ప్రచారం.. పండగ చేసుకుంది!
సినిమా విడు‌దల దగ్గర పడు‌తు‌న్న‌కొద్దీ ప్రచారం పదు‌నె‌క్కు‌తుంది. ‌ రక‌ర‌కాల మాధ్య‌మాల్లో చిత్రబృం‌దాలు వ్యూహా‌త్మ‌కంగా ప్రచారం చేస్తుం‌టాయి.‌ సినిమా ఎలా తీశా‌మనే దాని‌కంటే, తీసిన సిని‌మాని ఏ స్థాయిలో ప్రేక్ష‌కు‌ల్లోకి తీసు‌కె‌ళ్లా‌మ‌న్నదే ముఖ్య‌మని భావిస్తూ ప్రచార కాండని కొన‌సా‌గి‌స్తుం‌టాయి.‌ మధ్యలో పండ‌గలు, పర్వ‌ది‌నాలు వచ్చా‌యంటే ఇక ఆ రోజుల్ని ప్రత్యే‌కంగా టార్గెట్‌ చేస్తుం‌టాయి చిత్రబృం‌దాలు.‌ తెలుగు సంవ‌త్స‌రా‌ది‌నైతే తెలుగు చిత్రసీమ కళ‌క‌ళ‌లా‌డింది.‌ సామా‌జిక మాధ్య‌మాల్లో తెలుగు సినిమా సందడి ప్రత్యే‌కంగా కని‌పిం‌చింది.‌

వేస‌విని లక్ష్యంగా చేసు‌కొని చిత్రాలు పెద్ద‌యె‌త్తున విడు‌దల కాబో‌తు‌న్నాయి.‌ ఆ మేరకు ఇప్ప‌టికే ఎవ‌రికి వారు ప్రచారం హోరె‌త్తి‌స్తు‌న్నారు.‌ ఈ దశలో పండ‌గంటే ఇక వ్యవ‌హారం మామూ‌లుగా ఉంటుందా? కొత్త లుక్కు‌ల‌తోనూ, కొత్త టీజర్లు, ట్రైల‌ర్లతో చిత్రబృం‌దాలు హడా‌వుడి చేశాయి.‌ పండ‌గని పరి‌పూ‌ర్ణంగా సద్వి‌ని‌యోగం చేసు‌కొ‌న్నాయి.‌ ప్రచార చిత్రాలే కాదు, కొత్త సిని‌మాల ప్రక‌ట‌న‌లకి కూడా ఉగాది పండగ రోజునే ముహూ‌ర్తంగా నిర్ణ‌యిం‌చు‌కొ‌న్నారు.‌

article image
భరత్, కృష్ణల పంచెకట్టు
మహే‌ష్‌బాబు కథా‌నా‌య‌కు‌డిగా నటి‌స్తున్న చిత్రం ‌‘భరత్‌ అనే నేను’‌.‌ కొర‌టాల శివ దర్శ‌కత్వం వహి‌స్తు‌న్నారు.‌ ‌‘శ్రీమం‌తుడు’‌ తర్వాత ఈ ఇద్దరి కల‌యి‌కలో రాబో‌తున్న చిత్రమిది.‌ ఏప్రిల్‌ 20న ప్రేక్ష‌కుల ముందుకు తీసు‌కు‌రా‌వా‌లని నిర్ణ‌యిం‌చారు.‌ ఇప్ప‌టికే టీజర్‌ కూడా విడు‌ద‌లైంది.‌ అయితే ఉగాది పండ‌గని పుర‌స్క‌రిం‌చు‌కొని తెలు‌గు‌దనం ఉట్టి‌ప‌డేలా పంచె క‌ట్టుతో కూడిన లుక్‌ని విడు‌దల చేశారు.‌ అది అభి‌మా‌ను‌లకే కాకుండా, సాధా‌రణ ప్రేక్ష‌కుల్ని కూడా అల‌రిం‌చింది.‌ సామా‌జిక మాధ్య‌మాల్లో ఎక్కడ చూసినా ఆ లుక్కే దర్శ‌న‌మి‌చ్చింది.‌ అలాగే ‌‘కృష్ణా‌ర్జు‌న‌యుద్ధం’‌లోని కృష్ణలుక్‌ని కూడా పండగ సంద‌ర్భంగా విడు‌దల చేశారు.‌ అందులో నాని పంచెక‌ట్టుతో, పల్లకి మోస్తూ కని‌పిం‌చారు.‌ నాని ద్విపా‌త్రా‌భి‌న‌యంతో తెర‌కె‌క్కు‌తున్న చిత్రం ‌‘కృష్ణా‌ర్జు‌న‌యుద్ధం’‌.‌ మేర్ల‌పాక గాంధీ దర్శ‌కత్వం వహి‌స్తు‌న్నారు.‌ ఈ వేస‌వి‌లోనే చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబో‌తోంది.‌

