భారీ సినిమాలండీ... తయారుగా ఉండండి!

భిమాన కథానాయకుడి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు సినీ అభిమానులు. తమ హీరో సినిమాకు సంబంధించి ఎంత చిన్న సమాచారం తెలిసినా సరే వాళ్లకి ఆ రోజంతా పండుగే. సినిమా విడుదలైతే ప్రత్యేకించి చెప్పేదేముంది? థియేటర్లను అందగా అలంకరించటం, సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయి? సినిమా ఎలా ఉందనే రివ్యూలు... ఇలా అంతా హడావుడిగా వాతావరణమే. 2019-2020 సంవత్సరాల్లో బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండేళ్లు సినీ అభిమానులకు పండుగే. టాలీవుడ్‌ దర్శక ధీరుడు రాజమౌళి చెక్కుతున్న మల్టీస్టారర్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు నటిస్తున్నారు. రూ.400కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. 2020కి విడుదల కాబోతోంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా ‘సైరా’. రామ్‌ చరణ్‌ రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతోంది. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా ‘సాహో’. సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై రూ. 225కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఆగస్టు 15న విడుదల కాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ బాబు నటిస్తున్న సినిమా ‘మహర్షి’. మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక బాలీవుడ్, మాలీవుడ్‌ మల్టీస్టారర్‌ సినిమాలు ‘కళంక్‌’, ‘బహ్మస్త్ర’, ‘మరక్కర్‌’(మలయాళం) ఇవి కూడా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. ‘బ్రహ్మస్త్ర’లో అమితాబచ్చన్, నాగార్జున, రణబీర్‌ కపూర్, ఆలియా భట్‌ వంటి నటులు నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్‌ రూ.150 కోట్లు. 2020లో విడుదల కాబోతోంది. కరణ్‌ జోహార్‌ నిర్మాతగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట సినిమా ‘కళంక్‌’. అభిషేక్‌ వర్మన్‌ దర్శకుడు. ఇందులో సంజయ్‌ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్‌ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్యరాయ్‌ కపూర్‌ తదితరులు నటిస్తున్నారు. ఇది ఏప్రిల్‌ 17న విడుదలకాబోతోంది. ఇక మాలీవుడ్‌లో రూపొందుతున్న మల్టీస్టారర్‌ సినిమా ‘మరక్కర్‌’. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇందులో మోహన్‌లాల్, సునీల్‌ శెట్టి, అర్జున్‌షారా, సిద్దిఖి, ప్రభుదేవా, సుదీప్‌లు నటిస్తున్నారు. రూ.100కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. 2020లో విడుదల కాబోతోంది.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.