బయోపిక్‌...యమా కిక్‌!
అను‌వ‌మ‌ఖేర్‌
బాలీ‌వు‌డ్‌లో విల‌న్‌గానే కాకుండా విలక్షణ పాత్రల్లో తనని తాను ఆవి‌ష్క‌రిం‌చు‌కున్న ఈ నటుడు అనూ‌హ్యంగా నేడు−‌మాజీ ప్రధాని మన్మో‌హన్‌ సింగ్‌.‌

నంద‌మూరి బాల‌కృష్ణ
తండ్రి నుంచి కళా‌వా‌ర‌స‌త్వాన్ని అంది‌పు‌చ్చు‌కుని ఈ తరం నటుల్లో పౌరా‌ణిక, జాన‌పద, సాంఘిక చిత్రాల్తో వైవి‌ధ్యాన్ని కన‌బ‌రు‌స్తున్న బాల‌కృష్ణ నేడు−‌విశ్వ‌వి‌ఖ్యాత, నట‌సా‌ర్వ‌భౌమ, పద్మశ్రీ ఎన్‌.టి. ‌రా‌మా‌రావు.‌

article image
కీర్తి సురేష్‌
ఇప్పు‌డి‌ప్పుడే తెరపై బుడి‌బుడి అడు‌గు‌లేస్తూ అంది‌వ‌చ్చిన అవ‌కా‌శా‌లతో తనని తాను నిరూ‌పిం‌చు‌కు‌నేం‌దుకు ఉవ్వి‌ళ్ళూ‌రు‌తున్న ఈ నటి.‌.‌.‌ అల‌నాటి ‌‘మహా‌నటి’‌ సావిత్రి.‌

విద్యా‌బా‌లన్‌
ఎడా‌పెడా సిని‌మాలు ఒప్పు‌కో‌కుండా సవా‌ల్‌గా నిలిచే పాత్రల ఎంపి‌క‌తోనే అభి‌రుచి చాటు‌కుం‌టున్న ఈ నటి ఒక‌ప్పుడు ‌‘సిల్క్‌‌స్మిత’‌.‌ ఇలా చెప్పు‌కుంటూ పోతే ఈ తరహా చిత్రా‌లెన్నో.‌.‌.‌.‌ఎన్నెన్నో? కాల్ప‌నిక కథలే కాకుండా నిత్యం కళ్ల‌ముందు కద‌లా‌డుతూ ‌‘వార్తల్లో వ్యక్తు’‌లుగా విశేష ప్రాచు‌ర్యాన్ని పొందిన ఎంతో‌మంది రియ‌ల్‌స్టో‌రీలు ఇప్పుడు రీల్‌ కెక్కు‌తు‌న్నాయి.‌ నాయ‌కు‌లు‌గానో, ప్రతి‌నా‌య‌కు‌లు‌గానో లబ్ద‌ప్రతి‌ష్టు‌లై‌న‌వారి జీవి‌తా‌ల‌నా‌ధారం చేసు‌కుని రూపొం‌దు‌తున్న చిత్రాల జాబితా అంత‌కం‌తకీ పెరు‌గుతూ వస్తోంది.‌

తెర‌చిన పుస్త‌కం‌లాంటి ప్రము‌ఖుల జీవి‌తాలు ‌‘తెర’‌కెక్కు‌తుంటే.‌.‌.‌మనకు తెలి‌సిన మహా‌మ‌హుల గురించి మనకు తెలీని మరి‌కొన్ని కోణాలు బహి‌ర్గ‌త‌మ‌వు‌తా‌యని కళ్లిం‌తలు చేసు‌కునే ప్రేక్ష‌కుల ఆసక్తే ఈ తరహా సిని‌మా‌లకు విజ‌యాల సిరి.‌ అందుకే.‌.‌.‌ కమ‌ర్షి‌యల్‌ ఫార్ము‌లా‌లకి కట్టు‌బడి, ఇంట‌ర్వెల్‌ ముందు మూడు, ఆ తర్వాత మూడు పాటల్తో పాటు గుప్పడు ఫైట్లు, చిటి‌కెడు కామెడీ మిక్స్‌ చేసిన మాస్‌ మసాలా సినీ ప్రొడ‌క్ట్‌ల మధ్యలో అడ‌పా‌ ద‌డపా ఝల‌కిస్తూ ముహూర్తం షాట్‌ ముందు నుంచే ఎక్క‌డ‌లేని సంచ‌ల‌నాల్ని మూట ‌గ‌ట్టు‌కుం‌టున్న చిత్రా‌లివి.‌

