Error

Return to the Home Page 9 సంవత్సరాల ‘100% లవ్‌’
9 సంవత్సరాల ‘100% లవ్‌’


నాగ చైతన్య, తమన్నా జంటగా సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘100% లవ్‌’. బాలు మహేంద్రగా చైతూ, మహాలక్ష్మిగా తమన్నా నటన అద్వితీయం. బాగా చదివే బాలు, చదువంటే ఇష్టంలేని మహాలక్ష్మి ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నారు. ప్రేమ కథల్ని సరికొత్తగా చూపడంలో సుకుమార్‌ స్టైలే వేరని మరోసారి ఈ చిత్రంతో నిరూపించుకున్నారు. అప్పట్లో ఈ సినిమా ప్రేమికుల మదిలో ఓ గూడు కట్టుకుంది. బావ మరదళ్లకు ప్రత్యేకంగా నిలిచింది. జక్కా హరి ప్రసాద్‌ స్క్రీన్‌ప్లే అద్భుతంగా సాగింది. ఈ చిత్రానికి మరో ప్రధాన బలం సంగీతం. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన అన్ని పాటలు ఓ ఊపు ఊపాయి. చంద్రబోస్‌, శ్రీమణి, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2011 మే 6న ప్రేక్షకుల ముందుకొచ్చింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.