రాననుకున్నారా.. రాలేననుకున్నారా..

‘రావాలని కోరుకున్న మనిషి వచ్చినపుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంటీ? రాననుకున్నారా? రాలేననుకున్నారా?’ ప్రముఖ నటుడు చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్‌ మర్చిపోగలమా లేదు కదా. ఇప్పటికే ఇది ఏ సినిమాలోదో గుర్తుపట్టేసుంటారు. అవును ఇది బి.గోపాల్‌, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇంద్ర’. ఈ చిత్రం ఇదే రోజు అంటే 24జులై 2002న విడుదలైంది. 17ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఈ సినిమా, ఇందులోని డైలాగులు ఓ సంచలనమే. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరియర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. ఇంద్రసేనా రెడ్డిగా,శంకర్‌ నారాయణగా ద్విపాత్రాభినయంతో చిరంజీవి అభిమానుల్ని అలరించారు. పరుచూరి సోదరుల మాటలు,మణిశర్మ సంగీతం ఈ సినిమాకు బలాన్నిచ్చాయి. దాయి దాయి దామ్మా పాటలో చిరు వేసిన స్టెప్పులు కుర్రకారుని థియేటర్లలో కూర్చోనివ్వకుండా చేసిందంటే అతిశయోక్తి కాదేమో. వైజంతీ మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించారు. వీరిద్దరి కలయికలో ఇది మూడో చిత్రం. యాక్షన్‌ సీన్స్‌ ఎంత అద్భుతంగా చిత్రీకరించారో కామెడీకి అంతే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సినిమాలో చిరు పక్కన సోనాలి బింద్రే,ఆర్తి అగర్వాల్‌ ఆడిపాడి అభిమానుల్ని ఆకట్టుకున్నారు.

‘ఇంద్ర’ సినిమాలోని పంచ్‌ డైలాగ్స్‌


*
వీర శంకర్‌ రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా
*సింహాసనంపై కూర్చొనే హక్కు అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనా రెడ్డిది
*కాశీకి వెళ్లాడు. కాషాయం వాడయ్యాడు అనుకున్నారా? వారణాసి వెళ్లాడు. తన వరస మార్చుకున్నాడు అనుకున్నారా? అదే రక్తం.. అదే పౌరుషం. సై అంటే సెకనుకొక తల తీసుకెళ్తా.
*షౌకత్‌ అలీ ఖాన్‌, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలవంచుకుని పోతున్నాను. అదే నీ వైపు ఉంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. మా వాడు ఫోన్‌ చేసే దాక వచ్చాడంటే మీ అమ్మాయి ఎక్కడిదాకా వచ్చిందో నేను అడగను. పెళ్లి కావాల్సిన పిల్లని పది మందిలోకి పిలిచి పంచాయతీ పెట్టకు, తన మనసు తెలుసుకుని నిఖా పక్కా చేసుకో! 

సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.