చూసిన కొద్దీ చూడ‘ముద్దే’స్తోంది!

ముద్దు అనగానే.. వద్దు అనేవాళ్లు మన తారలు. ప్రేక్షకులను ఆ సన్నివేశాలు చూసేంతగా ఎదగలేదనే అభిప్రాయం వ్యక్తమయ్యేది. అందుకే ఆ సన్నివేశాలు కేవలం ఇంగ్లీషు చిత్రాల్లోనే కనిపించేవి. ఇప్పుడు కాలం మారింది. మన సినిమాలూ ముద్దు సన్నివేశాల్ని డిమాండ్‌ చేస్తున్నాయి. ఒకానొక దశలో ముద్దులు కాస్త హద్దులు కూడా దాటేస్తున్నాయి. ఒకప్పుడు ‘ముద్దు’ మాత్రమే. ఆ తరువాత ‘ముద్దులు’ అయ్యాయి. ఇప్పుడు ఒక ‘నిమిషం ముద్దు’ ఐదు నిమిషాల ముద్దు అని మాట్లాడుకొంటున్నారు. తారలు చుంబన సన్నివేశాల్లో నటించడం తెలుగులో ఇప్పుడిప్పుడే మొదలైంది. హిందీ తారలు మాత్రం దశాబ్దాల కింద నుంచే తెరపై ముద్దులొలుకుతున్నారు. ఆ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘శుద్ద్‌ దేశీ రొమాన్స్‌’, ‘గోలియోన్‌కీ రాస్‌ లీల రామ్‌ లీల’ చిత్రాలకి ముద్దులే ప్రత్యేక ఆకర్షణ. అవే ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించాయి. హిందీలో ఎన్ని చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే కొన్ని ముద్దు సన్నివేశాలున్నాయి. వాటిని ఓసారి గర్తు తెచ్చుకొందాం..


* తొలి సంచలనం:
1988 రోజులవి. హిందీ తెర అప్పుడప్పుడే ముద్దులకు అలవాటు పడుతోంది. ఆ సమయంలోనే ‘దయావన్‌’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులో వినోద్‌ఖన్నా, మాధురి దీక్షిత్‌ మధ్య చుంబున సన్నివేశం సంచలనాన్ని సృష్టించింది. అప్పటికదే సుదీర్ఘమైన ముద్దు సన్నివేశం. దీంతో హిందీ ప్రేక్షకులే కాదు, యావత్‌ చిత్రసీమ వర్గాలు కూడా ఆ ముద్దు సన్నివేశం గురించి ప్రత్యేకంగా చర్చించుకొన్నాయి.
...............................................................................................................................................

* కెమిస్ట్రీ ముద్దు:
నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ కుదిరిందా లేదా? అంటూ ఇప్పుడు తెగ మాట్లాడుకొంటున్నాం. అసలు కెమిస్ట్రీ అంటే ఏమిటో, అదెలా కుదురుతుందో చూపించిన సన్నివేశం ‘రాజా హిందుస్థానీ’లో చూడొచ్చు. అందులో ఆమీర్‌ఖాన్‌ - కరిష్మా కపూర్‌ల మధ్య ఓ చుంబన దృశ్యం ఉంది. అది సెక్సీయెస్ట్‌ కిస్‌గా బాలీవుడ్‌ రికార్డులకెక్కింది. ఆమీర్, కరిష్మా ముద్దు సన్నివేశాల్లో లీనమై నటించారు. నవతరం తారలకు ఆ సన్నివేశాలు ఆదర్శం అని చెప్పొచ్చు.
...................................................................................................................................................

* లేక్కే లేదు:

ఇమ్రాన్‌ హస్మీని సీరియల్‌ కిస్సర్‌ అని పిలుస్తుంటారు. ఆ పేరు రావడానికి కారణం ‘మర్డర్‌’. ఆ చిత్రంలో మల్లికా శెరావత్‌తో కలిసి లెక్కలేనన్ని ముద్దు సన్నివేశాల్లో నటించాడు ఇమ్రాన్‌ హస్మీ. ముఖ్యంగా ‘భీగే హాంట్‌ తేరే’ పాటలో ఇమ్రాన్‌ హస్మీ..మల్లికా శెరావత్‌ పెదాల్ని వదిలి కనిపించనట్టు అస్సలు అనిపించదు. మల్లికకి హిందీలో సెక్సీయెస్ట్‌ నటిగా పేరు తెచ్చిపెట్టిన చిత్రమిదే.
.................................................................................................................................................