బయో‌పిక్స్‌.‌.‌.‌అంటూ సింపు‌ల్‌గా నాలు‌గక్ష‌రా‌లకు కుదిం‌చిన ఈ తరహా సిని‌మాలు ప్రము‌ఖుల జీవి‌తా‌లకి అసలు సిస‌లైన తెర అను‌వా‌దాలు.‌ సమా‌జంలో లబ్ద‌ప్రతి‌ష్టు‌లైన ఓ ప్రము‌ఖుడి జీవి‌తాన్ని తెర‌కె‌క్కి‌స్తు‌న్నా‌మన్న ప్రక‌టన వెలు‌వ‌డ‌గానే ఇటు పరి‌శ్రమతో పాటు, అటు మీడియా కూడా ఎల‌ర్ట‌యి‌పో‌తుంది.‌ సినిమా రూప‌క‌ల్ప‌నకు ముందే ఆ ప్రము‌ఖుడి గురించి చిలు‌వలు, పలు‌వలు చేసే కథ‌నాలు, చర్చల్తో ‌‘ఇన్‌స్టెంట్‌ పబ్లి‌సిటీ’‌ని కొల్ల‌గొ‌డ్తుంది.‌ ఆ ప్రము‌ఖుడి కుటుంబ సభ్యులు, అభి‌మా‌నుల వ్యతి‌రే‌కత కూడా ప్రచా‌ర‌వ్యూ‌హాన్ని మరింత పదు‌నె‌క్కి‌స్తుం‌దంటే ఏమాత్రం అతి‌శ‌యోక్తి కాదేమో? ‌‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’‌ కాలం నుంచే బయో‌పి‌క్‌ల సందడి మొదలై కొంత‌కాలం సద్దు‌మ‌ణి‌గి‌న‌ట్ట‌ని‌పిం‌చినా.‌.‌ .‌ఇటీ‌వల మళ్లీ జోరం‌దు‌కు‌న్నాయి.‌ అటు బాలీ‌వు‌డ్‌లోనూ, ఇటు టాలీ‌వు‌డ్‌లోనూ బయో‌పి‌క్‌ల‌పట్ల ఆసక్తి, అను‌రక్తి అంత‌కం‌తకూ పెరు‌గుతూ వస్తోంది.‌

‌‘ది యాక్సి‌డెం‌టల్‌ ప్రైమ్‌ మిని‌స్టర్‌’‌
ప్రస్తుతం బాలీ‌వు‌డ్‌లో కుతూ‌హలం రేకె‌త్తి‌స్తున్న బయో‌పిక్‌ ‌‘ది యాక్సి‌డెం‌టల్‌ ప్రైమ్‌ మిని‌స్టర్‌’‌.‌ ఆ ప్రధాని ఎవరో ఇట్టే అంచనా వేసేం‌దుకు వీలుగా చిత్రబృందం ఈ పేరును ఖరారు చేసి ఉంటుం‌దనే అభి‌ప్రాయం ప్రచా‌రం‌లోకి వచ్చింది.‌ ఇంతకీ.‌.‌.‌ఆ ‌‘యాక్సి‌డెం‌టల్‌ ప్రైమ్‌ మిని‌స్టర్‌’‌ యూపిఎ వన్, టూ కేంద్ర ప్రభు‌త్వా‌లలో మాటే‌రాని మౌన రుషిగా పేరొం‌దిన మన్మో‌హన్‌ సింగ్‌.‌ మన్మో‌హన్‌ సింగ్‌ జీవి‌త‌కథ ఆధా‌రంగా రూపొం‌దు‌తున్న ఈ సిని‌మాను ఈ ఏడాది డిసెం‌బ‌ర్‌లో విడు‌దల చేయా‌లనే సంక‌ల్పంతో చిత్ర యూనిట్‌ ఉందని బోగట్టా.‌ ప్రముఖ రాజ‌కీయ విశ్లే‌ష‌కుడు సంజయ్‌ బారూ రచిం‌చిన పుస్తకం ఆధా‌రంగా ఈ చిత్రం నిర్మి‌త‌మ‌వు‌తోంది.‌

