21 సంవత్సరాల ‘రాజకుమారుడు’

సూపర్‌స్టార్‌ కృష్ణ తనయుడిగా తెలుగు యువకథానాయకుడిగా సినీరంగ ప్రవేశం చేసిన నటుడు మహేష్‌బాబు. తొలిసారి కథానాయకుడిగా ‘రాజకుమారుడు’ చిత్రంలో ప్రేక్షకులను మెప్పించారు. దర్శకేంద్రుడు రాఘేవేంద్రరావు దర్శకత్వంలో సరిగ్గా 21 సంవత్సరాల కిత్రం హీరో రాజకుమారుడిగా యువప్రేక్షకులను అలరించారు. అశ్వినీదత్‌ నిర్మాతగా నిర్మించిన ‘రాజకుమారుడు’ చిత్రం జులై 30, 1999న విడుదలైంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో ప్రీతిజింటా కథానాయికగా నటించింది. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్‌లు చిత్రానికి కొత్తహంగులు తీసుకొచ్చాయి. ఇక మణిశర్మ సంగీత స్వరాలు, అజయ్‌ విన్సెంట్‌ కెమెరా పనితనం, కోటగిరి వెంకటేశ్వరరావు కూర్పు చాలా కుందనంగా కుదిరిందని చెప్పవచ్చు. ఈ సినిమా తరువాత మహేష్‌బాబు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు అమ్మాయిల కలల రాకుమారుడిగా వారి గుండెల్లో స్థానం సంపాదించాడు. ఈ ఏడాది ఆరంభంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా, విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటించింది. మహేష్‌బాబు ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ నిర్మాణంలో వస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ కథానాయికగా నటిస్తుండగా, తమన్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. పిఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రఫీ, మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు.View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.