ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న ‘బాహుబలి: ది బిగినింగ్‌’


తెలుగు సినిమా సత్తా ఎంటో ప్రపంచానికి తెలియజేసిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్‌’. ఈ సినిమాకి ముందు భారతీయ చిత్రసీమ గురించి ఎక్కడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ బాహుబలి తెరపైకి వచ్చాక అసలు తెలుగు సినిమా అంటే ఏంటో తెలియజేసింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ విడుదలై నేటికి (జులై 10, 2015) 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇందులో బాహబలిగా ప్రభాస్, భల్లాలదేవగా రానా దగ్గుబాటి, కట్టప్ప పాత్రలో సత్యరాజ్, శివగామిగా రమ్యకృష్ణ నటించారు. చిత్రంలో అవంతికగా తమన్నా, దేవసేనగా అనష్కలు తమ పాత్రల పరిధి మేర నటించి అలరించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళంతో హిందీలో విడుదలై అలరించింది. రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్‌ పతాకంపై నిర్మితమైన చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చగా, కేవీ విజయేంద్ర ప్రసాద్‌ అందించిన కథ ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాకి కె.కె.సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ ప్రత్యేకం. మొత్తం మీద ఇటు తెలుగు సినిమా పరిశ్రమతో పాటు యావత్‌ భారతదేశానికి పేరు తీసుకొచ్చిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్’‌ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో చిత్ర విశేషాలు వైరలౌతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి రానా దగ్గుబాటి ఓ ప్రత్యేక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

View this post on Instagram

A post shared by Rana Daggubati (@ranadaggubati) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.