హీరో అంటే నటించడమే అనుకున్నారా?
కథానాయకుడు అంటే సినిమాలోని పాత్రకు తగ్గట్టు తనను తాను మలుచుకునేవాడు. ఊహాజనిత, నిజ జీవిత కథలను వెండి తెరపై ఆవిష్కరించేవాడు. ‘‘ హీరోలంటే డైలాగులు చెప్పి, డ్యాన్సులు వేసి, ఫైట్స్‌ చేసేవాళ్లు అనుకుంటున్నారా? సింగర్స్‌ కూడా’’ అంటున్నారు కథానాయకులు కబాలి స్టైల్లో. పాడిన పాటకు క్రేజ్‌తోపాటు ఆ సినిమాకే పేరు తెచ్చిపెడుతుంటారు. స్టార్‌ హీరో, యువ హీరో అనే తేడా లేకుండా టాలీవుడ్‌లో చాలా మంది తమ గాత్రంతోనూ మైమరపించారు. అక్కడితో ఆగిపోకుండా ఒకరు నటిస్తున్న సినిమాలోని పాటను మరొకరు పాడిన సందర్భాలున్నాయి. తెలుగు సినిమాల్లోని పాటను తమిళ హీరోలు పాడి ఓ ట్రెండ్‌ సెట్‌ చేశారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘నిను వీడని నీడను నేనే’ చిత్రంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. దీంతో గతంలో ఏ హీరో ఏ సినిమాలో ఏ పాట పాడాడో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇంకెందుకు ఆలస్యం ఇది చదివేయండి..


* చిరంజీవి: డాన్స్‌ బాగా చేసే హీరో పాట పాడగలడా అనుకున్న వారందరిని అవాక్కయ్యేలా చేశాడు. ‘మృగరాజు’ చిత్రంలోని ‘చాయ్‌ చమక్కులే చూడరా భాయ్‌’ అంటూ అభిమానుల్లో ఉత్తేజం నింపాడు.

* రవితేజ: ‘బలుపు’ చిత్రంలోని ‘కాజల్‌ చెల్లివా’ అంటూ సాగే పాటను పాడాడు.

* మహేశ్‌బాబు: ‘బిజినెస్‌మేన్‌’లోని డైలాగ్స్‌ రూపంలో ఉండే థీమ్‌ సాంగ్‌తో సింగర్‌గానూ నిరూపించుకున్నాడు.

*పవన్‌ కల్యాణ్: ‘అత్తారింటికి దారేది’లోని కాటమరాయుడా అంటూ, ‘అ‍‌‍ఆతవాసి’ చిత్రంలో కొడకా కోటేశ్వరరావుతో విశ్వరూపం చూపించాడు.

* జూనియర్‌ ఎన్టీఆర్‌: ‘కంత్రి’లోని ‘వన్‌ టూ త్రీ నేనో కంత్రి’, ‘రభస’లోని ‘రాకాసి రాకాసి’తో తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశాడు.

* మంచు మనోజ్‌: ‘పోటుగాడు’ చిత్రంలోని ‘ప్యార్‌మే పడిపోయాû’ే, ‘కరెంటు తీగ’ చిత్రంలోని ‘పోతే పోనీ పోరా’ అనే పాటలు పాడాడు.

*వెంకటేశ్‌: ‘గురు’ సినిమాలోని జింగిడి జింగిడి పాటతో ఆకట్టుకున్నాడు.

*విజయ్‌ దేవరకొండ: ‘గీతగోవిందం’లోని వాట్‌ వాట్‌ ది హెల్‌ పాటతో మెప్పించారు.

* సిద్దార్ధ్‌: ఎక్కువ పాటలు పాడిన హీరోగా సిద్దార్ధ్‌ను చెప్పుకోవచ్చు. ‘చుక్కల్లో చంద్రుడు’లో ‘నాలానే నేనుంటాను’ అనే పాట, ‘బొమ్మరిల్లు’లోని ‘అపుడో ఇపుడో’, ‘లవ్‌ ఫెయిల్యూర్‌’లోని ‘పార్వతి పార్వతి’ అనే పాటలతో అలరించాడు.‘ఆట’, ‘ఓయ్‌’, ‘ఓయ్‌ మై ఫ్రెండ్‌’, ‘ఎన్‌హెచ్‌4’ చిత్రాల్లోనూ పాడి సింగర్స్‌కి పోటీనిచ్చాడు.
- వీరంతా తాము నటించిన చిత్రాల్లోని పాటలను పాడిన వారు. తెలుగు సినిమాల్లోని పాటలను పాడిన తమిళ హీరోలను చూసేద్దాం..

* శింభు: జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకునిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘బాద్‌షా’. ఈ చిత్రంలోని ‘డైమండ్‌ గర్ల్‌’ పాట పాడి యువతకు కిక్‌ ఎక్కించాడు.

* సిద్దార్ధ్‌: సందీష్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘నిను వీడని నీడను నేనే’ సినిమాలోని ‘ఎక్స్‌క్యూజ్‌ మీ రాకాసి..% అనే పాటను పాడాడు. ఇటీవలే ఈ పాట ప్రోమోను చిత్ర
బృందం విడుదల చేసింది. ఇందులో కొన్ని పల్లవి మాత్రమే వినిపించారు. ఇప్పటికే మంచి ఆదరణ పొందిందీ ఈ పాట.

 ఇలాంటి కాంబినేషన్‌తో సినిమాలపై ఆసక్తి పెంచుతున్నారు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.