article image

ఆ జంట ‌‘సమ్మో‌హనం’‌
అచ్చ‌మైన తెలుగు పేర్లతో, అచ్చ‌మైన తెలుగు చిత్రాల్ని తెర‌కె‌క్కించే దర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి.‌ ప్రస్తుతం ‌‘సమ్మో‌హనం’‌ పేరుతో ఓ చిత్రాన్ని తెర‌కె‌క్కి‌స్తు‌న్నా‌రా‌యన.‌ సుధీ‌ర్‌బాబు, అది‌తి‌రావు హైదరీ కథా‌నా‌యిక.‌ తెలుగు పండగ ఉగా‌దిని పుర‌స్క‌రిం‌చు‌కొని ఈ సినిమా లుక్‌ని విడు‌దల చేశారు.‌ పేరుకు తగ్గ‌ట్టు‌గానే ఆ లుక్‌లో సుధీ‌ర్‌బాబు, అది‌తి‌రావు జోడీ సమ్మో‌హ‌నంగా కని‌పిం‌చింది.‌ నాగ‌శౌర్య కథా‌నా‌య‌కు‌డిగా నటి‌స్తున్న ‌‘అమ్మ‌మ్మ‌గా‌రిల్లు’‌ చిత్రబృందం కూడా కొత్త లుక్‌తో పండ‌గకి సందడి చేసింది.‌

article image

మ మ మాస్‌
రవి‌తేజ కథా‌నా‌య‌కు‌డిగా కల్యా‌ణ్‌కృష్ణ కుర‌సాల దర్శ‌క‌త్వంలో తెర‌కె‌క్కు‌తున్న చిత్రం ‌‘నేల టికెట్టు’‌.‌ రవి‌తేజ శైలి మాస్‌ అంశా‌లతో తెర‌కె‌క్కు‌తున్న ఈ సినిమా ఫస్ట్‌‌లుక్‌ పండగ సంద‌ర్భం‌గానే విడు‌ద‌లైంది.‌ సినిమా పేరును కూడా లుక్‌తో పాటే ప్రక‌టిం‌చారు.‌ మహి‌ళల మధ్య కూర్చుని టీ తాగు‌తున్న రవి‌తేజ లుక్కు మాస్‌ని ఆక‌ట్టు‌కు‌నేలా ఉంది.‌ ఈ చిత్రం మే 24న ప్రేక్ష‌కుల ముందుకు రాబో‌తోంది.‌ జె.‌డి.‌చక్రవర్తి కథా‌నా‌య‌కు‌డిగా నటి‌స్తున్న ‌‘ఉగ్రం’‌.‌ అమ్మ రాజ‌శే‌ఖర్‌ నిర్మాత.‌ ఉగాది రోజునే ఈ సినిమా ఫస్ట్‌‌లు‌క్‌ని కూడా విడు‌దల చేశారు.‌ పంచెక‌ట్టుతో జెడి తెలుగు దనాన్ని ప్రద‌ర్శిం‌చారు.‌ వేస‌వి‌లోనే ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వస్తారు.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.