మురిపించే మతాబుల్లా.. మెరిపించే చిచ్చుబుడ్లలా..
భారతీయులకు ఎన్ని పండుగలు ఉన్నా.. అన్ని మతాల వారు, చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంబంరంగా జరుపుకునే పండగ దీపావళి. సమాజంలోనూ, మనసుల్లోనూ అలుముకున్న పెను చీకట్లను చీల్చుతూ ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుకోవాలని ఓ చక్కని సందేశమిస్తుంది ఈ పండుగ.


క కాకరపువ్వొత్తుల వెలుగు, మతాబులు జిలుగు, చిర్రుబుర్రులాడుతూ సందడి చేసే చిచ్చు బుడ్డులు.. రయ్యి మంటూ దూసుకెళ్లే రాకేట్ల సందడులు ఒక్కటేమిటీ దీపావళి తెచ్చే సందడులు అన్నీ ఇన్నీ కావు. అయితే టపాసుల పండక్కు చిత్రసీమ కూడా తనదైన శైలిలో కొత్త టపాసులు ప్రేక్షకులకు కానుకలుగా అందిస్తోంది. ఇప్పటికే కొన్ని సరికొత్త బాంబ్‌లు చిత్రసీమ మార్కెట్‌లో సందడి చేస్తుండగా.. మరికొన్ని ఒకొక్కటిగా బయటకొస్తున్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాల నుంచి మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ తమ కుటుంబాలను పండక్కి తీసుకురాగా.. యువ హీరో నితిన్‌ లక్ష్మీబాంబ్‌లా ఓ సాలీడ్‌ యాక్షన్‌ స్టిల్‌తో, రష్మికతో రాకెట్‌లా ఓ రొమాంటిక్‌ పోస్టర్‌తో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఇక ఈ పండక్కి ‘అనుకోని అతిథి’లా టీజర్‌తో వచ్చి సర్‌ప్రైజ్‌ చేసిన హైబ్రీడ్‌ పిల్ల సాయి పల్లవి. డైనమెట్‌ బాంబ్‌లా పేలతాడనుకున్న ‘డిస్కోరాజా’ పండగ నాడు పద్ధతిగా తన జంటతో సందడి చేయగా.. నాగశౌర్య ‘అశ్వథ్థామ’గా సరికొత్త రూపంలో దర్శనమిచ్చారు. వీటితో పాటు చిత్రసీమ నుంచి మరిన్ని కొత్త లుక్‌లు, టీజర్లు కూడా ఈ దీపావళి వెలుగుల్లో సరికొత్త జిలుగులు నింపుతున్నాయి. మరి ఆ సందడిపై మనమూ ఓ లుక్కేద్దాం పదండి..

‘సరిలేరు నీకెవ్వరు’ ఇంట దీపావళి సందడి..


‘అల.. వైకుంఠపురములో’ బన్ని ఫ్యామిలీ సంబరాలు చూశారా..

తుపాకీ పట్టి వేటకొచ్చిన ‘రూలర్‌’ 

‘నిశ్శబ్దం’గా స్వీటీ ఇచ్చిన దీపావళి కానుక

పండగక్కి బాంబుల మోతంతా వర్మదే అనుకుంటా!!

వీళ్లకి మాత్రం ‘ప్రతిరోజూ పండగే’

పండగకొచ్చిన ఈ ‘అశ్వద్థామ’ మరెవరో కాదు.. నాగశౌర్య!!


‘డిస్కోరాజా’ డైనమెట్‌లా పేలతాడనుకుంటే

పిల్లతో తిరుగుతున్నాడిలా..

ఓవైపు లక్ష్మీబాంబ్‌లా హాట్‌గా.. మరోవైపు రాకెట్‌లా రొమాంటిక్‌గా!!

మంచోడు పండక్కి వచ్చేశాడుగా..Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.