మన్మో‌హన్‌ సింగ్‌ పాత్రని తెరపై ఆవి‌ష్క‌రి‌స్తు‌న్నది అను‌పమ్‌ ఖేర్‌.‌ మన్మో‌హన్‌ సింగ్‌ చుట్టూ తిరిగే కథాంశం అప్పటి రాజ‌కీ‌యాల్ని అని‌వా‌ర్యంగా స్ప¬ృశిం‌చిక తప్పదు.‌ కాబట్టి, ఆనాటి రాజ‌కీ‌యాల్ని అంతా తానై నడి‌పిం‌చిన సోనియా గాంధీ పాత్ర కూడా సిని‌మాలో కీల‌కమే.‌ సోని‌యా‌గాం‌ధీగా జర్మన్‌ నటి సుజైన్‌ బర్నీట్‌ నటి‌స్తుం‌డగా, రాహుల్‌ గాంధీ పాత్రలో అర్జున్‌ మధుర్‌ అనే నటుడు కని‌పిం‌చ‌ను‌న్నాడు.‌ మన్మో‌హన్‌ జీవిత చరి‌త్రను పుస్త‌కంగా రచిం‌చిన రాజ‌కీయ విశ్లే‌ష‌కుడు సంజయ్‌ బారూ పాత్రని కూడా సిని‌మాలో రూపొం‌దిం‌చారు.‌ ఆ పాత్రలో బాలీ‌వుడ్‌ ప్రముఖ నటుడు అక్ష‌య్‌ఖన్నా కని‌పి‌స్తు‌న్నారు.‌

article image
అతి‌లోక సుంద‌రిపై డాక్యు‌మెం‌టరీ
చిత్రసీ‌మలో ‌‘అతి‌లో‌క‌సుం‌దరి’‌గా విఖ్యా‌తి‌గాంచి అనూ‌హ్యంగా అసు‌వులు బాసిన అందాల శ్రీదే‌విపై డాక్యు‌మెం‌టరీ నిర్మిం‌చేం‌దుకు ఆమె భర్త బోనీ‌క‌పూర్‌ నిర్ణయం తీసు‌కు‌న్నా‌డని బాలీ‌వుడ్‌ బోగట్టా.‌ శ్రీదేవి బాలీ‌వు‌డ్‌కి వెళ్లిన తొలి‌నా‌ళ్లలో ఆమె నటిం‌చిన ‌‘మిస్టర్‌ ఇండియా’‌ సిని‌మాకు దర్శ‌కత్వం వహిం‌చిన శేఖ‌ర్‌క‌పూర్‌ ఈ డాక్యు‌మెం‌ట‌రీకి దర్శ‌కత్వం వహి‌స్తా‌డంటూ వార్తా కథనం.‌ ‌‘మీ అంద‌రికీ శ్రీదేవి చాందిని.‌.‌.‌ నాకు మాత్రం సర్వం’‌ అంటూ శ్రీదేవి హఠాత్‌ మర‌ణంపై స్పందిం‌చిన బోనీ‌క‌పూర్‌ ఈ డాక్యు‌మెం‌ట‌రీతో ఆమెకి నివాళి ఘటిం‌చ‌ను‌న్నా‌రని సమా‌చారం.‌

article image
‌‘ఎన్‌.‌టి.‌ఆర్‌’‌ బయో‌పిక్‌
ఎన్‌.‌టి.‌ఆర్‌.‌.‌.‌ ఈ మూడక్ష‌రాల పేరు ఇప్ప‌టికీ సంచ‌ల‌నా‌లకు మారు‌పేరు.‌ సక‌ల‌క‌ళ‌లకు సమా‌హా‌ర‌మైన చిత్ర జగ‌త్తు‌లోనూ, సర్వ కుయు‌క్తు‌లకు అల‌వా‌ల‌మైన ఎత్తు‌జి‌త్తుల రాజ‌కీయ రంగం‌లోనూ ఆ మూడక్ష‌రాలు లిఖిం‌చిన చరిత్ర అను‌ప‌మానం.‌.‌.‌ ఎప్ప‌టికీ చిర‌స్మ‌ర‌ణీయం.‌ ఆ పేరు తెలు‌గు‌వారి గుండె‌చ‌ప్పు‌డుగా అవ‌త‌రించి కొన్ని దశా‌బ్దా‌లైంది.‌ ఆయనో తెర‌చిన పుస్తకం.‌ ఎన్టీ‌ఆర్‌ గురించి ఇంకా తెలు‌సు‌కో‌వా‌ల్సింది ఏముంది? ఆయన నటిం‌చిన శతా‌ధిక చిత్రాల్ని ఇప్ప‌టికీ చూస్తూ ఆరా‌ధి‌స్తున్న అశేష ప్రేక్ష‌కు‌లకు అరు‌దైన కాను‌కగా ఆయన బయో‌పి‌క్‌ని రూపొం‌దిం‌చేం‌దుకు ఆయన తన‌యుడు బాల‌కృష్ణ నడుం బిగిం‌చారు.‌ ఎన్టీ‌ఆర్‌ బాట‌లోనే నడిచి.‌.‌.‌ ఆయ‌న‌లాగే ఎన్నో వైవి‌ధ్య‌మైన పాత్రల్ని పోషించి చిత్రసీ‌మలో తన‌కంటూ గుర్తిం‌పును తెచ్చు‌కున్న బాల‌కృష్ణ ఈ చిత్రంలో తండ్రి ప్రాతని ఆవి‌ష్క‌రిం‌చ‌ను‌న్నాడు.‌

