ఈ చిత్రాలు ఓటీటీల్లో విడుదల అవ్వక తప్పదా!

ఈ ఏడాది  వేసవిలో కనువిందు చేయాలని  ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకుంది బాలీవుడ్‌ చిత్రసీమ. మొదటి రెండు నెలలు అంతాబాగానే సాఫీగా సాగిపోయింది. అంతలో కరోనా మహమ్మారితో ఇటు షూటింగ్‌లతో పాటు అటు థియేటర్లో ఆడే చిత్రాలతో సహా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పటికే విడుదలైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకెళ్లాలనే ఆలోచన మొదలైంది. నెలలు వారాలు గడుస్తున్నాయి. ఇంతలోనే కొన్ని చిత్రాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల తలుపుతట్టాయి. దీంతో చిత్రసీమకు కొత్తదారి తెరుచుకున్నట్లైయింది. లాక్‌డౌన్‌ కాలంలోనూ ప్రేక్షకుల్ని చేరుకోవాలంటే ఒకటే మార్గం అదే ఓటీటీ. ప్రస్తుతం దేశంలోని చాలా చిత్రాలు ఇప్పుడు ఈ వేదికపైనే విడుదల అయ్యాయి, అవుతున్నాయి. తాజాగా ఈ కోవలోకి కొన్ని చిత్రాలు చేరాయి. వాటిలో అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘లక్ష్మీబాంబ్‌’, అలీయా భట్‌ ‘సడక్‌2’, అజయ్‌దేవగన్‌ ‘భుజ్‌:ది ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ డిస్నీ+ హాట్‌ స్టార్‌లో విడుదల అయ్యేందుకు సిద్ధమయ్యాయి. అయితే కొన్ని చిత్రాలు మాత్రమే ఇలా విడుదలయ్యేందకు సిద్ధమవ్వగా, పెద్ద సినిమాలు ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాయి.  సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న ‘రాధే: యువర్‌ మోస్ట్ వాంటెడ్‌ భాయి’, అక్షయ్‌ కుమార్‌ ‘సూర్యవన్షి’, వరుణ్‌ధావన్‌ - సారా అలీఖాన్‌ నటించిన ‘కూలీ నెం.1’ చిత్రాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. వీటిలో  ఇంకా కొంత భాగం షూటింగ్‌ కూడా జరిగాల్సి ఉంది.

ఇక వెబ్‌సీరీస్‌లో వస్తున్న అభిషేక్‌బచ్చన్‌, నిత్యమీనన్‌ కలిసి నటిస్తున్న ‘బ్రీత్‌..ఇన్‌ టు షాడోస్’‌ అమెజాన్‌ ప్రైమ్‌లో జులై 10న విడుదల కానుంది. ‘డర్టీపిక్చర్’‌ నటి విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘శకుంతలా దేవి’ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. నాటి అందాల నటి తనయ జాన్వీకపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైమాసేన్‌ నటించిన ‘ది లాస్ట్‌ హవర్’, కొంకనాసేన్‌ శర్మ, మోహిత్‌ రైనాలు కలిసి నటిస్తున్న ‘ముంబై డైరీస్‌ 26/11’ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానున్నాయి. ఇక అక్కినేని సమంత, మనోజ్‌బాజ్‌పేయిలు నటిస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’ కూడా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది.ఇప్పటికే కొన్ని ప్రస్తుతం డీస్నీ +హాట్‌ స్టార్‌ వేదికగా కొన్ని చిత్రాలు విడుదల అయ్యేందకు సిద్ధమయ్యాయి అవేంటో చూద్దాం.

‘భుజ్: ది ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’
అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం అంతా 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కుతుంది. ఇందులో అజయ్‌ స్వ్కాడన్‌ లీడర్‌ విజయ్ కర్నిక్ పాత్రలో నటిస్తున్నారు. అభిషేక్‌ దుధయా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర్ంలో సోనాక్షి సిన్హా, సంజయ్‌ దత్‌, ప్రణీతా సుభాష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


 ‘సడక్ 2’ 
మహేష్‌ భట్‌ దర్శకత్వంలో 1991లో వచ్చిన ‘సడక్’‌ చిత్రానికి ఇప్పుడు రీమేక్‌గా ‘సడక్‌ 2’గా తెరకెక్కుతోంది. అలియా భట్‌ కథానాయికగా, ఆదిత్యరాయ్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్నారు. ఈచిత్రంలో గుల్షన్‌ గ్రోవర్‌ మకరంద్‌ దేశ్‌పాండేలు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తొలిసారిగా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన అలియా తన తండ్రితో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి.


‘లక్ష్మి బాంబ్’
అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తమిళంలో వచ్చిన ‘ముని 2: కాంచన’ చిత్రానికి రీమేక్. ఆది నుంచి ఈ సినిమా, సల్మాన్ ఖాన్ యొక్క ‘రాధే - యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’తో పోటీ పడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు కొంచెం ముందుగానే ఓటీటీ రూపంలో విడుదల అవుతోంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ నాయకానాయికలుగా నటిస్తున్నారు.

‘దిల్ బెచారా’
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజన సంఘిలు నటించిన చిత్రం ‘దిల్‌ బెచారా’. ముఖేష్ ఛబ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. అన్నట్లు ఈ సినిమా హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. హాలీవుడ్‌లో వచ్చిన ‘ఇన్‌ అవర్‌ స్టార్స్’ చిత్రానికి ఇది రీమేక్‌. .సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన చివరి చిత్రం ఇది. ఈ సినిమా జూలై 24న డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

‘లూట్‌కేస్’
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ చెల్లెలి భర్త అయిన కునాల్ ఖేమ్‌ హీరోగా నటిస్తున్న ‘లూట్‌కేస్‌’ చిత్రానికి రాజేష్‌‌ కృష్ణన్‌ దర్శకత్వం వహిస్తుండగా, రసిక దుగ్గల్‌, గజరాజ్‌రావ్‌, రన్వీర్‌ శౌరి నటిస్తున్నారు. ప్రముఖ ఫాక్స్ స్టార్ స్టూడియోస్, సోడా ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ కంపెనీలు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.