రు నివాళి
గుండెపోటుతో శనివారం రాత్రి హఠాన్మరణం చెందిన ప్రముఖ కన్నడ నటుడు అంబరీశ్ భౌతిక కాయానికి రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు ఘన నివాళులర్పించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనకు ఉంచారు.