‌‘ఎ ట్రిబ్యూట్‌ టు ది లెజెండ్‌ హూ లివ్‌డ్‌ ఫర్‌ ది పీపుల్‌ అండ్‌ చూజెన్‌ ది పీపుల్‌’‌ కాప్ష‌న్‌తో ఫస్ట్‌ పోస్ట‌ర్‌ను సినీ విశ్లే‌ష‌కుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేస్తే.‌.‌.‌ సోషల్‌ మీడి‌యాలో చక్కర్లు కొట్టింది.‌ తేజ దర్శ‌కత్వం వహి‌స్తున్న ఈ చిత్రాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ, విష్ణు‌వ‌ర్ధన్‌ ఇందూరి, సాయి కొర్రపాటి సంయు‌క్తంగా రూపొం‌ది‌స్తు‌న్నారు.‌ కిక్కి‌రి‌సిన జనం మధ్యలో ఆగిన వాహ‌నంపై నిల్చున్న ఎన్టీ‌ఆర్‌ని ఈ పోస్ట‌ర్‌లో చూడొచ్చు.‌ చిత్రరం‌గం‌లోని విజ‌యా‌ల‌తో‌పాటు ‌‘హైఓ‌ల్టేజ్‌ పొలి‌టి‌కల్‌ డ్రామా’‌గా కూడా ఎన్టీ‌ఆర్‌ చిత్రాన్ని రూపొం‌దించ‌స్తు‌న్నట్లు తెలు‌స్తోంది.‌ బాల‌కృష్ణ ఎన్టీ‌ఆర్‌ చిత్రాన్ని ప్రక‌టిం‌చిన తర్వాత దర్శ‌కుడు రామ్‌గో‌పా‌ల్‌వర్మ ‌‘లక్ష్మీస్‌ ఎన్టీ‌ఆర్‌’‌ చిత్రాన్ని రూపొం‌ది‌చ‌ను‌న్నట్లు వెలు‌వ‌డిన ప్రక‌టన ప్రకం‌ప‌నలు సృష్టిం‌చడం, ఆ వెన్వెం‌టనే.‌.‌.‌ ‌‘లక్మీస్‌ వీర‌గ్రంధం’‌ పేరుతో మరో చిత్రం ప్రక‌టన వేడి‌వేడి చర్చ‌లకు కార‌ణ‌మైంది.‌

సావిత్రి జీవిత కథ ‌‘మహా‌నటి’‌
అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ తెలుగు తెర గుండె‌చ‌ప్పుడు అల‌నాటి సావిత్రి.‌ ఢిల్లీ, ముంబై నుంచి దిగు‌మతి అవు‌తున్న నేటి తరం తారలు సైతం తెలుగు సిని‌మాలు చేస్తున్న సంద‌ర్భంలో సావిత్రి పేరు తల‌చు‌కో‌కుండా ఉండరు.‌ వర్త‌మాన తార‌లకు సావిత్రి చిత్రాలు అభి‌నయ వ్యాక‌ర‌ణాలు.‌ కథా‌ను‌గు‌ణంగా తెరపై పండించే భావో‌ద్వే‌గా‌లకు సంబం‌ధించి ఆమె నటన తమ‌లాంటి వాళ్లకి స్ఫూర్తి.‌ అంటుం‌టారు ఇప్పటి తారలు.‌ అలా వెండి‌తె‌రపై చెర‌గని సంతకం చేసిన సావిత్రి జీవిత కథ ఆధా‌రంగా ‌‘మహా‌నటి’‌ సినిమా తెర‌కె‌క్క‌బో‌తోంది.‌ కేవలం తెలు‌గు‌లోనే కాకుండా తమిళ, మల‌యాళం, హిందీ భాషల్లో కూడా ఈ ‌‘మహా‌నటి’‌ సిని‌మాను విడు‌దల చేసేం‌దుకు చిత్ర నిర్మా‌తలు సన్నా‌హాలు చేస్తు‌న్నారు.‌ నాగ్‌ అశ్విన్‌ దర్శ‌కత్వం వహి‌స్తున్న ఈ చిత్రంలో ‌‘మహా‌నటి’‌ టైటిల్‌ పాత్రను కీర్తి సురేష్‌ పోషి‌స్తు‌న్నారు.‌

