వాటమ్మా.. వాటీజ్‌ దిస్సమ్మా!

వరు ఈ వృద్ధులంతా అనుకుంటున్నారా? జాగ్రత్తగా పరీక్షించి చూడండి తెలుస్తుంది వీళ్లెవరో. కనిపెట్టారా? హా.. అవును మీరు అనుకుంది కరక్టే. ‘భారతీయుడు’ గెటప్‌లో దర్శనమిస్తున్న వారంతా టాలీవుడ్‌ యంగ్‌ హీరోస్‌. ఏంటీ ఇలా అయ్యారంటే.. ఇదంతా షూటింగ్‌ కోసం కాదు, సరదా కోసం అంటున్నారు. స్టార్లంతా సినిమాల్లోనే కాకుండా సమయం దొరికినపుడు డబ్‌స్మాష్, టిక్‌టాక్‌ వంటి వాటిల్లో కనిపిస్తూ అభిమానుల్ని అలరిస్తుంటారు. ఇప్పుడు ‘ఫేస్‌ యాప్‌’ ఆ జాబితాలో చేరింది.భవిష్యత్తులో మనం ఎలా ఉంటామోనని ఆసక్తి ఉండటం సహజం. ఇదే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుందీ యాప్‌. సామాన్య ప్రజలు మాత్రమే కాదు సినీ తారలు దీనిని ఫాలో అవుతున్నారు. నేను ఫ్యూచర్‌లో ఇలా ఉంటబోతున్నానని సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాదు తమ అభిమాన నటుడు భవిష్యత్తులో ఇలా ఉంటాడు, అలా ఉంటాడని అభిమానులు సైతం పోస్ట్‌ చేయడంతో ఇప్పుడీ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. ఇదంతా చూస్తుంటే.. ‘వాటమ్మా.. వాటీజ్‌ దిస్సమ్మా’ అనాల్సిందే. భవిష్యత్తులో ఏ హీరో ఎలా ఉంటాడో మీరూ చూసేయండి.




















Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.