* కొత్తరకం ముద్దు:
కుర్రకారు హృదయాల్లో సెగలు పుట్టించిన ముద్దుని ‘ధూమ్‌2’లో చూడొచ్చు. హృతిక్‌ రోషన్‌ - ఐశ్వర్యరాయ్‌ మధ్య ఓ సందర్భంలో వచ్చే ఆ ముద్దు సన్నివేశం బాలీవుడ్‌కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అది ఫ్రెంచ్‌ కిస్‌ అంటూ మీడియా ప్రచారం చేసింది. ఆ ముద్దు సన్నివేశం బాలీవుడ్‌లో వివాదం కూడా రేపింది. అప్పటికే ఐశ్వర్య, అభిషేక్‌లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం, అయినప్పటికీ ఆ ముద్దు సన్నివేశాల్లో ఐశ్వర్య నటించడం అప్పట్లో దుమారం రేపింది.
......................................................................................................................................................

* ప్రేమతో పెట్టింది:
ప్రేమలో ఉన్న ఓ జంట ముద్దు సన్నివేశాల్లో నటిస్తే ఎలా ఉంటుంది? ఎలా పండుతుంది? ఈ ప్రశ్నలకు జవాబు ‘జబ్‌ వుయ్‌ మెట్‌’లో షాహిద్‌ కపూర్, కరీనా కపూర్‌ జంటని చూశాక స్పష్టంగా తెలుస్తుంది. అప్పటికే ప్రేమలో పడ్డ ఈ జంట దర్శకుడు అడిగిందే ఆలస్యంగా ముద్దు సన్నివేశాల్లో నటించారు. ఇద్దరూ ఆ సన్నివేశాల్లో నటించారు. ఇద్దరూ ఆ సన్నివేశాల్లో ఒదిగిపోయి నటించారని బాలీవుడ్‌ వర్గాలు విశ్లేషించాయి.
......................................................................................................................................................

* పేద్ద ముద్దు!

అప్పటికే ఇమ్రాన్‌ హస్మీ తెరపై చాలా ముద్దులు పెట్టుకొన్నాడు. మళ్లీ ఆయన్ని ముద్దు సన్నివేశంలో చూపించాలి. పక్కన నల్లకలువ బిపాస బసు కూడా ఉంది. మరి ఆ ముద్దు ఎలా ఉండాలి? కాస్తైనా ప్రత్యేకంగా ఉండాలి కదా? అందుకు సుదీర్ఘమైన ముద్దుని ప్లాన్‌ చేశారు ‘రాజ్‌3’లాంటి హార్రర్‌ చిత్రంలో కనిపించిన ఆ ముద్దు సన్నివేశం కుర్రాళ్ల మనసుల్లో వేడి పుట్టించింది.
....................................................................................................................................................

* రన్వీర్‌ - దిపికాల ముద్దు:
రన్వీర్‌సింగ్‌ - దీపికా పదుకొణెల మధ్య ముద్దు సన్నివేశం కుర్రకారు మతిపోగొట్టేలా చేసింది ‘గోలియోన్‌ కా రాస్‌ లీల రామ్‌లీల’ చిత్రంలో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొంటూ చుంబించుకొనే సన్నివేశాలు ప్రేక్షకుల్ని థియేటర్‌కి వెళ్లేలా చేశాయి. ఇద్దరూ అప్పటికే డేటింగ్‌లో ఉండటంతోనే ఆ సన్నివేశాలు అంత బాగా పండాయని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. హిందీ తెరను శృంగార భరితం చేసిన ఇలాంటి ముద్దు సన్నివేశాలే ప్రాంతీయ చిత్ర పరిశ్రమలకు ఇప్పుడు స్ఫూర్తిగా నిలిచాయి. అందుకే తెలుగు, తమిళం అనే తేడా లేకుండా అన్ని చోట్లా చుంబన సన్నివేశాలు ఆవిష్కృతమవుతున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.