సిల్క్‌‌స్మిత బయో‌పిక్‌ ‌‘డర్టీ పిక్చర్‌’‌
ఒక‌ప్పుడు కథా‌నా‌య‌కు‌లతో సరి‌స‌మా‌న‌మైన ప్రేక్ష‌కా‌ద‌ర‌ణతో పాటు విడు‌దల కాబో‌తున్న కొత్త సిని‌మాలో ‌‘సిల్క్‌‌స్మిత’‌ ఉందో‌లేదో ఆరా‌తీసే డిస్ట్రి‌బ్యూ‌టర్ల హడా‌వు‌డితో తన‌దైన మార్కె‌ట్‌ని సొంతం చేసు‌కున్న సిల్క్‌‌స్మిత జీవితం ఆధా‌రంగా బాలీ‌వు‌డ్‌లో ‌‘డర్టీ‌పి‌క్చర్‌’‌ తీశారు.‌ ఈ సినిమా నిర్మాణ ప్రక‌టన వెలు‌వ‌డిన దగ్గ‌ర్నుంచీ వివా‌దాలు, సంచ‌ల‌నాలు చుట్టు‌ము‌ట్టాయి.‌ సిల్క్‌‌స్మి‌తగా విద్యా‌బా‌లన్‌ నటి‌స్తోం‌దనే వార్త కూడా అప్పట్లో ఆశ్చ‌ర్యాన్ని కలి‌గిం‌చింది.‌ 2011లో తెర‌కె‌క్కిన ఈ సినిమా కథా‌నా‌యిక ప్రాధా‌న్యత గల చిత్రా‌లకూ మంచి గిరాకీ ఉందని నిరూ‌పిస్తూ వంద‌కోట్లు రాబ‌ట్టిన చిత్రంగా సరి‌కొత్త చరిత్ర లిఖిం‌చింది.‌

article image
ఎంఎస్‌ థోని −‌ ది అన్‌టోల్డ్‌ స్టోరీ
టీమిం‌డియా మాజీ కెప్టెన్‌ మహేం‌ద్రసింగ్‌ థోనీపై రూపొం‌దిన బయో‌పిక్‌ ‌‘ఎంఎస్‌థోని−‌ది అన్‌టోల్డ్‌ స్టోరీ’‌ పేరిట నిర్మి‌త‌మైన సినిమా కూడా మంచి క్రేజుని సంపా‌దిం‌చు‌కుంది.‌ బాలీ‌వుడ్‌ హీరో సుషాంత్‌ సింగ్, దిశా‌ప‌టాని, కైరా అద్వానీ నటిం‌చిన ఈ చిత్రా‌నికి నీర‌జ్‌పాండే దర్శ‌కత్వం వహిం‌చారు.‌ 28 ఏళ్ల తర్వాత ఇండి‌యాకి క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సాధించి పెట్టిన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎది‌గాడో ఈ చిత్రం స్ఫూర్తి‌వం‌తంగా చెప్పింది.‌

సచిన్‌−‌ఎ బిలి‌యన్‌ డ్రీమ్స్‌
క్రికె‌ట్‌ని గుండెల్లో పెట్టు‌కుని ఆరా‌ధించే భార‌త్‌లోని క్రీడా‌భి‌మా‌ను‌లం‌ద‌రికీ సచిన్‌ దేవుడు.‌ 17 సంవ‌త్స‌రాల వయ‌సు‌లోనే ఇంట‌ర్నే‌ష‌నల్‌ వన్డేలో అడు‌గు‌పె‌ట్టిన సచిన్‌ అన‌తి‌కా‌లం‌లోనే సాధిం‌చిన విజ‌యాలు అన‌న్య‌సా‌మాన్యం.‌ తన జీవి‌త‌గా‌థను సిని‌మాగా తీస్తే.‌.‌.‌.‌ ఆ సిని‌మాలో తనే నటిం‌చడం సచి‌న్‌కి దక్కిన అరు‌దైన గౌరవం.‌ ఈ సిని‌మాలో సచి‌న్‌తో‌పాటు మహేం‌ద్రసింగ్‌ థోని, వీరేం‌ద్రసె‌హ్వా‌గ్‌లు కూడా నటించి మెప్పిం‌చారు.‌ కాగా, ఇటీ‌వలే సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపే‌సిన చిత్రం ‌‘దంగల్‌’‌.‌ రెజ్లర్‌ క్రీడా‌కా‌రి‌ణులు గీతా ఫోగాట్, బబి‌తా‌కు‌మా‌ర్‌ల జీవి‌తాల ఆధా‌రంగా తీసిన చిత్రం ఇది.‌ తన ఇద్దరు కూతుళ్లు రెజ్ల‌ర్లుగా ఎది‌గేం‌దుకు ఆ తండ్రి పడ్డ తపనే ఈ చిత్ర కథ.‌

ఎవ‌రెస్ట్‌ విజేత పూర్ణ విజ‌య‌గాథ
అతి చిన్న వయ‌సు‌లోనే ఎవ‌రెస్ట్‌ ఎక్కి చరిత్ర సృష్టిం‌చిన తెలం‌గా‌ణాకు చెందిన గిరి‌జన విద్యా‌ర్ధిని మలా‌వత్‌ పూర్ణ జీవి‌తాన్ని ఆధా‌రంగా తీసు‌కుని తీసిన చిత్రం ‌‘పూర్ణ’‌.‌ ఈ చిత్రా‌నికి దర్శ‌కత్వం వహిం‌చింది రాహుల్‌.‌ సాంఘిక సంక్షేమ హాస్ట‌ల్‌లో ఉంటూ చదు‌వు‌కుం‌టున్న పూర్ణ హిమా‌ల‌య‌ప‌ర్వ‌తా‌రో‌హ‌ణలో సాధిం‌చిన విజయం స్పూర్తి‌దా‌య‌క‌మంటూ ఈ చిత్రం వివ‌రి‌ంచింది.‌

బయో‌పి‌క్స్‌లో వర్మ ఒర‌వడి
అనూ‌హ్యంగా జరిగే సంచ‌లన సంఘ‌ట‌నల చుట్టూ తన‌దైన శైలితో కాస్త కల్పన అద్ది సిని‌మాలు తీయ‌డంలో దర్శ‌కుడు రామ్‌గో‌పాల్‌ వర్మ స్టయిలే వేరు.‌ గంధపు చెక్కల స్మగ్ల‌ర్‌గా ప్రసిద్ధి చెందిన వీర‌ప్పన్‌ రియల్‌ స్టోరీ ఆధా‌రంగా ‌‘కిల్లింగ్‌ వీర‌ప్పన్‌’‌ తీసిన ఆర్జీవి.‌.‌.‌ ‌‘వంగ‌వీటి రంగా’‌ జీవితం ఆధా‌రంగా ‌‘వంగ‌వీటి’‌ సిని‌మాలు తీసారు.‌ అల‌నాటి అందాల తార శ్రీదేవి మర‌ణిం‌చ‌గానే ఆమె జీవి‌తాన్ని ఆధా‌రంగా వర్మ ఓ చిత్రాన్ని రూపొం‌ది‌స్తా‌రన్న వార్తలు కూడా హల్చల్‌ చేసినా.‌.‌.‌ వెంటనే ఆయన వాటిని ఖండిం‌చారు.‌ ఎన్ని చిత్రాలు రూపొం‌దు‌తున్నా బయో‌పి‌క్‌ల‌కున్న ప్రత్యే‌కత వేరని ప్రత్యే‌కించి చెప్ప‌క్క‌ర్లేదు.‌ అందుకే ఈ చిత్రా‌లకు అంత ఆద‌రణ.‌

−‌ పి.‌వి.‌డి.‌ఎస్‌.‌ప్రకాష్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.